సిల్వర్(I)ఫ్లోరైడ్

సిల్వర్ (I)ఫ్లోరైడ్ఒక అకర్బన రసాయన సమ్మేళనం.వెండి/సిల్వర్, ఫ్లోరిన్ మూలకాల సంయోగం వలన ఈ సమ్మేళనపదార్థం ఏర్పడినది. ఫ్లోరిన్‌తో వెండి ముకాలం ఏర్పరచు మూడు సంయోగ పదార్థాలలో సిల్వర్ (I)ఫ్లోరైడ్‌ ప్రధానమైన సంయోగపదార్థం. సిల్వర్ (I)ఫ్లోరైడ్ యొక్క రసాయన సంకేతపదం AgF.సిల్వర్, ఫ్లోరిన్‌ల మిగతా రెండు సంయోగపదార్థాలు సిల్వర్ సబ్‌ఫ్లోరైడ్, సిల్వర్(II)ఫ్లోరైడ్‌లు. సిల్వర్(I)ఫ్లోరైడ్‌ పలురకాలైన ఇతర ప్రయోజనాలను కలిగిఉన్నది. ఫ్లోరినేసనులో ఉపయోగిస్తారు, సేంద్రియ సంశ్లేషణలో డిసిలిలెసన్(desilylation)గా ఉపయోగిస్తారు.

సిల్వర్(I)ఫ్లోరైడ్
పేర్లు
IUPAC నామము
సిల్వర్(I)ఫ్లోరైడ్
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య[7775-41-9]
పబ్ కెమ్62656
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య VW4250000
SMILES[Ag+].[F-]
ధర్మములు
AgF
మోలార్ ద్రవ్యరాశి126.87 g·mol−1
స్వరూపంyellow-brown solid
సాంద్రత5.852 g/cm3 (15 °C)
ద్రవీభవన స్థానం 435 °C (815 °F; 708 K)
బాష్పీభవన స్థానం 1,159 °C (2,118 °F; 1,432 K)
నీటిలో ద్రావణీయత
  • 85.78 g/100 mL (0 °C)
  • 119.8 g/100 mL (10 °C)
  • 179.1 g/100 mL (25 °C)
  • 213.4 g/100 mL (50 °C)[1]
ద్రావణీయత
  • 83g/100 g (11.9 °C) in hydrogen fluoride
  • 1.5g/100 mL in methanol(25 °C)[2]
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
cubic
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-206 kJ/mol[1]
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
83.7 J/mol·K[1]
విశిష్టోష్ణ సామర్థ్యం, C48.1 J/mol·K[1]
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలుCorrosive
జి.హెచ్.ఎస్.పటచిత్రాలుGHS05: Corrosive[3]
జి.హెచ్.ఎస్.సంకేత పదంDanger
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలుH314
GHS precautionary statementsP280, P305+351+338, P310
ఇ.యు.వర్గీకరణ{{{value}}}
R-పదబంధాలుమూస:R23/24/25, R34
S-పదబంధాలుమూస:S13, మూస:S22, S24/25, S26, S36/37/39, S45
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు{{{value}}}
ఇతర కాటయాన్లు
  • Copper(I) fluoride
  • Gold(I) fluoride
సంబంధిత సమ్మేళనాలు
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

భౌతిక ధర్మాలు

సిల్వర్ (I)ఫ్లోరైడ్ఒక ఘన సమ్మేళనం.పసుపు-బ్రౌన్ రంగులో ఉన్న ఘనపదార్థం.సిల్వర్(I)ఫ్లోరైడ్ అణుభారం 126.87 గ్రాములు/మోల్.15 °C ఉష్ణోగ్రతవద్ద సిల్వర్(I)ఫ్లోరైడ్‌ సంయోగ పదార్థం సాంద్రత5.852 గ్రాములు/సెం.మీ3.సిల్వర్(I)ఫ్లోరైడ్‌ ద్రవీభవన స్థానం 435 °C (815 °F;708K)., బాష్పీభవన స్థానం 1,159 °C (2,118 °F; 1,432 K).నీటిలో ద్రావణియత కల్గి ఉంది. 0 °C వద్ద 100 మి.లీ. నీటిలో 85.78 గ్రాముల సిల్వర్ (I)ఫ్లోరైడ్‌ కరుగగా,10 °C నీటి ఉష్ణోగ్రతవద్ద 119.8 గ్రాములు, 25 °C వద్ద179.1గ్రాములు, 50 °C వద్ద213.4 గ్రాములు కరుగును.అనగా నీటి ఉష్ణోగ్రత పెరిగేకొలది, అందులో కరుగు సిల్వర్ (I)ఫ్లోరైడ్పరిమాణం కూడాపెరుగును. అంతియే కాకుండా హైడ్రోజన్ ఫ్లోరైడ్, మిథనాల్ లో కూడా కరుగును.

ఉత్పత్తి

అత్యంత శుద్ధమైన సిల్వర్(I)నైట్రేట్ ను సిల్వర్ కార్బోనేట్ ను 310 °C వద్ద, ఒక ప్లాటినం నాళిక/గొట్టంలో హైడ్రోజన్ ఫ్లోరైడ్ కలిగిన పరిసరాల్లో వేడి చెయ్యడం వలన ఉత్పత్తి చేసెదరు:[4] Ag2CO3 + 2HF → 2AgF + H2O + CO2పరిశోధన లేదా ప్రయోగశాలల్లో సిల్వర్(I)నైట్రేట్ ను ఉత్పత్తి చెయ్యుటకై వాయురూపంలో ఉన్న హైడ్రోజన్ ఫ్లోరైడ్ ను ఉపయోగించరు. బదులుగా సిల్వర్ టెట్రాఫ్లోరోబోరేట్ ను ఉష్ణవియోగం చెందించుట ద్వారా ఉత్పత్తి చేసెదరు.

AgBF4 → AgF + BF3

మరోప్రత్నామ్యాయ విధానంలో సిల్వర్(I)ఆక్సైడ్ ను గాఢ హైడ్రోఫ్లోరిక్ ద్రవంలో కరగించి,ఏర్పడిన ద్రవంలో అసిటోన్ చేర్చి,అవక్షెపముగా సిల్వర్ (I)ఫ్లోరైడ్ను వేరు చేసెదరు.[4]: 10 

Ag2O + 2HF → 2 AgF + H2O

ఇతర గుణాలు

ద్రావణియత

ఇతర సిల్వర్ హలినైడులకు భిన్నంగా సిల్వర్ (I)ఆక్సైడ్ నీటిలో అధిక ద్రావణియత కలిగి ఉంది.ఒక లీటరునీటిలో 1800 గ్రాముల సిల్వర్ (I)ఆక్సైడ్ కరుగుతుంది.అలాగే అసిటోనైట్రైల్(acetonitrile)లో కుడా కొంత మేర కరుగుతుంది.క్షార లోహ ఫ్లోరైడులలవలె సిల్వర్ (I)ఆక్సైడ్ సమ్మేళనపదార్థం హైడ్రోజన్ ఫ్లోరైడులో కరిగి వాహక ద్రవాణాన్ని ఏర్ప రచును.

ఉపయోగాలు

సేంద్రియ సంశ్లేషణ

సిల్వర్(I)ఫ్లోరైడును సేంద్రియ సంశ్లేషణలో ఉపయోగిస్తారు.ఆర్గానో ఫ్లోరిన్ రసాయన శాస్త్రంలో బహుళ బంధాలలో ఫ్లోరిన్ ను చేర్చుటకు సిల్వర్(I)ఫ్లోరైడును ఉపయోగిస్తారు.ఉదాహరణకు అసిటోనైట్రైల్ ద్రావణంలో పెర్ఫ్లోరో అల్కేన్స్ (perfluoroalkenes )కు సిల్వర్(I)ఫ్లోరైడును చేర్చడం వలన పెర్ఫ్లోరోఅల్కైల్ సిల్వర్(I)ఉత్పత్తులు ఏర్పడును.థైయొ యూరియా నుండి అనుబంధ ఉత్పత్తులను తయారు చేయునపుడు సిల్వర్(I)ఫ్లోరైడును డిసల్ఫురేసన్-ఫ్లోరినేసన్ కారకంగా ఉపయోగిస్తారు.

అసేంద్రియ సంశ్లేషణ

అసెంద్రియ పదార్థాల సంశ్లేషణలో కూడా సిల్వర్(I)ఫ్లోరైడును ఉపయోగిస్తారు.

మూలాలు/అధారాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ