హరిశంకర్ బ్రహ్మ

హరిశంకర్ బ్రహ్మ (జననం 1950 ఏప్రిల్ 19 [1] ) భారతదేశ 19వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేశాడు.[3][4] ఆయన 1975 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి. [5]

హరిశంకర్ బ్రహ్మ
19 వ భారత ప్రధాన ఎన్నికల కమిషనరు
In office
2015 జనవరి 16[1] – 2015 ఏప్రిల్ 19[1]
అధ్యక్షుడుప్రణబ్ మిఉఖర్జీ
ప్రధాన మంత్రినరేంద్ర మోడీ
అంతకు ముందు వారువి.ఎస్.సంపత్
తరువాత వారునసీం జైదీ
వ్యక్తిగత వివరాలు
జననం (1950-04-19) 1950 ఏప్రిల్ 19 (వయసు 74)[1]
గోసాయిగావ్, అస్సాం[2]
కళాశాలసెయింట్.ఎడ్మండ్స్ కాలేజి, షిల్లాంగ్ (బిఎ)
గౌహతి యూనివర్సిటీ (ఎమ్‌ఎ)
నైపుణ్యంప్రభుత్వ అధికారి

2010 ఏప్రిల్‌ లో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ సెక్రటరీగా పదవీ విరమణ చేసిన బ్రహ్మ, [6] 2015 ఏప్రిల్ 19 వరకు పదవిలో ఉన్నాడు. JM లింగ్డో తర్వాత ఈశాన్య ప్రాంతం నుండి ఎన్నికల కమిషనర్ అయిన రెండవ వ్యక్తి అతను. [5]

ప్రారంభ జీవితం, విద్య

1950 ఏప్రిల్ 19 న అస్సాంలోని కోక్రఝార్ జిల్లాలోని గోస్సైగావ్‌లో బోడో కుటుంబంలో జన్మించిన అతను గౌహతి విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాడు. షిల్లాంగ్‌లోని సెయింట్ ఎడ్మండ్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. గౌహతిలోని డాన్ బాస్కో స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించాడు. అతను ఆంధ్ర ప్రదేశ్ కేడర్[7][2][8] కి చెందిన 1975 ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి.

కెరీర్

హరిశంకర్ బ్రహ్మ ఈ పదవిని చేపట్టడానికి ముందు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ సీనియర్ స్థాయి పదవులను నిర్వహించారు. విద్యుత్ మంత్రిత్వ శాఖ నుండి కార్యదర్శిగా పదవీ విరమణ చేసే ముందు బ్రహ్మ, జాయింట్ సెక్రటరీ (బోర్డర్ మేనేజ్‌మెంట్) వంటి పదవులను నాలుగు సంవత్సరాలకు పైగా నిర్వహించాడు. ఇండో-పాక్ - ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో దాదాపు అన్ని సరిహద్దు ఫెన్సింగ్, ఇతర సరిహద్దు మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేశాడు. అతను నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ )లో ప్రత్యేక కార్యదర్శిగా, అదనపు కార్యదర్శిగా కూడా పనిచేశాడు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు మెంబర్-సెక్రటరీగా పనిచేశాడు

2010 ఆగస్టులో ఎన్నికల కమిషనర్‌గా నియమితుడయ్యాడు. అతను రెండు లోక్‌సభ ఎన్నికలను (2014), ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక రాష్ట్ర శాసనసభ ఎన్నికలనూ పర్యవేక్షించాడు.[9]

2012 అస్సాం హింసపై అభిప్రాయాలు

2012 జూలై 28 న ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక వ్యాసంలో, 2012 అస్సాం హింసకు బంగ్లాదేశ్ నుండి వచ్చిన అక్రమ వలసలే కారణమని ఆరోపించాడు.[10] ఎన్నికల సంఘం కూడా ఈ సమస్యను ఎదుర్కొంటోందని ఆయన పేర్కొంటూ " భారత ఎన్నికల సంఘం కూడా ఈ సమస్య నుండి తప్పించుకోలేదు. అసోం ఎన్నికల జాబితాను సిద్ధం చేసేటపుడు, సుమారు 1.5 లక్షల మంది డి-ఓటర్ల (సందేహాస్పద ఓటర్లు) సమస్యను పరిష్కరించాల్సి వచ్చింది. ఈ సమస్య కోర్టుల పరిధిలో ఉంది. అది కూడా దేశానికి చాలా తీవ్రమైన భద్రతా ముప్పును కలిగిస్తుంది. కోర్టులు,. ట్రిబ్యునళ్లలో ఉన్న కేసులను ఒక కాలవ్యవధిలో పరిష్కరించాలి. అక్రమ వలసదారులుగా గుర్తించిన వ్యక్తులను పంపించెయ్యాలి. అక్రమ వలస అసమస్యను పరిష్కరించకపోతే, ఈ సమస్య పదేపదే వస్తూంటుంది, వివిధ ప్రాంతాల్లో వస్తూంటుంది" అని చెప్పాడు.[11]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ