హర్యానా జిల్లాల జాబితా

హర్యానా జిల్లాల జాబితా

హర్యానా, భారతదేశ ఉత్తర ప్రాంతంలోని ఒక రాష్ట్రం. హర్యానా రాష్ట్రంలో 2023 నాటికి 22 జిల్లాలు ఉన్నాయి.దేశంలోని రాష్ట్రాలలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలో పద్దెనిమిదవ స్థానంలో ఉంది.[1] రాష్ట్రానికి ఉత్తరాన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమాన, దక్షిణాన రాజస్థాన్ సరిహద్దులుగా ఉన్నాయి. యమునా నది ఉత్తర ప్రదేశ్‌తో తన తూర్పు సరిహద్దును నిర్వచిస్తుంది. హర్యానా కూడా ఢిల్లీని మూడు వైపులా చుట్టుముట్టి, ఢిల్లీకి ఉత్తర, పశ్చిమ, దక్షిణ సరిహద్దులను ఏర్పరుస్తుంది. తత్ఫలితంగా, హర్యానాలోని పెద్ద ప్రాంతం జాతీయ రాజధాని ప్రాంతంలో చేర్చబడింది. చండీగఢ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల సంయుక్త రాజధాని.

విభజనల వారీగా సమూహం చేయబడిన హర్యానా జిల్లాల పటం

చరిత్ర

1966 నవంబరు 1న అప్పటి తూర్పు పంజాబ్ విభజన ప్రణాళిక ప్రకారం హర్యానా ఏడు జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.అవి రోహ్తక్, జింద్, హిసార్, మహేంద్రగఢ్, గుర్గావ్, కర్నాల్, అంబాలా. భాషా జనాభా ఆధారంగా అప్పటి లోక్‌సభ స్పీకర్ -పార్లమెంటరీ కమిటీ సర్దార్ హుకమ్ సింగ్ సిఫార్సు తర్వాత విభజన జరిగింది.[2] పూర్వపు జిల్లాలను పునర్వ్యవస్థీకరించడం ద్వారా తర్వాత మరో 15 జిల్లాలు జోడించబడ్డాయి.హర్యానా మొదటి ముఖ్యమంత్రిగా ా పండిట్ భగవత్ దయాళ్ శర్మ పనిచేసాడు.

2016లో, పెద్ద భివానీ నుండి చర్కీ దాద్రీ జిల్లాను రూపొందించారు. [3]

జిల్లాల జాబితా

హర్యానా రాష్ట్రం 2023 నాటికి ఈ దిగువ వివరింపబడిన 22 జిల్లాలతో విభజనతో ఉంది:

వ.సంఖ్యజిల్లా పేరుకోడ్ప్రధాన కార్యాలయంస్థాపనవిస్థార్ణం (చ.కి.మీ.లలో)జనాభా (2011 లెక్కల ప్రకారం)[4]రాష్ట్రంలో జిల్లా స్థానం
1అంబాలాAMఅంబాలా1966 నవంబరు 11,5741,136,784
2భివానీBHభివాని1972 డిసెంబరు 223,4321,629,109
3చర్ఖీ దాద్రి CDచర్ఖీ దాద్రి2016 డిసెంబరు 11370502,276
4ఫరీదాబాద్FRఫరీదాబాద్1979 ఆగష్టు 157921,798,954
5ఫతేహాబాద్FTఫతేహాబాద్1997 జులై 152,538941,522
6గుర్‌గావ్GUగుర్‌గావ్1966 నవంబరు 11,2531,514,085
7హిసార్HIహిసార్1966 నవంబరు 13,9831,742,815
8ఝజ్జర్JHఝజ్జర్1997 జులై 151,834956,907
9జింద్JIజింద్1966 నవంబరు 12,7021,332,042
10కైతల్KTకైతల్1989 నవంబరు 12,3171,072,861
11కర్నాల్KRకర్నాల్1966 నవంబరు 12,5201,506,323
12కురుక్షేత్రKUకురుక్షేత్రం1973 జనవరి 231,530964,231
13మహేంద్రగఢ్MHనార్నౌల్1966 నవంబరు 11,859921,680
14నూహ్NHనూహ్ సిటీ2005 ఏప్రిల్ 41,8741,089,406
15పల్వల్PLపల్వల్2008 ఆగష్టు 151,3591,040,493
16పంచ్‌కులాPKపంచ్‌కులా1995 ఆగష్టు 15898558,890
17పానిపట్PPపానిపట్1989 నవంబరు 11,2681,202,811
18రేవారీREరేవారీ1989 నవంబరు 11,582896,129
19రోహ్‌తక్ ROరోహ్‌తక్1966 నవంబరు 11,7451,058,683
20సిర్సా జిల్లాSIసిర్సా1975 ఆగష్టు 264,2771,295,114
21సోనీపత్SOసోనీపత్1972 డిసెంబరు 222,1221,480,080
22యమునా నగర్YNయమునా నగర్1989 నవంబరు 11,7681,214,162

ఇది కూడ చూడు

  • హర్యానా తహసీల్‌ల జాబితా

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ