స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ భారతీయ స్టేట్ బ్యాంకుకు చెందిన 7 అనుబంధ బ్యాంకులలో ఒకటి. ఇది కేరళ రాష్ట్రపు ప్రధాన బ్యాంకు. 1945లో ట్రావన్‌కోర్ బ్యాంకు లిమిటెడ్ పేరుతో ఇది ప్రారంభించబడింది. దీని సంస్థాపకుడు ట్రావన్‌కోర్ సంస్థానపు మహారాజు. 1959లో పార్లమెంటు ఆమోదించిన భారత అనుబంధ బ్యాంకుల చట్టం ప్రకారం ఇది స్టేట్ బ్యాంక్ గ్రూపులో భాగమైంది. కేరళలో ఉన్న అనేక పూర్వపు ప్రైవేటు బ్యాంకులు అనేకం 1961, 1965 మధ్యలో ఈ బ్యాంకులో భాగమైనవి. వాటిలో ముఖమైన బ్యాంకులు ట్రావన్‌కోర్ ఫార్వర్డ్ బ్యాంక్, కొట్టాయం ఓరియంట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ న్యూ ఇండియా, కొచ్చిన్ నాయర్ బ్యాంక్, ది లాటిన్ క్రిస్ట్రియన్ బ్యాంక్ మొదలగునవి.

లోగో

దేశం మొత్తం మీద 14 రాష్ట్రాలలో ఈ బ్యాంకుకు 670 కి పైగా శాఖలు ఉన్నాయి. వాటిలో అధికంగా 552 శాఖలు కేరళ రాష్ట్రములో ఉన్నాయి. 2005, సెప్టెంబర్ 12 న ఈ బ్యాంకు అన్ని శాఖలలో కంప్యూటరీకరణ కావించి కోర్ బ్యాంకింగ్ గా ఏర్పడింది. ఈ విధంగా కోర్ బ్యాంకింగ్ గా ఏర్పడిన స్టేట్ బ్యాంక్ గ్రూప్ బ్యాంకులలో ఇది రెండవది.

ఇవి కూడా చూడండి


బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ