సిద్దిపేట జిల్లా

వికీపీడియా నుండి
(సిద్ధిపేట జిల్లా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigationJump to search
Siddipet district
District of Telangana
పటం
సిద్ధిపేట జిల్లా
Location of Siddipet district in Telangana
Location of Siddipet district in Telangana
CountryIndia
StateTelangana
Formation11 అక్టోబరు 2016 (2016-10-11)
HeadquartersSiddipet
Government
 • District collectorఎం. హన్మంత రావు
విస్తీర్ణం
 • Total3,842.33 కి.మీ2 (1,483.53 చ. మై)
జనాభా
 (2011)[1]
 • Total10,12,065
 • జనసాంద్రత260/కి.మీ2 (680/చ. మై.)
Time zoneUTC+05:30 (IST)
సిద్దిపేట మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం

సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.[2] సిద్దిపేట పట్టణం ఈ జిల్లాకు పరిపాలన కేంద్రం.2016 అక్టోబరు 11, న నూతనంగా ఏర్పడిన ఈ జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు, 22 మండలాలు, నిర్జన గ్రామాలు (6) తో కలుపుకుని 381 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3]

జిల్లాలోని 22 మండలాలలో (పాతవి 17 + కొత్తవి 5) పూర్వపు మెదక్ జిల్లాలోనివి పాతవి 13 మండలాలు, పూర్వపు కరీంనగర్ జిల్లా నుంచి 3 మండలాలు, పూర్వపు వరంగల్ జిల్లా నుండి ఒక మండలం మొత్తం 17 పాత మండలాలు కాగా, కొత్తగా ఏర్పడిన మండలాలు పూర్వపు మెదక్ జిల్లా గ్రామాల నుండి 4, పూర్వపు కరీంనగర్ జిల్లా గ్రామాల నుండి 1 మొత్తం 5 కొత్త మండలాలతో కొత్త జిల్లాగా అవతరించింది.జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలతో కలుపుకొని 499 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[4] 100శాతం వాక్సినేషన్ మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమంలో భాగంగా 2019 సంవత్సరానికి ప్రధానమంత్రి అవార్డును అందుకుంది.[5]

నీటిపారుదల

సిద్దిపేటపట్టణ పరిసరప్రాంతాలలో ఇంటింటికీ నల్లాల ద్వారా నీటిసరఫరా జరుగుతుంది. వ్యవసాయరంగానికి బావుల ద్వారా, బోర్ల ద్వారా నీరు అందుతుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన రంగనాయకసాగర్ జలాశయం సిద్దిపేటకు 4 కి.మీ.దూరంలో ఉంది .

రెవెన్యూడివిజన్ లు

సిద్దిపేట జిల్లా రెవెన్యూ డివిజన్లు రేఖా చిత్రం
  1. సిద్దిపేట
  2. గజ్వేల్
  3. హుస్నాబాద్

పునర్య్వస్థీకరణ తరువాత ఏర్పడిన కొత్త మండలాలు

  • ఆ తరువాత సిద్ధిపేట రెవెన్యూ డివిజను పరిధిలోని, సిద్ధిపేట గామీణ మండలానికి చెందిన నారాయణరావుపేట మండలాన్ని ఐదు రెవెన్యూ గ్రామాలతో మండలం కొత్తగా ఏర్పడింది.[6]
  • దూల్​మిట్ట గ్రామం మండల కేంద్రంగా మద్దూర్ మండలం లోని 8 గ్రామాలతో దూల్​మిట్ట మండలం కొత్తగా ఏర్పడింది.[7][8]

జిల్లా లోని మండలాల జాబితా

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (5) గమనిక:* పునర్య్వస్థీకరణ తరువాత కొత్తగా ఏర్పడిన మండలాలు (2)

కలెక్టర్లు

ప్రశాంత్ జీవన్ పాటిల్

సిద్దిపేట జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మన్

ప్రధానమంత్రి అవార్డు-2019

చిన్నారులకు 100శాతం వ్యాధి నిరోధక టీకాలు వేసిన జిల్లాగా సిద్ధిపేట జిల్లా జాతీయ స్థాయిలో అరుదైన రికార్డు సృష్టించింది. అంతేకకాకుండా, నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేసి, మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ పనితీరు కనబరిచినందుకు కేంద్ర ప్రభుత్వం, ఈ జిల్లాకు ప్రధానమంత్రి అవార్డు-2019ను ప్రకటించింది. 2022 ఏప్రిల్ 20-21 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ డే కార్యక్రమంలో ట్రోఫీ, ప్రశంసాపత్రంతోపాటు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహాన్ని కేంద్రం అందజేసింది.[10][11]

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లింకులు

మార్గదర్శకపు మెనూ