సోహ్రాబ్ మోడీ

నాటకరంగ, సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత.

సోహ్రాబ్ మెర్వాంజీ మోడీ ( 1897 నవంబరు 2 - 1984 జనవరి 28) నాటకరంగ, సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత.[1] షేక్స్పియర్ రాసిన హామ్లెట్ నాటకం ఆధారంగా తీసిన ఖూన్ కా ఖూన్ (1935), సికందర్, పుకర్, పృథ్వీ వల్లబ్, ఝాన్సీ కి రాణి, మీర్జా గాలిబ్, జైలర్, నౌషర్వాన్-ఇ-ఆదిల్ (1957) మొదలైన సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతడు రూపొందించిన సినిమాలు సామాజిక, జాతీయ సమస్యలపై సందేశాన్ని కలిగి ఉంటాయి.[2] 1980లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నాడు. ఈ ఆవార్డును అందుకన్న వారిలో పదవ వ్యక్తి. ఇతడు దర్శకత్వం వహించిన మీర్జా గాలిబ్ సినిమాకు రెండవ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ లోటస్ అవార్డు వచ్చింది.

సోహ్రాబ్ మెర్వాంజీ మోడీ
సోహ్రాబ్ మోడీ
1931 సోహ్రాబ్ మెర్వాంజీ మోడీ
జననం(1897-11-02)1897 నవంబరు 2
మరణం1984 జనవరి 28(1984-01-28) (వయసు 86)
జాతీయతభారతీయుడు
మినర్వా మోవిటోన్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సినిమా దర్శకుడు, రచయిత, నటుడు
జీవిత భాగస్వామిమెహతాబ్ మోడీ
పురస్కారాలుదాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం (1980)

జననం

సోహ్రాబ్ మోడీ 1987, నవంబరు 2న పార్సీ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ఇడియన్ సివిల్ సర్వెంట్. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ లో తన బాల్యాన్ని గడిపిన మోడీ, అక్కడ హిందీ, ఉర్దూ నేర్చుకున్నాడు.[3]

2013 భారత స్టాంప్ పై సోహ్రాబ్ మోడీ
1941లో వచ్చిన సికిందర్ సినిమాలో సోహ్రాబ్ మోడీ

సినిమాలు

దర్శకుడిగా

  • ఖూన్ కా ఖూన్ (1935)
  • సెడ్-ఎ-హవాస్ (1936)
  • ఆత్మ తరంగ్ (1937)
  • ఖాన్ బహదూర్ (1937)
  • జైలర్ (1938)[2]
  • మీతా జహార్ (1938)
  • పుకార్ (1939)
  • భరోసా (1940)
  • సికందర్ (1941)[3]
  • ఫిర్ మిలెంగే (1942)
  • పృథ్వీ వల్లబ్ (1943)
  • పరాఖ్ (1944)[4]
  • ఏక్ దిన్ కా సుల్తాన్ (1945)
  • మంజ్ధర్ (1947)
  • నరసింహ అవతార్ (1949)
  • దౌలత్ (1949)
  • షీష్ మహల్ (1950)
  • ఝాన్సీ కి రాణి (1953)
  • మీర్జా గాలిబ్ (1954)
  • కుందన్ (1955)
  • రాజ్ హాత్ (1956)
  • నౌషర్వాన్-ఇ-ఆదిల్ (1957)
  • జైలర్ (1958)
  • మేరా ఘర్ మేరే బాచే (1960)
  • సమయ్ బడా బల్వాన్ (1969)

నటుడిగా

సినిమాసంవత్సరంపాత్ర
ఖూన్ కా ఖూన్1935హామ్లెట్
సెడ్-ఎ-హవాస్1936కజల్ బేగ్ (హుబెర్ట్)
జైలర్1938జైలర్
మీతా జహార్1938
పుకార్[4]1939సర్దార్ సంగ్రామ్ సింగ్
సికందర్[3]1941పోరస్ రాజు
పృథ్వీ వల్లభ్1943ముంజా
శీష్ మహల్1950ఠాకూర్ జస్పాల్ సింగ్
ఝాన్సీ కి రాణి1952రాజ్ గురు
కుందన్1955కుందన్
రాజ్ హాత్1956రాజా బాబు
నౌషర్వాన్-ఇ-ఆదిల్ అలియాస్ ఫార్జ్ ఔర్ మొహబ్బత్1957సుల్తాన్-ఇ-ఇరాన్ నౌషర్వాన్-ఎ-ఆదిల్
యాహుడి[2]1958ఎజ్రా, యూదుడు
జైలర్1958దిలీప్
పెహ్లి రాత్1959
వోహ్ కోయి ఔర్ హోగా1967
నూర్ జహాన్1967కాజీ
జ్వాలా1971
ఏక్ నరి ఏక్ బ్రహ్మచారి1971రైసాహెబ్ సూరజ్‌భన్ చౌదరి
రజియా సుల్తాన్1983వజీర్-ఎ-అజామ్

ఇతర వివరాలు

  • 1960లో 10వ బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో జ్యూరీ సభ్యుడిగా ఉన్నాడు.[5]
  • 2005లో ఫాల్కే పతకం, మోడీ కఫ్ పరేడ్ ఇంటి నుండి కొన్ని సిరామిక్ ముక్కలు ముంబైలోని పురాతన వస్తువుల మార్కెట్ అయిన చోర్ బజార్‌కు విక్రయించబడ్డాయి.

మరణం

మోడీ ఎముక మజ్జ క్యాన్సర్ తో బాధపడడుతూ తన 86 సంవత్సరాల వయస్సులో 1984, జనవరి 28న మరణించాడు.[2]

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ