పీరియడ్ 2 మూలకం

(Period 2 element నుండి దారిమార్పు చెందింది)
Period 2 in the periodic table
HydrogenHelium
LithiumBerylliumBoronCarbonNitrogenOxygenFluorineNeon
SodiumMagnesiumAluminiumSiliconPhosphorusSulfurChlorineArgon
PotassiumCalciumScandiumTitaniumVanadiumChromiumManganeseIronCobaltNickelCopperZincGalliumGermaniumArsenicSeleniumBromineKrypton
RubidiumStrontiumYttriumZirconiumNiobiumMolybdenumTechnetiumRutheniumRhodiumPalladiumSilverCadmiumIndiumTinAntimonyTelluriumIodineXenon
CaesiumBariumLanthanumCeriumPraseodymiumNeodymiumPromethiumSamariumEuropiumGadoliniumTerbiumDysprosiumHolmiumErbiumThuliumYtterbiumLutetiumHafniumTantalumTungstenRheniumOsmiumIridiumPlatinumGoldMercury (element)ThalliumLeadBismuthPoloniumAstatineRadon
FranciumRadiumActiniumThoriumProtactiniumUraniumNeptuniumPlutoniumAmericiumCuriumBerkeliumCaliforniumEinsteiniumFermiumMendeleviumNobeliumLawrenciumRutherfordiumDubniumSeaborgiumBohriumHassiumMeitneriumDarmstadtiumRoentgeniumCoperniciumUnuntriumFleroviumUnunpentiumLivermoriumUnunseptiumUnunoctium

ఒక పీరియడ్‌ 2 మూలకం అనేది రసాయన మూలకాల, ఆవర్తన పట్టికలోని రెండవ వరుస (లేదా పీరియడ్) లోని రసాయన మూలకాలలో ఒకటి. మూలకాల పరమాణు సంఖ్య పెరిగేకొద్దీ వాటి రసాయన ప్రవర్తనలో పునరావృతమయ్యే (ఆవర్తన) ధోరణులను వివరించడానికి ఆవర్తన పట్టికను అడ్డు వరుసలలో రూపొందించారు: రసాయన ప్రవర్తన పునరావృతం కావడం ప్రారంభించినప్పుడు కొత్త వరుస ప్రారంభమవుతుంది, అంటే ఒకే విధమైన ప్రవర్తన కలిగిన మూలకాలు ఒకే నిలువు వరుసలో వస్తాయి.

రెండవ పీరియడ్లో లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ మూలకాలున్నాయి. పరమాణు నిర్మాణం యొక్క క్వాంటం మెకానికల్ వివరణలో, ఈ పీరియడ్‌ రెండవ ( n = 2 ) షెల్ యొక్క పూరకానికి (మరింత ప్రత్యేకంగా, దాని 2s, 2p సబ్‌షెల్‌లు) అనుగుణంగా ఉంటుంది. పీరియడ్ 2 మూలకాలు (కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్) ఆక్టేట్ నియమాన్ని పాటిస్తాయి. వాటి వేలెన్స్ షెల్‌ను పూర్తి చేయడానికి ఎనిమిది ఎలక్ట్రాన్‌లు అవసరం (లిథియం, బెరీలియంలు డ్యూయెట్ నియమాన్ని పాటిస్తాయి. బోరాన్‌లో ఎలక్ట్రాన్ తక్కువగా ఉంటుంది). వీటి వాలెన్స్ షెల్‌లో గరిష్టంగా ఎనిమిది ఎలక్ట్రాన్‌లు ఉంటాయి - 2s కక్ష్యలో రెండు, 2p సబ్‌షెల్‌లో ఆరు.

ఆవర్తన పోకడలు

పీరియడ్‌ 2 అనేది ఆవర్తన పట్టికలో ఆవర్తన పోకడలను గుర్తించగలిగే మొదటి పీరియడ్‌. కేవలం రెండే మూలకాలున్న (హైడ్రోజన్, హీలియం) పీరియడ్‌<span typeof="mw:Entity" id="mwLQ"> </span>1 చిన్నదవడం వలన దానిలో ఎటువంటి నిశ్చయాత్మక ధోరణులను గుర్తించలేం. ప్రత్యేకించి ఈ రెండు మూలకాలు ఇతర s-బ్లాక్ మూలకాల వలె ఏ విధం గానూ ప్రవర్తించవు. [1] [2] పీరియడ్‌ 2 లో మరింత నిశ్చయాత్మక ధోరణులను చూడవచ్చు. పీరియడ్ 2 లో ఉన్న మూలకాలన్నిటికీ, పరమాణు సంఖ్య పెరిగినప్పుడు, పరమాణు వ్యాసార్థం తగ్గుతుంది, ఎలెక్ట్రోనెగటివిటీ పెరుగుతుంది, అయనీకరణ శక్తి పెరుగుతుంది. [3]

పీరియడ్‌ 2 లో ఉన్న ఎనిమిది మూలకాల్లో లోహాలు రెండే ఉన్నాయి (లిథియం, బెరీలియం). దీని తరువాత వచ్చే పీరియడ్లన్నిటి లోకీ వీటి సంఖ్య, నిష్పత్తి రెండింటిలోనూ ఈ పీరియడ్‌లో తక్కువగా ఉంటాయి. పీరియడ్లన్నిటిలో కంటే ఇందులో అత్యధిక సంఖ్యలో (ఐదు) అలోహాలున్నాయి. ఈ పీరియడ్‌లో మూలకాల ధర్మాలు వాటికి సంబంధించిన గ్రూపులలోని ఇతర మూలకాలతో పోలిస్తే అత్యంత తీవ్రంగా ఉంటాయి. ఉదాహరణకు, ఫ్లోరిన్ అత్యంత రియాక్టివ్ హాలోజన్, నియాన్ అత్యంత జడమైన నోబుల్ వాయువు, [4] లిథియం అతి తక్కువ రియాక్టివ్ క్షార లోహం . [5]

పీరియడ్‌ 2 లోని మూలకాలన్నీ పూర్తిగా మడెలుంగ్ నియమాన్ని పాటిస్తాయి; ఈ పీరియడ్‌ లోని లిథియం, బెరీలియం లలో 2s సబ్‌షెల్‌ నిండుతుంది. బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ లలో 2p సబ్‌షెల్‌ నిండుతుంది. ఈ లక్షణం పీరియడ్‌ 1, పీరియడ్‌ 3 లలో కూడా ఉంటుంది. ఈ మూడు పీరియడ్ల లోనూ ట్రాన్సిషన్ మూలకాలు గానీ, అంతర్గత ట్రాన్సిషన్ మూలకాలు గానీ ఉండవు. [5]

మూలకంబ్లాక్ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషను
3Liలిథియంs-బ్లాక్[He] 2s1
4Beబెరీలియంs-బ్లాక్[He] 2s2
5Bబోరాన్p-బ్లాక్[He] 2s2 2p1
6Cకార్బన్p-బ్లాక్[He] 2s2 2p2
7Nనైట్రోజెన్p-బ్లాక్[He] 2s2 2p3
8Oఆక్సిజన్p-బ్లాక్[He] 2s2 2p4
9Fఫ్లోరిన్p-బ్లాక్[He] 2s2 2p5
10Neనియాన్p-బ్లాక్[He] 2s2 2p6

లిథియం

లిథియం (Li) అనేది పరమాణు సంఖ్య 3 కలిగిన క్షార లోహం. ఇది ప్రాకృతికంగా 6Li, 7Li అనే రెండు ఐసోటోపుల రూపాల్లో లభిస్తుంది. భూమిపై ప్రాకృతికంగా లభించే లిథియం అంతా ఈ రెండు రూపాల్లోనే ఉంటుంది. అయితే మరిన్ని ఐసోటోప్‌లను తయారు చేసారు. అయానిక్ సమ్మేళనాలలో లిథియం, ఒక ఎలక్ట్రాన్‌ను కోల్పోయి, ధనాత్మకంగా చార్జ్ అవుతుంది. దీని వలన కేటయాన్ Li+ ఏర్పడుతుంది. లిథియం, ఆవర్తన పట్టికలోని మొదటి క్షార లోహమే కాదు, [note 1] ఏ రకమైన లోహమైనా ఇదే మొదటిది. [note 2] ప్రామాణిక ఉష్ణోగ్రత, పీడనాల వద్ద లిథియం మృదువైన, వెండి-లాంటి తెలుపు రంగులో ఉండే అత్యంత రియాక్టివ్ లోహం. 0.564 g⋅cm−3 సాంద్రతతో లిథియం, అత్యంత తేలికైన లోహం. అతి తక్కువ సాంద్రత కలిగిన ఘన మూలకం కూడా. [6]

బిగ్ బ్యాంగ్‌లో ఏర్పడిన అతి కొద్ది మూలకాలలో లిథియం ఒకటి. లిథియం భూమిపై అత్యంత సమృద్ధిగా లభించే మూలకాల్లో 33 వది. బరువు ప్రకారం దీని సాంద్రత 20 - 70 ppm మధ్య ఉంటుంది. [7] కానీ దానికి ఉన్న అధిక రియాక్టివిటీ ధర్మం కారణంగా ప్రాకృతికంగా ఇది సమ్మేళనాలలో మాత్రమే లబిస్తుంది. [7]

బెరీలియం

బెరీలియం యొక్క పెద్ద ముక్క

బెరీలియం (Be) అనేది పరమాణు సంఖ్య 4 కలిగిన రసాయన మూలకం. ప్రాకృతికంగా ఇది 9Be రూపంలో లభిస్తుంది. ప్రామాణిక ఉష్ణోగ్రత, పీడనం వద్ద, బెరీలియం 1.85 g⋅cm−3 సాంద్రత కలిగిన, బలమైన, స్టీల్-గ్రే రంగులో ఉండే, తేలికైన, పెళుసైన, బైవాలంట్, క్షార మృత్తిక లోహం. [8] ఇది అత్యధిక ద్రవీభవన బిందువు కలిగిన తేలికపాటి లోహాలలోఒకటి. బెరీలియం యొక్క అత్యంత సాధారణ ఐసోటోప్ 9Be. ఇందులో 4 ప్రోటాన్లు, 5 న్యూట్రాన్లు ఉంటాయి. ఇది ప్రాకృతికంగా లభించే బెరీలియంలో ఇదే దాదాపు 100% ఉంటుంది. దాని ఏకైక స్థిరమైన ఐసోటోప్ కూడా ఇదే; అయితే ఇతర ఐసోటోప్‌లను కూడా సంశ్లేషణ చేసారు. అయానిక్ సమ్మేళనాలలో, బెరీలియం దాని రెండు వాలెన్స్ ఎలక్ట్రాన్‌లను కోల్పోయి, Be2+ కాటయాన్‌గా మారుతుంది.

బోరాన్

బోరాన్ (B) అనేది పరమాణు సంఖ్య 5 కలిగిన రసాయన మూలకం. ఇది 10B, 11B రూపాల్లో ప్రాకృతికంగా లభిస్తుంది. ప్రామాణిక ఉష్ణోగ్రత, పీడనం వద్ద బోరాన్, అనేక విభిన్న అలోట్రోప్‌లను కలిగి ఉండే ఒక ట్రైవాలెంట్ మెటాలోయిడ్. నిరాకార బోరాన్ అనేక రసాయన ప్రతిచర్యల ఉత్పత్తిగా ఏర్పడిన బ్రౌన్ రంగు పొడి. స్ఫటికాకార బోరాన్, అధిక ద్రవీభవన స్థానంతో చాలా గట్టి, నలుపు పదార్థం. బోరాన్ సాంద్రత 2.34 -3. [9] బోరాన్ యొక్క అత్యంత సాధారణ ఐసోటోప్ 80.22% తో 11B. ఇందులో 5 ప్రోటాన్‌లు, 6 న్యూట్రాన్‌లు ఉంటాయి. రెండవ సాధారణ ఐసోటోప్ 19.78% తో 10B. ఇందులో 5 ప్రోటాన్‌లు, 5 న్యూట్రాన్‌లు ఉంటాయి. [10] బోరాన్ కున్న స్థిరమైన ఐసోటోపులు ఈ రెండే; అయితే ఇతర ఐసోటోప్‌లను కూడా సంశ్లేషణ చేసారు. బోరాన్ ఇతర అలోహాలతో సమయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది. దీనికి 1, 2, 3, 4 ఆక్సీకరణ స్థితులు ఉన్నాయి. [11] బోరాన్ స్వేచ్ఛా మూలకంలా ప్రాకృతికంగా ఏర్పడదు; బోరేట్స్ వంటి సమ్మేళనాలలో ఏర్పడుతుంది. బోరాన్ యొక్క అత్యంత సాధారణ వనరులు tourmaline, బోరాక్స్, Na2B4O5(OH)4·8H2O, కెర్నైట్, Na2B4O5(OH)4·2H2O. [9] స్వచ్ఛమైన బోరాన్ పొందడం కష్టం. బోరాన్ ట్రైయాక్సైడ్, (B2O3)ను మెగ్నీషియం రిడక్షను చేయడం ద్వారా బోరాన్‌ను తయారు చేయవచ్చు. [9]

కార్బన్

వజ్రం, గ్రాఫైట్ - కార్బన్ యొక్క రెండు వేర్వేరు అలోట్రోప్‌లు

కార్బన్ అనేది పరమాణు సంఖ్య 6 తో కూడిన రసాయన మూలకం. ఇది 12C, 13C, 14C రూపాల్లో ప్రాకృతికంగా లభిస్తుంది. [12] ప్రామాణిక ఉష్ణోగ్రత, పీడనం వద్ద కార్బన్, ఘనపదార్థం. ఇది అనేక విభిన్న అలోట్రోప్‌లలో సంభవిస్తుంది, వీటిలో అత్యంత సాధారణమైనవి గ్రాఫైట్, డైమండ్, ఫుల్లెరెన్స్, నిరాకార కార్బన్. [12] గ్రాఫైట్ ఒక మృదువైన, షట్కోణ స్ఫటికాకార, అపారదర్శక నలుపు సెమీమెటల్. దీనికి చాలా మంచి వాహకత్వం, థర్మోడైనమిక్‌గా స్థిరమైన లక్షణాలలూ ఉన్నాయి. అయితే డైమండ్ తక్కువ వాహకత్వ లక్షణాలతో అత్యంత పారదర్శక రంగులేని క్యూబిక్ క్రిస్టల్. ఇది ప్రాకృతికంగా లభించే అత్యంత కఠినమైన ఖనిజం. అన్ని రత్నాలలో అత్యధిక వక్రీభవన సూచిక దీనికి ఉంది. డైమండ్, గ్రాఫైట్ ల క్రిస్టల్ లాటిస్ నిర్మాణానికి విరుద్ధంగా, ఫుల్లెరెన్‌లు అణువులతో ఉంటుంది. దీనికి రిచర్డ్ బక్‌మిన్‌స్టర్ ఫుల్లెర్ అనే ఆర్కిటెక్టు పేరు పెట్టారు. దీని అణువుల నిర్మాణం అతని ఆర్కిటెక్చరును పోలి ఉంటుంది. నిరాకార కార్బన్ కూడా ఉంది, ఇది స్ఫటికాకార నిర్మాణం లేని కార్బన్. ఖనిజశాస్త్రంలో, ఈ పదాన్ని మసిని, బొగ్గునూ సూచించడానికి ఉపయోగిస్తారు. అయితే వీటిలో చిన్న మొత్తంలో గ్రాఫైట్ లేదా డైమండ్‌ను ఉన్నందున ఇవి నిజంగా నిరాకారమైనవి కావు. మొత్తం కార్బన్‌లో 98.9% తో 12C, కార్బన్ యొక్క అత్యంత సాధారణ ఐసోటోప్. దీనిలో ఆరు ప్రోటాన్లు ఆరు న్యూట్రాన్లు ఉంటాయి. [13] ఆరు ప్రోటాన్‌లు, ఏడు న్యూట్రాన్‌లతో 13C కూడా స్థిరంగానే ఉంటుంది. దీని వాటా 1.1% . [13] 14C ప్రాకృతికంగా అక్కడక్కడా లభిస్తుంది గానీ, ఈ ఐసోటోప్‌కు రేడియోధార్మికత ఉంది. దీని అర్ధ జీవిత కాలం 5730 సంవత్సరాలు; దీన్ని రేడియోకార్బన్ డేటింగ్ కోసం ఉపయోగిస్తారుది. కార్బన్‌కు ఇతర ఐసోటోపులను కూడా సంశ్లేషణ చేసారు. కార్బన్ -4, −2, +2 లేదా +4 ఆక్సీకరణ స్థితితో ఇతర అలోహాలతో సమయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది. [12]

నైట్రోజన్

ద్రవ నైట్రోజన్ పోస్తారు

నైట్రోజన్ అనేది పరమాణు సంఖ్య 7, చిహ్నం N, పరమాణు ద్రవ్యరాశి 14.00674 u కలిగిన రసాయన మూలకం. ఎలిమెంటల్ నైట్రోజన్ అనేది రంగులేని, వాసన లేని, రుచిలేని, ప్రామాణిక పరిస్థితులలో ఎక్కువగా జడంగా ఉండే డైఅటామిక్ వాయువు. ఇది భూమి వాతావరణం పరిమాణంలో 78.08% ఉంటుంది. నైట్రోజన్ మూలకాన్ని 1772 లో [14] స్కాటిష్ వైద్యుడు డేనియల్ రూథర్‌ఫోర్డ్ గాలిలో నుండి వేరు చేయగలిగిన అంశమని కనుగొన్నాడు. ప్రాకృతికంగా ఇది నైట్రోజన్-14, నైట్రోజన్-15 అనే రెండు ఐసోటోపుల రూపంలో సంభవిస్తుంది. [15]

అమ్మోనియా, నైట్రిక్ యాసిడ్, ఆర్గానిక్ నైట్రేట్‌లు (ప్రొపెల్లెంట్‌లు, పేలుడు పదార్థాలు), సైనైడ్‌ల వంటి అనేక పారిశ్రామికంగా ముఖ్యమైన సమ్మేళనాల్లో నైట్రోజన్‌ ఉంటుంది. నైట్రోజన్‌ మూలకం లోని అత్యంత బలమైన బంధం, నైట్రోజన్ రసాయనిక తత్వంపై ఆధిపత్యం చెలాయిస్తుంది. దీని వలన, జీవులు, పరిశ్రమలు రెండింటికీ ఈ బంధాన్ని విచ్ఛిన్నం చేసి N
2
అణువును ఉపయోగకరమైన సమ్మేళనాలుగా మార్చడంలో ఇబ్బంది ఎదురౌతుంది. కానీ అదే సమయంలో ఈ సమ్మేళనాలు మండినప్పుడు, పేలినప్పుడు లేదా తిరిగి నైట్రోజన్ వాయువుగా మారినప్పుడు ఉపయోగకరమైన శక్తిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి.

ఆక్సిజన్ అనేది పరమాణు సంఖ్య 8 కలిగిన రసాయన మూలకం. ఇది ఎక్కువగా 16O గా లభిస్తుంది. 17O, 18O గా కూడా సంభవిస్తుంది.

ఆక్సిజన్ ద్రవ్యరాశి ప్రకారం విశ్వంలో మూడవ అత్యంత సాధారణ మూలకం (సంఖ్యలో కార్బన్ అణువులు ఎక్కువ ఉన్నప్పటికీ, కార్బన్ అణువు తేలికైనది). ఇది చాలా ఎలక్ట్రోనెగటివ్, అలోహం, సాధారణంగా డైఅటోమిక్, చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా వాయురూపం లోనే ఉంటుంది. నాన్-మెటాలిక్ మూలకాలలో ఫ్లోరిన్ మాత్రమే దీని కంటే ఎక్కువ రియాక్టివ్‌గా ఉంటుంది. దీనిలో పూర్తి ఆక్టెట్ కంటే రెండు ఎలక్ట్రాన్‌లు తక్కువ. ఇతర మూలకాల నుండి ఎలక్ట్రాన్‌లను సులభంగా తీసుకుంటుంది. ఇది గది ఉష్ణోగ్రత వద్ద క్షార లోహాలు, తెల్ల భాస్వరంతో బాగా తీవ్రం గాను, మెగ్నీషియం కంటే బరువైన క్షార మృత్తిక లోహాలతో తక్కువ తీవ్రం గానూ ప్రతిస్పందిస్తుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఇది చాలా లోహాలు, అనేక అలోహాలను (హైడ్రోజన్, కార్బన్, సల్ఫర్‌తో సహా) కాల్చేస్తుంది. చాలా ఆక్సైడ్లు కుళ్ళిపోవడానికి చాలా కష్టతరమైన పదార్థాలు. ఉదా: కార్బన్ డయాక్సైడ్, అల్యూమినా, సిలికా, ఐరన్ ఆక్సైడ్లు. కొన్ని లోహాల లవణాలు, ఆక్సిజన్-కలిగిన ఆమ్లాలలో (అందువలన నైట్రేట్లు, సల్ఫేట్లు, ఫాస్ఫేట్లు, సిలికేట్లు, కార్బోనేట్‌లు) భాగం.

ప్రాణవాయువు జీవులన్నిటికీ అత్యవసరం. మొక్కలు, ఫైటోప్లాంక్టన్ కిరణజన్య సంయోగక్రియలో నీరు, కార్బన్ డయాక్సైడ్ లను సూర్యకాంతి సమక్షంలో చక్కెరలను ఏర్పరచి ఆక్సిజన్ విడుదల చేస్తాయి. అప్పుడు చక్కెరలు సెల్యులోజ్ ప్రోటీన్లు వంటి జీవికి అవసరమైన ఇతర ముఖ్యమైన పదార్ధాలుగా మార్చబడతాయి. జంతువులు ముఖ్యంగా శిలీంధ్రాలు, బ్యాక్టీరియా కూడా ఆహారం, ఆక్సిజన్‌ల కోసం మొక్కలు, ఫైటోప్లాంక్టన్‌ జరిపే కిరణజన్య సంయోగ క్రియపై ఆధారపడి ఉంటాయి.

ఫ్లోరిన్

ఆంపౌల్‌లో ద్రవ ఫ్లోరిన్

ఫ్లోరిన్ అనేది పరమాణు సంఖ్య 9 కలిగిన రసాయన మూలకం. ఇది దాని ఏకైక స్థిరమైన రూపమైన 19F రూపంలో [16] ప్రాకృతికంగా సంభవిస్తుంది.

ఫ్లోరిన్ సాధారణ పరిస్థితుల్లోను, చాలా తక్కువ ఉష్ణోగ్రతల వరకు లేత-పసుపు రంగులో ఉండే డయాటోమిక్ వాయువు. దీని పరమాణువులో అత్యంత స్థిరమైన ఆక్టెట్‌ కంటే ఒక ఎలక్ట్రాన్‌ తక్కువగా ఉంటుంది. దీనివలన, ఫ్లోరిన్ అణువులు అస్థిరంగా ఉండి, ఏ ఇతర మూలకం నుండి అయినా చప్పున ఒక ఎలక్ట్రాన్‌లను పట్టుకుంటాయి. ఫ్లోరిన్ మూలకాలన్నిటి లోకీ అత్యంత రియాక్టివుగా ఉంటుంది. ఇది అనేక ఆక్సైడ్‌లపై దాడి చేసి, ఆక్సిజన్‌ను తొలగించి దాని స్థానం లోకి చేరుతుంది. బలమైన ఆమ్లాలను రవాణా చేసే సిలికాపై కూడా దాడి చేస్తుంది, ఆస్బెస్టాస్‌ను కాల్చేస్తుంది. అత్యంత స్థిరమైన సమ్మేళనాలలో ఒకటైన సాధారణ ఉప్పుపై దాడి చేసి, క్లోరిన్‌ను విడుదల చేస్తుంది. ఇది ప్రకృతిలో ఎప్పుడూ సమ్మేళనంగా కాకుండా కనిపించదు. ఒంటరిగా ఎక్కువ కాలం ఉండదు. ఇది హైడ్రోజన్‌ను వెంటనే కాల్చేస్తుంది - అది ద్రవ రూపంలో ఉన్నా, వాయు రూపంలో ఉన్నా. అది సంపూర్ణ సున్నాకి దగ్గరగా ఉన్న ఉష్ణోగ్రతల వద్ద కూడా కాల్చేస్తుంది.. [17] ఇది సమ్మేళనంగా ఏర్పడకుండా ఉంచడమే కాదు, ఏదైనా సమ్మేళనాల నుండి వేరుచేయడం కూడా చాలా కష్టం.

నియాన్

నియాన్ డిచ్ఛార్జ్ ట్యూబ్

నియాన్ అనేది పరమాణు సంఖ్య 10 కలిగిన రసాయన మూలకం, ఇది 20Ne, 21Ne, 22Ne రూపాల్లో ప్రాకృతికంగా సంభవిస్తుంది. [18]

నియాన్ ఒక మోనో అటామిక్ వాయువు. బాహ్య ఎలక్ట్రాన్లు పూర్తి ఆక్టెట్‌గా ఉంటాయి. అంచేత దీని నుండి ఎలక్ట్రాన్‌ను తొలగించడానికి అధిక నిరోధకత ఉంటుంది. ఇది దేని నుండి ఎలక్ట్రాన్‌ను తీసుకోలేదు. నియాన్ సాధారణ ఉష్ణోగ్రతలు, పీడనాల వద్ద ఎటువంటి సాధారణ సమ్మేళనాలను ఏర్పరుచదు. అది జడమైనది. ఇది "ఉత్కృష్ట వాయువులు" అని పిలవబడే వాటిలో ఒకటి.

నియాన్ వాతావరణంలో చెదురుమదురుగా ఉంటుంది. జీవులపై దీనికి ఎటువంటి పాత్ర లేదు.

గమనికలు

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ