హెర్ట్జ్

పౌనఃపున్యపు కొలత ప్రమాణం

హెర్ట్జ్ (hertz చిహ్నం: Hz) అనేది సమయం నుండి ఉత్పన్నమయిన ఒక ప్రమాణం, ఇది అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతిలో పౌనఃపున్యమును కొలుస్తుంది. పౌనఃపున్యము అనగా ప్రమాణకాలంలో చేయు డోలనాలు లేదా కంపనాల సంఖ్య. 1 హెర్ట్జ్ యొక్క పౌనఃపున్యం అర్థం ఒక సెకనుకు ఒకసారి ఏర్పడిన కంపనం. మధ్య C (పియానో యొక్క మధ్యలో C) నోట్ 262 Hz అనగా, దీనర్థం ఇక్కడ ప్రతి సెకనుకు 262 సార్లు కంపిస్తుంది, పియానో కీ బోర్డులో మిడిల్ C నోట్ ను ప్లే చేసినప్పుడు వెలువడిన శ్రవణాన్ని మనం మిడిల్ C నోట్‌గా ఆలకిస్తాము.

వివిధ పౌనఃపున్యంతో ఒక సైన్ తరంగం
పై నుంచి కిందకు వరసగా పౌనఃపున్యములు f = 0.5 Hz వున్నది 2 సెకన్లకు ఒకసారి, 1.0 Hz వున్నది 1 సెకనుకు ఒకసారి, 2.0 Hz వున్నది అర సెకనుకు ఒకసారి వెలుగుతున్నవి.

మానవులు 20 Hz నుండి 20,000 Hz మధ్య ధ్వనులను వినగలుగుతారు. గుడ్లగూబ 200 Hz నుండి 12,000 Hz మధ్య ధ్వనులను వినగలుగుతుంది. ప్రాధమిక యూనిట్ 1/సెకను. ఈ హెర్ట్జ్ యూనిట్ పేరు హెన్‌రిచ్ రుడాఫ్ హెర్జ్ శాస్త్రవేత్త పేరు మీద ఏర్పడింది.

బహుళ యూనిట్లు

1000 హెర్ట్జ్ అనగా 1 కిలోహెర్జ్. 1000 కిలోహెర్జ్ అనగా 1 మెగాహెర్జ్, 1000 మెగాహెర్జ్ అనగా 1 గిగాహెర్ట్జ్: (ఈ క్రింది పట్టిక చూడండి)

UnitEqual to:
Kilohertz (KHz)1000 Hz
Megahertz (MHz)1000 KHz
Gigahertz (GHz)1000 MHz
Terahertz (THz)1000 GHz
Petahertz (PHz)1000 THz
Exahertz (EHz)1000 PHz
Zettahertz (ZHz)1000 EHz
Yottahertz (YHz)1000 ZHz

ఉదాహరణలు

  • భూమి భ్రమణం (24 గంటలకు ఒకసారి) యొక్క పౌనఃపున్యం 12 మైక్రోహెర్ట్జ్ (1Hz కంటే చాలా తక్కువ)
  • ఈ హెర్ట్జ్ ను కొన్నిసార్లు కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్‌లలో ప్రాసెసర్ యొక్క శక్తిని కొలవడానికి ఉపయోగిస్తారు.
  • యునైటెద్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోని అమెచ్యూర్ రేడియో 1.8 నుంచి 1300 MHz మధ్య వివిధ పౌనఃపున్యాలను కలిగిస్తుంది.
  • ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ 3, 25 MHz మధ్య పౌనఃపున్యాలను అలాగే 108, 136 MHz మధ్య పౌనఃపున్యాలను ఉపయోగిస్తుంది.
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ