సోనారిక భాడోరియా

సోనారిక భాడోరియా(జ. 1992, జులై 3 ) ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె "దేవొన్ కా దేవ్ మహాదేవ్" అనే హిందీ దారావాహికలో పార్వతి, ఆది శక్తి పాత్రలు పొషించటం ద్వారా మంచి పేరు సంపాదించుకుంది.[1][2]

సోనారిక భాడోరియా
సోనారికా భడోరియా మాల్దీవుల్లో సెలవులను ఎంజాయ్ చేస్తోంది
జననం (1992-07-03) 1992 జూలై 3 (వయసు 31)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, మొడల్
క్రియాశీల సంవత్సరాలు2011-ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
దేవొన్ కా దేవ్ మహాదేవ్
ఈడోరకం ఆడోరకం

జీవిత విశేషాలు

ఆమె ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి సొనారికా సినిమా నిర్మాణ సంస్థలో ఉన్నాడు. ఆమె తల్లి గృహిణి. ఆమె యశోథమ్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిందింది. ఆమె పూర్వ-విశ్వవిద్యాలయ విద్యను D.G. రుపరేల్ కళాశాలలో పూర్తి చేసింది.[3]

కెరియర్

దూరదర్శిని కార్యక్రమాలు (2011–ప్రస్తుతం)

2011 లో లైఫ్ ఓక్లో ప్రసారమైన "తుమ్ దేనా మేరా సాథ్" టెలివిజన్ షోలో సోనారికా నటించటం ప్రారంభించినది.[4][5] ."తుమ్ దేనా మేరా సాథ్" తర్వాత ఆమె "దేవొన్ కా దేవ్ మహాదేవ్" లో పార్వతిగా నటించారు . పార్వతి / ఆదిశక్తి, దుర్గా, మహాకాళి యొక్క పాత్రకు ఆమె ఎంతో కీర్తి, ప్రజాదరణ వచ్చింది.[6][7][8][9][10][11][12].

సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్లో భారతీయ చారిత్రక ధారావాహిక అయిన "పృథ్వీ వల్లభ్-ఇతిహాస్ భీ, రహాసయా భీ"[13] - లో మృణాల్వతి పాత్రలో (స్త్రీ ప్రధాన పాత్ర) ఆమె నటించింది.

చలనచిత్రాలు (2015–ప్రస్తుతం)

2015 లో, సోనారికా తెలుగు సినిమాలో జాదగోడులో ప్రధాన పాత్ర పోషించారు.ఆ తరువాత అమె స్పీడున్నోడు చిత్రంలో నటించారు.[14] ఫిబ్రవరి 2016 లో ఈ చిత్రం విడుదలైంది, ఆమె నటనకు ఆమె ప్రశంసలు అందుకుంది.[15]2016 లో విడుదలైన రెండో చిత్రం మంచూ విష్ణు, రాజ్ తరుణ్ సరసన నటించిన ఈడోరకం ఆడోరకం .

నటించిన చిత్రాలు

సంవత్సరంశీర్షికపాత్రభాషగమనికలు
2015జాదుగాడుపార్వతితెలుగు
2016స్పీడున్నోడువసంతితెలుగు
2016ఈడోరకం_ఆడోరకంనీలవేణితెలుగు
2016సాన్‌సె:ద లాస్ట్ బ్రీత్షిరిన్హిందీ
2017ఇంద్రజిత్తమిళం

బుల్లితెర

సంవత్సరంశీర్షికపాత్రభాషగమనికలు
2011-12తుమ్ దేనా మేరా సాథ్అభిలాషాహిందీ
2012–13దేవొన్ కా దేవ్ మహాదేవ్పార్వతిహిందీ
2018-ప్రస్తుతంపృథ్వీ వల్లభ్మృణాల్వతిహిందీ

మూలాలు

ఇతర లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ