లలిత్‌పూర్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో లలిత్‌పూర్ జిల్లా (హిందీ:ललितपुर जिला) ఒకటి. లలిత్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. లలిత్‌పూర్ జిల్లా ఝాంసీ డివిజన్‌లో భాగంగా ఉంది.జిల్లావైశాల్యం 5,039 చ.కి.మీ. జిల్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బుండేల్‌ఖండ్ భూభాగంలో ఉంది. లలిత్‌పూర్ పట్టణం భౌగోళికంగా హృదయాకారంలో ఉంటుంది. 24°11' నుండి 25°14' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 78°10' నుండి 79°0' తూర్పు రేఖాంశంలో ఉంది. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 977,447.1974లో ఈ జిల్లా రూపొందించబడింది.

Lalitpur జిల్లా
ललितपुर जिला
ఉత్తర ప్రదేశ్ పటంలో Lalitpur జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో Lalitpur జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుJhansi
ముఖ్య పట్టణంLalitpur, India
Government
 • లోకసభ నియోజకవర్గాలుJhansi
విస్తీర్ణం
 • మొత్తం5,039 కి.మీ2 (1,946 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం12,18,002
 • జనసాంద్రత240/కి.మీ2 (630/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత64.95 per cent
 • లింగ నిష్పత్తి905/1000
Websiteఅధికారిక జాలస్థలి
దేవఘర్‌లోని దశావతార ఆలయం

సరిహద్దులు

జిల్లా ఉత్తర సరిహద్దులో ఉత్తర జిల్లా, తూర్పు సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సాగర్ జిల్లా, తికంగర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గున జిల్లా ఉన్నాయి.

పర్యాటక ప్రాంతాలు

జిల్లా సంప్రదాయం, ప్రశాంతత, సహజ సౌందర్యం ప్రత్యేకత కలిగి ఉంది. జిల్లాలో దేవ్‌ఘర్, సీరొంజి, పవగిరి, దేవమాతా, నీలఖంఠేశ్వర్ (పాలి), మచ్కుండ్‌కి గుఫ మొదలైన పలు సంప్రదాయక, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలు ఉన్నాయి. లలిత్‌పూర్‌లో హిందూ జైన ఆలయాలు ఉన్నాయి. రఘునాథ్‌జీ (బద మందిర్), శివాలే, బూధే బబ్బ (హనుమాన్ ), తువన్ మందిర్, అటా, క్షేత్రపాల్జీ జైన మందిర్ వంటి ప్రముఖ ఆలయాలు ఉన్నాయి.

భౌగోళికం

ఈ జిల్లా బుండేల్ఖండ్ కొండప్రాంతంలో ఉంది. జిల్లాకు దక్షింంలో ఉన్న వింద్యపర్వతశ్రేణి నుండి యమునా నది ఉపనదులు ప్రవహిస్తున్నాయి. దక్షీణ సరిహద్దులో సమాంతరంగా పర్వతశ్రేణి ఉంది. మధ్యలో ఉన్న లోయలలో గ్రానైట్, క్వార్టేజ్ శిలల మీదుగా నదీప్రవాహాలు సాగుతున్నాయి. ఉత్తర భూభాగంలో గ్రానైట్ పర్వతశ్రేణి క్రమంగా చిన్న పర్వత సమూహాలుగా మారాయి.

నదులు

బెత్వానది జిల్లాకు ఉత్తర, పశ్చిమ సరిహద్దులను ఏర్పరుస్తుంది. దాసన్ నది జిల్లాకు ఆగ్నేయ సరిహద్దును ఏర్పరుస్తుంది. జిల్లా ఆగ్నేయ భూభాగంలో దాసన్ వాటర్ షెడ్ ఉంది.

ప్రత్యేక రాష్ట్రం

జిల్లా ప్రస్తుతం రాష్ట్రవేర్పాటు ఉద్యమంలో భాగంగా ఉంది. దక్షిణ ఉత్తరప్రదేశ్‌ భూభాగం, ఉత్తర మధ్యప్రదేశ్ భూభాగాలను కలిపి బుండేల్ఖండ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఉద్యమం కొనసాగుతుంది.

వాతావరణం

వాతావరణం

విషయ వివరణవాతావరణ వివరణ
వాతావరణ వర్గీకరణఉపౌష్ణమండల శీతోష్ణం
వేసవి కాలంమార్చి - జూన్ మధ్య
ఆగ్నేయ ఋతుపవనాలుజూన్ మధ్య - సెప్టెంబరు
పోస్ట్ మాంసూన్స్అక్టోబరు- నంబర్
శీతాకాలండిసెంబరు- ఫిబ్రవరి

చరిత్ర

ప్రస్తుత లలిత్‌పూర్ జిల్లా భూభాగం చందేరీ రాజ్యంలో భాగంగా ఉండేది. చందేరీ రాజ్యం 17వ శతాబ్దంలో బుండేరీ రాజపుత్రులచేత స్థాపించబడింది. అర్చా రాజు ప్రతాప్‌సింగ్ బుండేలు రాజపుత్రులు రాజా రుద్రప్రతాప్ సంతతికి చెందినవారు. 18 వశతాబ్దంలో చెందేరీ ప్రాంతంతో చేర్చి బుండేల్ రాజ్యంలో అధికభాగం మరాఠీ పాలకుల వశం అయింది. గ్వాలియర్ రాజు దౌలత్ రావు సింధియా 1812లో చందేరీ రాజ్యాన్ని తన రాజ్యంతో విలీనం చేసుకున్నాడు. 1844లో చెందేరి భూభాగం బ్రిటిష్ ఇండియాకు ఇవ్వబడింది. తరువాత చందేరి భూభాగం లలిత్‌పూర్ కేంద్రంగా జిల్లా చేయబడింది. 1857 తిరుగుబాటు తరువాత చందేరీ భూభాగం మీద అధికారం బ్రిటిష్ ఇండియా వదులుకుంది. 1858 వరకు ఇది కొనసాగింది. 1861లో బ్రిటిష్ ఇండియా చందేరీ పశ్చిమ భూభాగాన్ని గ్వాలియర్‌కు తిరిగి ఇచ్చింది. మిగిలిన భూభాగం లలిత్‌పూర్ జిల్లాగా చేయబడింది.[1] 1894 - 1974 వరకు లలిత్‌పూర్ ఝాంసీ జిల్లాలో భాగంగా ఉంది. తరువాత లలిత్‌పూర్ ప్రత్యేక జిల్లాగా రూపొందింది.

ఆర్ధికం

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[2]

విభాగాలు

విషయాలువివరణలు
తాలూకాలు3 లలిత్‌పూర్, మెహ్రోని, తాల్బెహత్.
పట్టణాలు4 లలిత్‌పూర్, మెహ్రోని, పాలి, తాల్బెహత్
గ్రామాలు754
అసెంబ్లీ నియోజక వర్గం2 లలిత్‌పూర్, మెహ్రోని
పార్లమెంటు నియోజక వర్గంఝాంసీ

2001 లో గణాంకాలు

విషయాలువివరణలు
జిల్లా జనసంఖ్య .1,218,002,[3]
ఇది దాదాపు.బహరైన్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని.న్యూ హాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో.391వ స్థానంలో ఉంది..[3]
1చ.కి.మీ జనసాంద్రత.242 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం.24.57%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి.905: 1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.తక్కువ
అక్షరాస్యత శాతం.64.95%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.తక్కువ

విద్యాసంస్థ

స్కూలింగ్

నగరం పిల్లల తత్త్వం అభివృద్ధి చెప్పడంలో ఉత్తమ పాఠశాలలు ఉన్నాయి.జవహర్ నవోదయ్ విద్యాలయ (దైల్వారా, లలిత్పూర్)

  • రాణి లక్ష్మీ బాయి పబ్లిక్ స్కూల్. (అర్.ఎల్.పి.ఎస్. లలిత్పూర్)
  • మహేశ్వరి అకాడమీ, లలిత్పూర్
  • సెయింట్ డొమినిక్ సేవియో కాన్వెంట్ స్కూల్. (ఎస్.డి.ఎస్, లలిత్పూర్ )
  • ఆధునిక పబ్లిక్ స్కూల్. (ఎ.పి.ఎస్, లలిత్పూర్ )
  • కేంద్రీయ విద్యాలయ, లలిత్పూర్ .
  • ప్రభుత్వ బాయ్స్ స్కూల్.
  • ప్రభుత్వ బాలికల స్కూల్.
  • శ్రీ వాణి జైన్ ఇంటర్ కోల్లెజ్, లలిత్పూర్ (వాణి కోల్లెజ్)
  • సరస్వతి శిశు & విద్య మందిర్, సివిల్ లైన్స్,లలిత్పూర్
  • అటల్ విద్యా మందిర్ (అజాద్పురా.లలిత్పూర్ )
  • లిటిల్ ఫ్లవర్ స్కూల్, లలిత్పూర్
  • అనిక పబ్లిక్ స్కూల్. (ఎ.పి.ఎస్., లలిత్పూర్ )
  • సిద్ధి సాగర్ అకాడమీ (ఎస్.ఎస్.ఎ,లలిత్పూర్ )
  • ప్రశాంతి విద్యా మందిర్. (పి.వి.ఎం, లలిత్పూర్ )
  • మహార అగ్రసేన్ పబ్లిక్ స్కూల్ (సివిల్ లైన్, లలిత్పూర్)
  • గాయత్రీ విద్యా మందిర్
  • బుండేల్ ఖండ్ ఇంటర్ కోల్లెజ్ జఖ్లౌన్ (లలిత్పూర్ )

హయ్యర్ ఎడ్యుకేషన్

'* సుదర్శన్ డిగ్రీ కళాశాల బంసి లలిత్పూర్ (ఎస్డీసీ)'

  • పహల్వన్ గురుదీన్ మహిళా మహావిద్యాలయ, పనరి (పి.జి.ఎం.ఎం)
  • నెహ్రూ మహా విద్యాలయలో లలిత్పూర్
  • వాణి జైన్ ఇంటర్ కాలేజ్.
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల, లలిత్పూర్
  • పండిట్ దీనదయాళ్ ఉపాధ్య గవర్నమెంట్ కాలేజ్.
  • ఇగ్నో, లలిత్పూర్ క్యాంపస్
  • నగర్ పాలిక గర్ల్స్ కాలేజ్
  • జీనియస్ అకాడమీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దగ్గర కాఫీ హౌస్ స్టేషన్ రోడ్ లలిత్పూర్ కోసం
  • జె.ఎం.కె కాలేజ్ (యు.పి ) కృష్ణ సినిమా స్టేషన్ రోడ్ లలిత్పూర్ సమీపంలో Mgt & టెక్
  • వర్ధమాన్ కళాశాల (యు.పి ) రేవుకు మహావిద్యాలయ లలిత్పూర్ సమీపంలో పారామెడికల్ సైన్స్
  • కమ్యూనికేషన్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ (సి.చి.డి.ఆర్ ), సెంటర్ ఫర్ (యు.పి )
  • లలిత్పూర్ (అర్షద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిడి.ఇ) డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ (యు.పిమ్)
  • శ్రీ దీప్చంద్ర చౌదరి మహావిద్యా ఝాన్సీ (ఎస్.డి.చి.ఎం)
  • సి.సి.డి.ఆర్., లలిత్పూర్ (యు.పి ) ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్ పి.హెచ్.డి

బ్యాంకింగ్ సంస్థలు

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • హెచ్.డీ.ఎఫ్.సి బ్యాంక్, లలిత్పూర్
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్
  • అలహాబాద్ బ్యాంక్
  • బ్యాంక్ ఆఫ్ బరోడా
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • సిండికేట్ బ్యాంక్
  • విజయా బ్యాంక్
  • ఇతర రూరల్ & డిస్ట్రిక్ట్ బ్యాంకులు
  • యూనియన్ బ్యాంక్
  • యాక్సిస్ బ్యాంక్
  • యూకో బ్యాంకు

ప్రయాణ సౌకర్యాలు

జిల్లా రైలు, రహదారి మార్గాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది.

రైలు మార్గం

లలిత్పూర్ రైలు మార్గం భారతీయ ప్రధాన రైలు మార్గంలో ఉంది. జిల్లా రైలు మార్గాల ద్వారా దేశంలోని అన్ని నగరాలతో చక్కగా అనుసంధించబడి ఉంది. నుండి ముంబై, ఢిల్లీ, కోలకతా (హౌరా), చెన్నై, బెంగుళూర్ (బెమ్ంగుళూరు), త్రివేండ్రం, ఇండోర్, అహమ్మదాబాద్, పూనే, జమ్మూ, లక్నో, భూపాల్, జబల్పూర్, కాన్పూర్, ఇతర ప్రధాన పట్టణాలకు జిల్లా నుండి దినదరి రైళ్ళు లభ్యం ఔతున్నాయి..

రహదారి

  • జాతీయరహదారి- 26 లలిత్పూర్ జిల్లా గుండా పయనిస్తుంది.
  • జిల్లా నుండి ప్రధాన నగరాలకు బస్సు సౌకర్యం.:- ఢిల్లీ, లక్నో, కాన్పూర్, ఇండోర్, భూపాల్, సౌగోర్, మీరట్ -

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

వెలుపలి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ