సి.రంగరాజన్

భారతీయ ఆర్థిక శాస్త్రవేత్త

1932లో జన్మించిన చక్రవర్తి రంగరాజన్ భారత దేశానికి చెందిన ఆర్థిక వేత్త. 1964లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పి.హెచ్.డి.పట్టా పొందినాడు. ఇతడు దశాబ్దం కాలానికి పైగా 1982 నుంచి 1991 వరకు భారతీయ రిజర్వ్ బాంక్కు డిప్యూటీ గవర్నర్ గా పనిచేశాడు. ఆ తర్వాత 1992 డిసెంబర్ 22 నుంచి 1997 డిసెంబర్ 21 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేశాడు. 1997, నవంబర్ 24 నుంచి 2003, జనవర్ 3 వరకు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గాను పనిచేసాడు. ఆ తర్వాత 12 వ ఆర్థిక కమీషన్ చైర్మెన్ గా పదవి చేపట్టాడు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా కౌన్సిల్ చైర్మెన్ పదవిలో[1]కొనసాగి రాజీనామా చేశాడు. తాజాగా 2008, ఆగష్టు 13న రాజ్యసభకు నియమితుడయ్యాడు.[2]ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న సమయంలో 1998 నుంచి 1999 వరకు ఒడిషా గవర్నర్ గా, 2001 నుంచి 2002 వరకు తమిళనాడు గవర్నరుగా అదనపు బాధ్యతల్ని చేపట్టాడు.

సి.రంగరాజన్ సంతకం

2002లో భారత ప్రభుత్వం అతనికి రెండో అత్యున్నత పౌర అవార్డు అయిన పద్మ విభూషణ్తో సత్కరించింది.

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ