సహజ ఉపగ్రహం


ఒక గ్రహం లేదా చిన్న గ్రహం చుట్టూ పరిభ్రమించే ఖగోళ వస్తువును సహజ ఉపగ్రహం అంటారు. భూమికి ఉన్న సహజ ఉపగ్రహం పేరు చంద్రుడు. ఉపగ్రహాలన్నిటినీ మామూలుగా చంద్రుడు అని అనడం కూడా కద్దు. సౌర కుటుంబంలో ఆరు గ్రహ వ్యవస్థలున్నాయి. అన్నిటిలోనూ కలిపి 185 ఉపగ్రహాలున్నాయి.[1][2] ఇవి కాకుండా ప్లూటో, హామియా, మాకెమాకె, ఎరిస్ అనే నాలుగు మరుగుజ్జు గ్రహాలకు కూడా ఉపగ్రహాలున్నాయి.[3] 2018 సెప్టెంబరు నాటికి తెలిసిన దాని ప్రకారం 334 చిన్న గ్రహాలకు ఉపగ్రహాలున్నాయి.[4]

సౌరకుటుంబంలో భూమి-చంద్రుడు వ్యవస్థకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రెండింటి ద్రవ్యరాశి నిష్పత్తి, మరే ఇతర పెద్ద గ్రహ-ఉపగ్రహ ద్రవ్యరాశుల నిష్పత్తి కన్నా చాలా ఎక్కువ. (అయితే, ప్లూటో-చరోన్ వంటి చిరు గ్రహవ్యవస్థలు కొన్నిట్లో ఈ నిష్పత్తి ఇంకా ఎక్కువ ఉంది.). చంద్రుడి వ్యాసం (3,474 కి.మీ.) భూమి వ్యాసంలో 0.27 రెట్లుంది.[5]

నిర్వచనం

భూమి, చంద్రుల పరిమాణంలో పోలిక.

ఉపగ్రహంగా పరిగణించడానికి ఒక ఖగోళ వస్తువు పరిమాణం ఇంతకంటే తక్కువ ఉండకూడదు అని ఒక పరిమితి అంటూ లేదు. సౌరవ్యవస్థలోని ఏదైనా గ్రహం చుట్టూ స్పష్టంగా గుర్తించబడ్డ కక్ష్యలో తిరుగుతున్న ఖగోళ వస్తువులన్నిటినీ, ఒక కిలోమీటరు వ్యాసం మాత్రమే ఉన్నవాటిని కూడా, ఉపగ్రహాలు గానే పరిగణిస్తారు. శని వలయాల్లో ఉన్న, ఇందులో పదోవంతు ఉండే వస్తువులను - నేరుగా గుర్తించబడనివి - చిరు ఉపగ్రహాలు (మూన్‌లెట్స్) అంటారు. ఏస్టెరాయిడ్ల చుట్టూ తిరిగే వాటిని కూడా చిరు ఉపగ్రహాలనే అంటారు.[6]

పరిమాణం ఎంత పెద్దగా ఉండాలనే విషయంపై కూడా స్పష్టత లేదు. కక్ష్యలో పరిభ్రమించే రెండు వస్తువులను కొన్నిసార్లు గ్రహం-ఉపగ్రహం అని కాకుండా, జంట గ్రహాలు అని అంటారు. 90 ఏంటియోప్ ఏస్టెరాయిడ్లను జంట ఏస్టెరాయిడ్లు అంటారు. ప్లూటో-చరోన్‌లను కూడా కొందరు జంట మరుగుజ్జు గ్రహాలు అంటారు.

పుట్టుక, కక్ష్యా లక్షణాలు

గ్రహానికి దగ్గరగా, ప్రోగ్రేడ్ కక్ష్యలో,[a] వాలు లేని వృత్తాకార కక్ష్యలో తిరిగే ఉపగ్రహాలన్నీ (సాధారణ ఉపగ్రహాలు), ఆ గ్రహం ఏర్పడిన ఆదిమ గ్రహ చక్రం లోని ప్రాంతం నుండే ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు.[7][8] దీనికి విరుద్ధంగా, గ్రహానికి దూరంగా, దీర్ఘ వృత్తాకార, వాలు కక్ష్యల్లో పరిభ్రమించే ఉపగ్రహాలను (అసాధారణ ఉపగ్రహాలు) గ్రహపు గురుత్వ శక్తికి లోబడిపోయిన ఏస్టెరాయిడ్లు అయి ఉంటాయని భావిస్తున్నారు. సౌర వ్యవస్థలో పెద్ద సహజ ఉపగ్రహాలన్నీ సాధారణ కక్ష్యల్లోనే పరిభ్రమిస్తున్నాయి.[9] చంద్రుడు[10] (బహుశా చరోన్ కూడా[11]) రెండు పెద్ద ఆదిమ గ్రహాలు గుద్దుకోవడం వలన ఏర్పడిందని భావిస్తున్నారు. ఈ ఘాతం కారణంగా కక్ష్యల్లోకి వెదజల్లబడ్డ పదార్థాలు మళ్ళీ అతుక్కుని (దీన్ని ఎక్రీషన్[b] అంటారు.) ఉపగ్రహంగా తయారై ఉండవచ్చు. గ్రహాలకు చెందిన ఉపగ్రహాల కంటే, ఏస్టెరాయిడ్ల ఉపగ్రహాలు ఎక్కువగా ఈ పద్ధతిలో ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు. ట్రైటన్ మరో మనహాయింపు; ఇది గ్రహం చుట్టూ దగ్గరగా, వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నప్పటికీ, రెట్రోగ్రేడ్[c] కక్ష్యలో తిరుగుతున్నందున దీన్ని గ్రహానికి లోబడ్ద మరుగుజ్జు గ్రహం అని భావిస్తున్నారు.

టైడల్ లాకింగ్

మొదటి బొమ్మలోని ఉపగ్రహం, దాని గ్రహంతో టైడల్ లాకింగులో ఉంది. రెండవ బొమ్మలోని ఉపగ్రహం టైడల్ లాకింగులో లేదు.

ఒక ఉపగ్రహం దాని గ్రహం చుట్టూ ఒకసారి పరిభ్రమించేందుకు పట్టే కాలం, ఆ ఉపగ్రహపు ఒక భ్రమణానికి పట్టే కాలంతో సమానంగా ఉంటే, ఆ ఉపగ్రహపు ఒకే వైపు ఎల్లప్పుడూ గ్రహం వైపు ఉంటుంది. దీన్ని టైడల్ లాకింగ్ అంటారు. సౌరవ్యవస్థలోని సాధారణ ఉపగ్రహాలు చాలావరకూ - చంద్రుడితో సహా - దాని మాతృగ్రహంతో టైడల్ లాకింగులో ఉంటాయి. శని ఉపగ్రహమైన హైపీరియన్ మాత్రం దీనికి మినహాయింపు. శని మరో ఉపగ్రహం టైటన్ హైపీరియన్‌పై చూపించే గురుత్వ ప్రభావం వలన ఈ టైడల్ లాకింగు సాధ్యపడలేదు.

బాహ్య సౌరవ్యవస్థలోని పెద్ద గ్రహాల ఉపగ్రహాలు గ్రహం నుండి బాగా దూరంగా ఉండటం చేత (అసాధారణ ఉపగ్రహాలు) వీటికి టైడల్‌ లాకింగు లేదు. ఉదాహరణకు, గురుడి ఉపగ్రహం హిమాలియా, శని ఉపగ్రహం నెరీడ్ ల భ్రమణ కాలం దాదాపు 10 గంటలుండగా, వాటి పరిభ్రమణ కాలం మాత్రం వందల రోజులు ఉంటుంది.

ఉపగ్ర్హహాల ఉపగ్రహాలు

2019 నాటికి ఉప గ్రహాలకు ఉప గ్రహాలున్నట్లుగా గమనించలేదు. గ్రహం దాని ఉపగ్రహంపై చూపించే టైడల్ ప్రభావం దాన్ని సాధ్యపడనీయదు. అయితే ఇటీవలి కాలంలో శనికి ఉపగ్రహమైన రియా పై జరిపిన పరిశోధనల్లో దాని వలయాల్లోని కొన్ని ఉపగ్రహాలకు స్థిర కక్ష్యలు ఉన్నట్లు లెక్కలు కట్టారు. అయితే, కాస్సిని వ్యోమనౌక తీసిన చిత్రాల్లో ఈ వలయాలున్నట్లు కనబడలేదు.[12]

ఉపగ్రహాల చిత్రాలు

సౌర వ్యవస్థలోని ఉపగ్రహాలు
గానిమీడ్
(గురుడి ఉపగ్రహం)
టైటన్
(శని ఉపగ్రహం)
కాలిస్టో
(గురుడి ఉపగ్రహం)
అయో
(గురుడి ఉపగ్రహం)
చంద్రుడు
(భూమి ఉపగ్రహం)
యూరోపా
(గురుడి ఉపగ్రహం)
ట్రైటన్
(నెప్ట్యూన్ ఉపగ్రహం)
టైటానియా
(యురేనస్ ఉపగ్రహం)
రియా
(శని ఉపగ్రహం)
ఒబేరియన్
(యురేనస్ ఉపగ్రహం)
లాపెటస్
(శని ఉపగ్రహం)
చరోన్
(ప్లూటో ఉపగ్రహం)
అంబ్రియెల్
(యురేనస్ ఉపగ్రహం)
ఏరియెల్
(యురేనస్ ఉపగ్రహం)
డయోన్
(శని ఉపగ్రహం)
టెథిస్
(శని ఉపగ్రహం)
ఎన్‌సెలాడస్
(శని ఉపగ్రహం)
మిరాండా
(యురేనస్ ఉపగ్రహం)
ప్రోటియస్
(నెప్ట్యూన్ ఉపగ్రహం)
మిమాస్
(శని ఉపగ్రహం)
హైపీరియన్
(శని ఉపగ్రహం)
ఫోబ్
(శని ఉపగ్రహం)
జానస్
(శని ఉపగ్రహం)
అమాల్థియా
(గురుడి ఉపగ్రహం)
ఎపిమేథియస్
(శని ఉపగ్రహం)
థీబ్
(గురుడి ఉపగ్రహం)
ప్రొమేథియస్
(శని ఉపగ్రహం)
పాండోరా
(శని ఉపగ్రహం)
హైడ్రా
(ప్లూటో ఉపగ్రహం)
నిక్స్
(ప్లూటో ఉపగ్రహం)
హెలీన్
(శని ఉపగ్రహం)
అట్లాస్
(శని ఉపగ్రహం)
పాన్
(శని ఉపగ్రహం)
టెలెస్టో
(శని ఉపగ్రహం)
కాలిప్సో
(శని ఉపగ్రహం)
ఫోబోస్
(అంగారకుడి ఉపగ్రహం)
డేమోస్
(అంగారకుడి ఉపగ్రహం)
డాఫ్నిస్
(శని ఉపగ్రహం)
మీథోన్
(శని ఉపగ్రహం)
డాక్టిల్
(ఇడా ఉపగ్రహం)

నోట్స్

మూలాలు

బయటి లింకులు

బృహస్పతి ఉపగ్రహాలు

శని చంద్రులు

మొత్తం చంద్రులు

eu:Satelitefa:فهرست ماه‌های سیاراتru:Спутники планетsk:Prirodzený satelit slnečnej sústavy

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ