జెబా భక్తియార్

| children = అజాన్}}జెబా భక్తియార్ (ఉర్దూ:زيبا بختيار) ఒక పాకిస్తానీ సినిమా, టెలివిజన్ నటి. ఈమె పాకిస్తాన్ టివి (PTV)లో అనార్కలి అనే నాటకం ద్వారా 1988లో తొలిసారి టెలివిజన్‌లో నటించింది.[1] 1991లో హెన్నా చిత్రంద్వారా సినీరంగప్రవేశం చేసింది.[2] ఈమె ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు అద్నాన్ సామీని వివాహం చేసుకుని విడాకులు తీసుకోవడం ద్వారా వార్తలలోకి ఎక్కింది.[2]

జెబా భక్తియార్
زيبا بختيار
జెబా భక్తియార్
జననం
జెబా భక్తియార్
జీవిత భాగస్వామి
సల్మాన్ గాలియని
(m. 1982, divorced)
(m. 1989; div. 1990)
అద్నాన్ సామీ
(m. 1993; div. 1997)
సోహైల్ ఖాన్ లేగారి
(m. 2008)

నటనా వృత్తి

ఈమె టెలివిజన్ నాటకం అనార్కలి(1988)లో నటించిన తర్వాత రణధీర్ కపూర్ నిర్మించి దర్శకత్వం వహించిన హెన్నా (1991) అనే భారతీయ సినిమాలో నటించింది.[ఆధారం చూపాలి] సర్‌గమ్‌(1995) చిత్రంలో నటనకు ఈమెకు "నిగార్ అవార్డు" లభించింది.[ఆధారం చూపాలి]

ఈమె "మొహబ్బత్‌కీ అర్జూ"(1994), "స్టంట్ మాన్"(1994), "జై విక్రాంత"(1995) మొదలైన భారతీయ సినిమాలలో నటించింది కానీ ఆ చిత్రాలేవీ విజయవంతం కాలేక పోయాయి.[ఆధారం చూపాలి] తరువాత ఈమె పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లి "ముఖద్దమ" (1996), "ఛీఫ్ సాహిబ్" (1996), "ఖైద్" (1996), "బాబు" (2001) మొదలైన సినిమాలలో నటించింది.[ఆధారం చూపాలి] ఈమె 2001లో "బాబు" చిత్రానికి దర్శకత్వం వహించింది కానీ రాణించలేక పోయింది.[ఆధారం చూపాలి]

భక్తియార్ టెలివిజన్ ధారావాహికలలో కూడా నటించింది.[ఆధారం చూపాలి] "పెహ్లీ సీ మొహబ్బత్" అనే సీరియల్‌లో ఈమె వికలాంగురాలిగా నటించింది. ఈమె ఇంకా "కుండి" (1994), "సర్గమ్‌" (1995) మొదలైన "లాలీవుడ్" సినిమాలలో కూడా నటించింది.[ఆధారం చూపాలి]

వ్యక్తిగత జీవితం

జెబా భక్తియార్ మాజీ అటార్నీ జనరల్ యాహ్యా భక్తియార్‌ కుమార్తె.[3] ఈమె తల్లి హంగేరియన్ దేశస్థురాలు, తండ్రి "క్వెట్టా"కు చెందిన పఠాన్ జాతికి చెందినవాడు. ఈమె 1997లో గాయకుడు అద్నాన్ సామీని వివాహం చేసుకుంది. కానీ 1997లో వారు విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు అజాన్ అనే కుమారుడు జన్మించాడు.[2][1][4]

ఫిల్మోగ్రఫీ

సంవత్సరంసినిమా పేరుపాత్ర
1991హెన్నాహెన్నా
1991దేశ్‌వాసి
1994మొహబ్బత్‌ కీ ఆర్జూపూనమ్‌ సింగ్
1994స్టంట్ మాన్
1995జై విక్రాంతనిర్మలా వర్మ
1995సర్‌గమ్‌[1]జేబున్నీసా
1996ముఖద్దమచంచల్ సింగ్
1996ఛీఫ్ సాహిబ్
1999ఖైద్ఖుష్బూ
2001బాబూ
2001ముసల్మాన్
2014ఓ21[1]నిర్మాత
2015బిన్ రోయెసబా తల్లి

టెలివిజన్

  • అనార్కలి (1988)- పాకిస్తాన్ టెలివిజన్ (PTV)
  • తాన్‌సేన్
  • లాగ్
  • ములాఖాత్
  • అబ్‌కే హమ్‌ బిచ్రె తౌ షాయద్
  • ముఖద్దస్ (1996)
  • మెహమాన్
  • షెహర్ ఎ దిల్ కే దర్వాజె
  • మౌమ్‌ (2010)
  • మసూరి
  • దూర్‌దేశ్
  • ఆయే మేరె ప్యార్ కీ ఖుష్బూ
  • ఇష్క్ కీ ఇబ్తిద
  • సంఝౌతా ఎక్స్‌ప్రెస్
  • హజారోఁ సాల్
  • బే ఇమాన్
  • టకౌనే
  • మా ఔర్ మమతా
  • బిన్ రోయే
  • ఆబ్లా పా
  • ఖరాష్
  • పెహ్లీ సీ మొహబ్బత్

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ