2014 హిమాలయ పర్వత హిమ సంపాతం

2014 ఏప్రిల్ 18 న హిమాలయ పర్వత శ్రేణిలోని ఎవరెస్ట్ పర్వత పశ్చిమ భాగంలో సెరక్ తయారై 16 మంది నేపాలీ గైడ్ ల ప్రాణాలు తీసింది. సెరక్ అంటే హిమ సంపాతం అని అర్ధం.  ఒక పెద్ద గుర్రమంత ఎత్తుండే  మంచు గడ్డ అది. ఖుంబు వద్ద ఉన్న ఐస్  ఫాల్ లో ఉన్న గైడ్ లపై పడి వారు మరణించారు. ఇటువంటే హిమ సంపాతమే 1970లో ఎవరెస్ట్ పర్వతంలోనే జరిగింది. ఈ దుర్ఘటనలో 16 మంది చనిపోగా, 13 శవాలు  దొరికాయి. మిగిలిన 3 శవాలు ఇప్పటికీ దొరకలేదు. ఆ 3 శవాలను తీయాలంటే దాదాపు  ప్రాణాలు వదిలేసుకోవడమే. అంత ప్రమాదకరం కాబట్టే ఆ శవాల వెలికితీత మధ్యలోనే వదిలేసింది నేపాల్ ప్రభుత్వం. నేపాల్ ప్రభుత్వం బాధితుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించినా షెర్పాకు చెందిన  కొంతమంది గైడ్ లు నిరసన వ్యక్తం చేశారు. చనిపోయినవారి గౌరవార్ధం 2014 సంవత్సరం మొత్తం ఎవరెస్ట్ పై పని చేయమని ప్రతిజ్ఞ చేసి,  పూర్తి చేశారు ఆ గైడ్ లు.

నేపథ్యం

గోక్యో రీ దగ్గర నుంచీ ఎవరెస్ట్ 

ఎవరెస్ట్ పర్వతంపై గైడ్ ఉపాధి

ఒక ఎవరెస్ట్ పర్వత గైడ్ రోజుకు ఒక్క ఆరోహణకు 125 డాలర్లు సంపాదిస్తారు. ఎక్కువగా పర్వతారోహణ కుటుంబాలకు చెందిన వీరు ఈ వృత్తిని ఆదాయ మార్గంగా ఎంచుకుని, దీనిపైనే సాధన చేస్తూ పెరుగుతారు. షెర్పస్ జాతికి చెందిన వారే ఎక్కువగా ఈ ప్రదేశంలో గైడ్ లుగా పనిచేస్తున్నారు. ఆరోహణకు వీలైన సీజన్ లో 350 నుంచి 450 మంది గైడ్ లు పనిచేస్తుంటారు.[1] నేపాల్ తలసరి ఆదాయం సంవత్సరానికి 700 డాలర్లు కాగా, ఈ గైడ్ లది మాత్రం 5,000 డాలర్లు.[2]

స్థానిక గైడ్ లు ఇబ్బంది పెడుతున్నారంటూ కొంతమంది విదేశీయులు తమతో పాటు స్వంత గైడ్ లను తెచ్చుకుంటున్నారు.[1] 2013లో ఎవరెస్ట్ పర్వతంపై 1 అనుభవజ్ఞ గైడ్ తో పాటు 8 మంది మనుష్యులు చనిపోయారు.

ఖుంబు ఐస్ ఫాల్ మార్గం

ఖుంబు ఐస్ ఫాల్ మార్గంలోని అస్థిర మంచుగడ్డల వల్ల ఆరోహకులు తెల్లవారుజామునే, ఎండ వల్ల మంచు కరగడం మొదలవ్వకముందే, ఈ మార్గాన్ని దాటడానికి ప్రయత్నిస్తారు.[1] రక్షణ సరిగా లేదంటూ 2012 లో హిమెక్స్ గైడ్ కంపెనీ యజమాని తన సంస్థని మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఎవరెస్ట్ పర్వత పశ్చిమ భుజ భాగంలో ఉన్న 300 మీటర్ల మంచు కొండ ఎప్పుడైనా దాని కింద నుంచే నడిచి వెళ్ళేవారిపై పడవచ్చని ఆయన ఉద్దేశం. "50మంది మనుష్యులు దాని కింద నుంచీ నడిచి వెళ్తుంటే చాలా భయంగా ఉంటుంది" అని తెలిపారాయన.[3] కానీ హిమెక్స్ కంపెనీ 2014 సీజన్ లో తిరిగి ప్రారంభించినా, ఎవరెస్ట్ దక్షిణ మార్గాన్నే ఎంచుకున్నాయి.[4] పర్వతారోహకుడు అలన్ అర్నెట్టె ఒక రిపోర్ట్ లో ఈ మంచు కొండ గురించి చెబుతూ ప్రతీ సీజన్ లోనూ ఖుంబు ఐస్ ఫాల్ మార్గంలో ఆపదగా ఉంటూ వస్తోందనీ, ఎప్పుడూ మంచును మార్గంలో పడేస్తోందనీ వివరించారు. 2012 లో ఎందరో ఆరోహకులకు ఈ కొండ వల్ల ఆపద రాబోయి, వారు తృటిలో తప్పించుకున్నారని తెలిపారు.[5] 2014 హిమ సంపాత ప్రమాదానికి కారణం ఈ పెద్ద మంచు కొండ నుండి ఒక బ్లాక్ వచ్చి దానిని దాటుతుండగా జరిగిందని రచయిత, పర్వతారోహకుడు జాన్ క్రకౌర్ అన్నారు.[3]

మంచు పరిణామాల ప్రకారం ప్రతీ సీజన్ లోనూ ఆరోహకులు తమ మార్గం మార్చుకుంటూ వస్తుంటారు.[6]

హిమ సంపాతం

18 ఏప్రిల్ 2014 ఉదయం 6:45 గంటల సమయంలో దాదాపు 5,800 మీటర్ల ఎత్తులో ఎవరెస్ట్ పర్వత దక్షిణ భాగాన ఒక హిమ సంపాతం సంభవించింది.[7] దాదాపు 25మంది గైడ్లు తరువాతి సీజన్ కోసం ఏర్పాట్లు చేస్తుండగా మంచు కొండ వారిపై పడింది.[6] మృతుల్లో  ఎక్కువగా షెర్పా గైడ్ లే ఉన్నారు.[3] ఈ ప్రమాద స్థలాన్ని స్థానికంగా గోల్డెన్ గేట్ అనీ, పాప్ కార్న్ ఫీల్డ్ అనీ అంటారు.[1][7] మొదటి, రెండో కాంప్ ల మధ్యన రెండో కాంప్ కు చెందిన దర్శనీయ ప్రదేశం అది.[8]

ఎవరెస్ట్ పర్వతంలోని పశ్చిమ భుజ భాగంలో పెద్ద సెరక్ విరిగిపోవడంతో  ఈ హిమ సంపాతం జరిగింది. నిజానికి ఇది మంచే అయినా రాయి లాంటి పరిమాణం దానిది.[1][5] దీని ఎత్తు 34.5 మీటర్లు,  బరువు 14300 టన్న్నులు ఉండవచ్చని అంచనా వేశారు.[9]

బాధితులు

2014
బాధితులు[1]
మింగ్మా నురు షెర్పా
దోర్జీ షెర్పా
అంగ్ త్షిరి షెర్పా
నిమా షెర్పా
ఫుర్బా ఒంగ్యల్ షెర్పా
లక్పా తెంజింగ్ షెర్పా
ఛిరింగ్ ఒంగ్చు షెర్పా
దోర్జీ ఖటారీ
థెన్ దోర్జీ షెర్పా
ఫుర్ తెంబా షెర్పా
పసంగ్ కర్మా షెర్పా
అస్మన్ తమంగ్
తెంజింగ్ చొత్తర్ షెర్పా
అంకజీ షెర్పా
పెం తెంజీ షెర్పా
అష్ బహదుర్ గురుంగ్

ఈ దుర్ఘటనలో 16మంది చనిపోగా, 13 మృతదేహాలను 48గంటలలోపు వెలికి తీయగలిగారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వెలికితీత జరగాల్సి ఉండటంతో 80 నుండి 100మీటర్ల లోతు ఉన్న మంచులో ఇరుక్కుపోయిన 3 మృతదేహాలను అలాగే వదిలేశారు. ఈ సంఘటనలో 9 మంది గాయపడగా, ముగ్గురు  అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రిలో చేరారు.[10]

మృతుల్లో నలుగురు నేపాల్ లోని సొలుఖుంబు జిల్లాకు చెందిన షెర్పా జాతి వారు కాగా,[11] మిగిలిన అయిదుగురు డిస్కవరీ చానల్ కు చెందినవారు. జాబీ ఒగ్విన్ తరువాతి సీజన్ లో పర్వతం నుంచి బేస్ జంప్ చేసేందుకు ఏర్పాట్లు చేయడానికి డిస్కవరీ చానల్ కు చెందిన ఆ అయిదుగురు వచ్చారు.[12] ఈ సంఘటనల్లో విదేశీయులెవరూ చనిపోలేదు.[1] బేస్ క్యాంప్ కు టెంట్లు, స్టౌలు, ఆక్సిజన్ మారుస్తున్న సమయంలో ఈ ఉత్పాతం జరిగిందని పర్వతారోహకుడు టిం రిప్పిల్ వివరించారు.[1] వీరు తెల్లవారుజామునే బయలుదేరినా, వాతావరణ పరిస్థితుల వల్ల వారు అధిరోహించడం చాలా ఆలస్యమైంది.[6][12] అక్కడే ఎవరెస్ట్ (2015) సినిమాకు చెందిన సిబ్బంది ఉన్నారు. కానీ వారు పెద్దగా గాయపడలేదు. ఈ సంపాతం జరగడంతో అక్కడ ఉన్న ఇతర గైడ్లు సహాయక చర్యలు చేపట్టారు.[13] మొత్తం 9 మంది షెర్పా గైడ్లు, ముగ్గురు విదేశీయులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.[10]

ఎవరెస్ట్ చరిత్రలోనే రెండో అతిపెద్ద విపత్తు ఇది. దక్షిణ భాగంలో జరిగిన ఈ హిమపాతం వల్ల తరువాతి ఏడాది 25 ఏప్రిల్ 2015న నేపాల్ లో 7.8 మ్యాగ్నిట్యూడ్ తో భూకంపం సంభవించింది.

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ