స్టీఫెన్ రవీంద్ర

ముత్యాల స్టీఫెన్ రవీంద్ర 1999 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్నారు.[8] స్టీఫెన్ రవీంద్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేశారు.

ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్

ఎం. స్టీఫెన్ రవీంద్ర

ఐపీఎస్ అధికారి
జననం14 ఫిబ్రవరి ,[1] 1973[2]
పురస్కారాలు
  • 2004, ఆంత్రిక సురక్ష సేవా పదక్,
  • 2005, పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ,[3]
  • 2010, ప్రధాన మంత్రి పోలీసు పతకం[4]
  • 2016, రాష్ట్రపతి పోలీసు పతకం[5]
Police career
విభాగముఇండియన్ పోలీస్ సర్వీస్ (19991022)
దేశంతెలంగాణ క్యాడర్[6]
Years of service1999
Rankఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, [7]

జననం, విద్యాభాస్యం

స్టీఫెన్ రవీంద్ర 14 ఫిబ్రవరి 1973న ఆంధ్రప్రదేశ్ లో జన్మించాడు. ఆయన తండ్రి ఎం.బి. రంజిత్ ఆసిఫ్ నగర్ డివిజన్, హైదరాబాద్ సిటీ పోలీసు అసిస్టెంట్ కమిషనర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. రవీంద్ర సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాలలో ప్రాధమిక విద్యాభ్యాసం, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాలలో, 1994లో నిజాం కళాశాలలో కాలేజీ విద్యను పూర్తి చేశారు. స్టీఫెన్ రవీంద్ర ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో జంతుశాస్త్ర విభాగంలో చేరి పోస్ట్ గ్రాడ్యుయేట్ లో బంగారు పతకం సాధించాడు. ఆయన అనంతరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సెలక్ట్ అయి ఐపీఎస్ లో చేరారు.

వృత్తి జీవితం

1999 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన స్టీఫెన్ రవీంద్ర హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందాడు. ఆయన 20 సెప్టెంబర్ 1999న ఉద్యోగంలో చేరి తొలి పోస్టింగ్ వరంగల్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా , ఆదిలాబాద్, కరీంనగర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో అనంతపూర్ లో ఏఎస్పీ, ఎస్పీగా , వైఎస్ఆర్ ప్రభుత్వంలో సీఎం సెక్యూరిటీ చీఫ్‌గా, హైదరాబాద్ కమిషనరేట్ లోని ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ డీసీపీగా, గ్రేహౌండ్లో అసాల్ట్ కమాండర్, గ్రూప్ కమాండర్ గా హైదరాబాద్ ఐజీగా విధులు నిర్వహించాడు. ఆయన గ్రేహౌండ్లో అసాల్ట్ కమాండర్, గ్రూప్ కమాండర్ గా పని చేసిన సమయంలో చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిషాఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో పలు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశాడు.

స్టీఫెన్ రవీంద్ర విధి నిర్వహణలో భాగంగా అగ్నిప్రమాదంలో చిక్కుకున్న 61 మంది రోగుల ప్రాణాలను కాపాడటంతో శౌర్య పతకం(2005), ప్రధాన మంత్రి లైఫ్ సేవింగ్ పతకం(2011), తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నందుకు కేంద్రం నుంచి గాలంటరీ మెడల్, భారత పోలీస్ పతకం(2016), ఆంత్రిక్ సురక్షా సేవ లాంటి పతకాలు అందుకున్నాడు. స్టీఫెన్ రవీంద్ర 25 ఆగష్టు 2021న సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమితుడై, 26న భాద్యతలు స్వీకరించాడు.[9].

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ