సుఖ్నా సరస్సు

సుఖ్నా సరస్సు భారతదేశంలోని చండీగఢ్ రాష్ట్రంలో హిమాలయాలలోని శివాలిక్ కొండల వద్ద ఉన్న జలాశయం. ఇది 1958 లో శివాలిక్ కొండల నుండి కాలానుగుణంగా ప్రవహించడం ప్రారంభం అయింది.[1]

సుఖ్నా సరస్సు చండీఘర్
View of Sukhna Lake
The Lake
Location of Sukhna Lake
Location of Sukhna Lake
సుఖ్నా సరస్సు చండీఘర్
అక్షాంశ,రేఖాంశాలు30°44′N 76°49′E / 30.733°N 76.817°E / 30.733; 76.817
రకంరిజర్వాయరు
ప్రవహించే దేశాలుభారతదేశం
ఉపరితల వైశాల్యం3 కి.మీ2 (1.2 చ. మై.)
సరాసరి లోతు8 అ. (2.4 మీ.)
గరిష్ట లోతు16 అ. (4.9 మీ.)

చరిత్ర

సుఖ్నో సరస్సు దగ్గర సూర్యోదయం

ఈ సరస్సును లె కార్బుజియె, పి ఎల్ వర్మ రూపొందించారు. ఇక్కడి ప్రశాంతతను కాపాడటానికి కార్బుజియె, మోటారు పడవలు నీటిలో తిరుగుతూ ఉండటం నిషేధించబడాలని, ఆనకట్ట పైన వాహనాల రాకపోకలను నిషేధించాలని చెప్పారు. గతంలో ఈ సరస్సులో కొన్ని మొసళ్ళు కూడా ఉండేవి.[2]

హర్యానా గవర్నర్ బిరేంద్ర నారాయణ చక్రవర్తి (1967 - 1976) ఈ సరస్సును చక్రవర్తి సరస్సు అని పిలిచేవారు.

వినోదం

సుఖ్నా సరస్సు పచ్చిక బయళ్ళు, జిమ్, ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ వంటి వాటిని కలిగి ఉంది. బోటింగ్, రోయింగ్, స్కల్లింగ్, సెయిలింగ్, కయాకింగ్, వాటర్ స్కీయింగ్ వంటి వాటిని ఏడాది పొడవునా ఆనందించవచ్చు.[3]

సాంస్కృతిక కార్యక్రమాలు

సుఖ్నా సరస్సు అనేక పండుగలు, వేడుకలకు వేదికగా మారింది. ఇక్కడ వర్షాకాలంలో జరిగే మామిడి పండుగ అత్యంత ప్రాచుర్యం పొందింది, అనేక రకాల మామిడి పండ్లు ప్రదర్శనలో ఉంటాయి. సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు, వివిధ భారతీయ రాష్ట్రాల ప్రత్యేకతలను కలిగి ఉన్న ఇతర ఆహార ఉత్సవాలు కూడా ఇక్కడ జరుగుతాయి.[4]

అభివృద్ధి,నియమాలు

సుఖ్నా సరస్సులో 30 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న చేపలను వేటాడకూడదని చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం తీసుకుంది.

2.73కోట్ల తో ఈ సరస్సును అభివృద్ధి పరిచేందుకు అక్కడి అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం తీసుకుంది.[5]

చిత్రాలు

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ