హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మహానగర అభివృద్ధి ప్రణాళిక సంస్థ

హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మహానగర అభివృద్ధి ప్రణాళిక సంస్థ. ఇది 7,257 కిమీ (2,802 చదరపు మైళ్ళు) విస్తీర్ణం పరిధిలోవున్న హైదరాబాద్ జిల్లా, మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా, రంగారెడ్డి జిల్లాలోని కొన్ని మండలాలు, సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, సిద్ధిపేట జిల్లాలతో కూడిన హైదరాబాద్ మహానగర ప్రాంతాన్ని నిర్వహిస్తుంది.[1][2] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా), హైదరాబాదు విమానాశ్రయ అభివృద్ధి సంస్థ (హడా), సైబరాబాదు అభివృద్ధి సంస్థ (సిడిఎ), బుద్ధ పూర్ణిమా ప్రాజెక్ట్ సంస్థ (బిపిపిఎ) వంటి సంస్థలను 2008లో విలీనం చేసి ఈ హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేశారు.

హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ
హెచ్‌ఎండీఏ లోగో
సంస్థ వివరాలు
స్థాపన2008
Preceding agencyహైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ
అధికార పరిధి
జాబితా
ప్రధానకార్యాలయంహైదరాబాదు, తెలంగాణ
17°21′57″N 78°28′33″E / 17.36583°N 78.47583°E / 17.36583; 78.47583
వార్షిక బడ్జెట్ 54.5236 బిలియన్
సంబంధిత మంత్రులుకల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, (ముఖ్యమంత్రి/చైర్మన్)
కల్వకుంట్ల తారక రామారావు, (పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి)
కార్యనిర్వాహకులుఅరవింద్‌ కుమార్‌, ఐఏఎస్, (పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, నగర కమీషనర్)
బి. ఆనంద్ మోహన్, (PD-ORRi/c)
రామ్‌కిషన్, (కార్యదర్శి)
Parent agencyపురపాలక, పట్టణాభివృద్ధి శాఖ
Child agencyహైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ

అధికార పరిధి

7 జిల్లాలు, 70 మండలాలు, 1032 గ్రామాలను కలిగివున్న ఈ మహానగర ప్రాంతంలో హైదరాబాదు మహానగరపాలక సంస్థ ఉంది. ఇందులో 175 గ్రామాలు, 31 గ్రామాలతో కూడిన 12 ముస్సిపాలిటీలు/నగర పంచాయతీలు ఉన్నాయి.

క్రమసంఖ్యజిల్లామండలాలుమొత్తం మండలాలు
1హైదరాబాదు జిల్లామొత్తం జిల్లా16
2మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లామొత్తం జిల్లా - ఘటకేసర్, శామీర్‌పేట, మేడ్చెల్, ఉప్పల్, కీసర, కుత్బుల్లాపూర్, మేడిపల్లి, బాచుపల్లి, దుండిగల్, కాప్రా, బాలానగర్, కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి, అల్వాల్14
3రంగారెడ్డి జిల్లాచేవెళ్ళ, హయత్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, కందుకూర్, మహేశ్వరం, మంచాల్, మొయినాబాదు, రాజేంద్ర నగర్, సరూర్‌నగర్‌, షాబాద్, శంషాబాదు, శంకర్‌పల్లి, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్, బాలాపూర్, ఫరూఖ్‌నగర్, గండిపేట్, కొత్తూరు, నందిగామ, శేరిలింగపల్లి20
4సంగారెడ్డి జిల్లాపటాన్‌చెరు, రామాచంద్రాపురం, సంగారెడ్డి, అమీనాపూర్, గుమ్మడిదల, జిన్నారం, కంది, హత్నూర8
5మెదక్ జిల్లామనోహరబాద్, నర్సాపూర్, శివంపేట, తూఫ్రాన్4
6సిద్ధిపేట జిల్లామర్కూక్, ములుగు, వర్గల్3
7యాదాద్రి భువనగిరి జిల్లాబీబీనగర్, బొమ్మలరామారం, భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి5

విధులు - బాధ్యతలు

  1. హైదరాబాదు మహానగర ప్రాంతంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, సమన్వయం, పర్యవేక్షణ, ప్రచారం, భద్రత మొదలైన అంశాల ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతాయి.
  2. హైదరాబాదు మహానగర నీటి సరఫరా & మురుగునీటి శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రసార శాఖ, తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ వంటి సంస్థల సమన్వయంతో హైదరాబాదు మహానగర పరిధిలోని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, ఇతర స్థానిక సంస్థల అభివృద్ధికై అనేక కార్యకలాపాలను చేస్తుంది.

ఔటర్ రింగ్ రోడ్డు

ఈ సంస్థ 6696 కోట్ల రూపాలయ ఖర్చుతో ఔటర్ రింగ్ రోడ్‌ను నిర్మించింది. 2005లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ 2018, మే నెలలో పూర్తయింది.[3]

లాజిస్టిక్ పార్కులు

నగరంలో ట్రాఫిక్ సమస్యను నివారించడం, మెరుగైన ప్రయాణ సదుపాయాలను కల్పించి, రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ఇతర ప్రదేశాలకు తరలించేందుకు, అవసరమైన ముడిసరులకు దిగుమతి చేసుకునేందుకు వీలుగా ఔటర్ రింగు రోడ్డు చుట్టూ బాటసింగారం, మంగల్‌పల్లి దగ్గర లాజిస్టిక్ పార్కులను ఏర్పాటుచేయబడ్డాయి.[4]

అభివృద్ధి పన్ను

కొత్తగా నిర్మితమవతున్న ప్రాంతాలలో భవనాల నిర్మాణం కోసం బిల్డర్ల చెల్లించే అభివృద్ధి ఛార్జీలో హైదరాబాదు మహానగర అభివృద్ధి పనులకోసం 50 శాతం పెరుగుదలను ప్రభుత్వం ఆమోదించింది.[5]

ఇవికూడా చూడండి

మూలాలు

ఇతర లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ