హరిహరన్

భారత నేపధ్య గాయకుడు

హరిహరన్ (తమిళం: ஹரிஹரன் హిందీ: हरिहरन) (జననం:1955 ఏప్రిల్‌ 3) ప్రముఖ భారతీయ నేపథ్య గాయకుడు. ఈయన మలయాళ, హిందీ, కన్నడ, మరాఠీ, భోజ్‌పురి, తెలుగు సినిమాలలో పాటలు పాడాడు. ఈయన గజల్ గాయకుడు కూడా. 2004 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 500కు పైగా తమిళ సినీ పాటలు, దాదాపు 1000 హిందీ పాటలు పాడాడు.

హరిహరన్
ఫిబ్రవరి 2014 లో హరిహరన్
జననం
హరిహరన్ అనంత సుబ్రమణి

(1955-04-03) 1955 ఏప్రిల్ 3 (వయసు 69)
బాంబే, మహారాష్ట్ర[1]
వృత్తినేపథ్య గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు1977–ప్రస్తుతం
సన్మానాలుపద్మశ్రీ (2004)
కళైమామణి (2005)
సంగీత ప్రస్థానం
సంగీత శైలి
  • భారతీయ శాస్త్రీయ సంగీతం
  • భారతీయ భక్తి సంగీతం
  • నేపథ్యగానం
  • సినీ సంగీతం
  • గజల్స్
వాయిద్యాలుగాత్రం, హార్మోనియం

ప్రారంభ జీవితం

హరిహరన్‌ కేరళ లోని తిరువనంతపురంలో 1955 ఏప్రిల్‌ 3న ఓ తమిళ అయ్యర్‌ కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు అలమేలు, హెచ్‌.ఎ.ఎస్‌.మణి ప్రముఖ కర్ణాటక శాస్ర్తీయ సంగీతకారులు. ముంబయిలో పెరిగాడు. ముంబయిలోని ఐ.ఐ.ఇ.ఎస్‌ కళాశాలలో సైన్స్‌, న్యాయశాస్త్రంలో డిగ్రీలను పూర్తిచేశాడు. ఆయన తల్లిదండ్రులు శ్రీమతి అలమేలు, అనంత సుబ్రహ్మణ్య అయ్యర్లు. ఆయనకు వారసత్వంగా సంగీత విద్య అబ్బింది. హరిహరిన్‌ తల్లి అలమేలు ఆయనకు తొలి గురువు. చిన్నతనంలోనే కర్నాటక సంగీతాన్ని నేర్చుకున్న ఆయన హిందూస్తానీ సంగీతంలో కూడా శిక్షణపొందాడు. ఆయన హిందూస్థానీ సంగీతం కూడా బాల్యంలో నేర్చుకుననరు. కౌమరదశలో ఆయన "మెహ్దీ హసన్", "జగ్జీత్ సింగ్" వంటి గాయకుల ప్రభావానికి లోనయి గజల్ సంగీతాన్ని అభివృద్ధి పరచుకున్నాడు. ఆయన "ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్" వద్ద హిందూస్థానీ సంగీతాన్ని నేర్చుకున్నారు. ఆయన ప్రతిరోజూ 13 గంటలకు పైగా సంగీత సాధన చేస్తుంటారు.

కెరీర్

ఫిలిం కెరీర్

Hariharan performing at A R Rahman's concert, Sydney (2010)

తన కెరీర్ ప్రారంభంలో హరిహరన్ టెలివిజన్లో ప్రదర్శనలిచ్చేవాడు. అనేక టెలివిజన్ సీరియళ్ళకు పాటలు పాడాడు. 1977 లో ఆయనకు "ఆల్ ఇండియా సర్ సింగర్ కాంఫిటీషన్"లో ఉన్నత బహుమతి వచ్చిన తరువాత ఆయన 1978 లో "జైదేవ్" దర్శకత్వంలో విడుదలైన హిందీ చిత్రం "గమన్"లో పాడుటకు ఒప్పందం చేసుకున్నాడు. ఆయన పాడిన "అజీబ్ సా నహ ముఝ్ పార్ గుజర్ గయ యారో" పాటకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ఫిల్మ్‌ అవార్డు లభించింది. అదే విధంగా జాతీయ అవార్డుకు నామినేట్ చేయబడింది.[2]

సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహమాన్ ఆయన్ను 1992 లో తమిళ చిత్రసీమకి పరిచయం చేశాడు. మణిరత్నం దర్శకత్వంలోని రోజా సినిమాలో "తమిఝ తమిఝ" అనే దేశభక్తి గీతం పాడారు.[3]. తరువాత మణిరత్నం దర్శకత్వంలో నిర్మింపబడ్డ బొంబాయి సినిమాలో "ఉరియే ఉరియే" పాటకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఫిల్మ్‌ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నేపథ్యగాయకునిగా ఎంపికయ్యాడు. ఈ పాటను హరిహరన్ కె.ఎస్.చిత్రతో కలసి పాడాడు. రహ్మాన్ తో చేసిన గాయకులలో ముఖ్యమైనవాడు హరిహరన్. ముత్తు, మిన్సార కనవు, జీన్స్, ఇండియన్, ముదల్వాన్, తాల్, రంగీలా, ఇందిర, ఇరువర్, అంబే ఆరుయిరే, కంగలాల్ కైతు సె, శివాజి, అలైపయుతే" , కన్నతిల్ ముతమిట్టల్ , గురు , మొదలైన అనేక సినిమాలలో పాటలు పాడాడు. 1998 లో హిందీ సినిమా "బోర్డర్" లో "అను మల్లిక్" కూర్చిన "మేరే దుష్మన్ మేరే భాయీ" పాటకు జాతీయ స్థాయిలో ఉత్తమ నేపధ్య గాయకునిగా అవార్డు అందుకున్నాడు. ఆయన 2009 లో "అజయ్ అతుల్" ట్యూన్ చేసిన "జోగ్వా" సినిమాలోని "జీవ్ రంగ్లా" పాటను మరాఠీ భాషలో పాడి జాతీయ బహుమతిని గెలుచుకున్నారు.[4]

ఆయన 500 కి పైగా తమిళ పాటలను, 200 కి పైగా హిందీ పాటలను పాడారు. అనేక వందల మలయాళ, తెలుగు, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషలలో పాటలను ఆలపించారు.

ప్రధాన అవార్డులు

పద్మశ్రీపురస్కారం
పౌర పురస్కారాలు
జాతీయ ఫిలిం అవార్డ్స్
  • 1998 – National Film Award for Best Male Playback Singer: "Mere Dushman", Border
  • 2009 – National Film Award for Best Male Playback Singer: "Jeev Dangla Gungla Rangla", Jogva[4]
కేరళ రాష్ట్ర ఫిల్మ్‌ అవార్డులు
  • 2011 – Kerala State Film Award for Best Singer – for the song "Pattu Paaduvaan" in the film "Pattinte Palazhi" music by Dr. Suresh Manimala
స్వరలయ-యేసుదాస్ అవార్డు
  • 2004 – For his outstanding contribution to Indian film music[6]
తమిళనాడు రాష్ట్ర ఫిల్మ్‌ అవార్డులు
  • 2004 – Best Male Playback Singer – for various films
  • 1995 – Best Male Playback Singer – for the song "Koncha Naal" in the film Aasai
నంది అవార్డులు
  • 1999 – Best Male Playback Singer – for the song "Hima Semalloyallo" in the film Annayya
ఆసియా నెట్ ఫిల్మ్‌ అవార్డులు
  • 2011 – Best Male Playback Singer – for "Aaro Padunnu" from Katha Thudarunnu[7]
ఫిల్మ్‌ ఫేర్ అవార్డులు (దక్షిణాది)
  • 2011 – Best Male Playback Singer – for "Aaro Padunnu" from Katha Thudarunnu

మూలాలు

ఇతర లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ