స్కాండినేవియా

స్కాండినేవియా అనేది ఉత్తర ఐరోపాలోని ఒక ప్రాంతం. ఈ ప్రాంతంలో నివసించే ప్రజల మధ్య చారిత్రక, సాంస్కృతిక, భాషల పరంగా బలమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఆంగ్ల వాడుకలో స్కాండినేవియా అంటే డెన్మార్క్, నార్వే, స్వీడన్ దేశాలు కలిసిన భూభాగం. వీటినే నోర్డిక్ కంట్రీస్ అని కూడా అంటారు.[1] దీని భౌగోళిక స్వరూపం అనేక వైవిధ్యాలతో కూడుకుని ఉంటుంది.

ఈ ప్రాంతం వైకింగ్ యుగంలో మంచి ప్రాముఖ్యంలోకి వచ్చింది. స్కాండినేవియన్ వాసులు ఐరోపా అంతటా జరిగిన దండయాత్రలు, పోరాటాలు, వలసలు ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారు. వీళ్ళు తమ దగ్గర ఉండే పెద్ద ఓడలను ప్రపంచ అన్వేషణకు వాడుకున్నారు. ఉత్తర అమెరికాకు చేరుకున్న మొదటి యూరోపియన్లు వీరే. ఈ ప్రాంతాలు కూడా క్రైస్తవ మత ప్రభావానికి లోనయ్యాయి. దీనివల్ల, డెన్మార్క్, స్వీడన్, నార్వే దేశాలు కలిసి కల్మార్ యూనియన్ అనే పేరుతో ఏకం అయ్యాయి. ఇది సుమారు 100 ఏళ్ళ పాటు కొనసాగిన తర్వాత స్వీడన్ రాజ్ గుస్తావ్ 1 స్వాతంత్ర్యం ప్రకటించాడు. అలాగే ఈ దేశాల మధ్య కొన్ని యుద్ధాలు కూడా జరిగాయి. దీనివల్ల ప్రస్తుతం ఉన్న దేశపు సరిహద్దులు ఏర్పడ్డాయి. స్వీడన్, నార్వే కూడా 1905 దాకా కలిసి ఉన్నాయి.

ఈ ప్రాంతపు ఆర్థిక వ్యవస్థలు ఐరోపాలో అత్యంత బలమైన వ్యవస్థలు.[2] డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌ల్యాండ్, నార్వే, స్వీడన్ దేశాలలో ఉదారమైన సంక్షేమ పథకాలు ఉన్నాయి. దీనినే నోర్డిక్ నమూనా అని వ్యవహరిస్తుంటారు.[3]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ