సరూర్‌నగర్

(సరూర్‌నగర్‌ నుండి దారిమార్పు చెందింది)

సరూర్‌నగర్‌, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్‌ మండలానికి చెందిన గ్రామం.[1]

సరూర్‌నగర్
నివాసప్రాంతం
సరూర్‌నగర్ is located in Telangana
సరూర్‌నగర్
సరూర్‌నగర్
హైదరాబాదులో ప్రాంతం ఉనికి
సరూర్‌నగర్ is located in India
సరూర్‌నగర్
సరూర్‌నగర్
సరూర్‌నగర్ (India)
Coordinates: 17°21′22″N 78°32′00″E / 17.3561°N 78.5333°E / 17.3561; 78.5333
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారంగారెడ్డి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 079
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ
సివిక్ ఏజెన్సీహైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ
సరూర్‌నగర్‌ ప్యాలస్

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

భౌగోళికం

సరూర్‌నగర్‌ చెరువు

సరూర్ నగర్ హైదరాబాదుకు తూర్పు దిక్కున సముద్ర మట్టం నుండి సుమారు 487 మీటర్ల (1601 అడుగులు) ఎత్తులో ఉంది.17°21′22″N 78°32′00″E / 17.3561°N 78.5333°E / 17.3561; 78.5333.[3]

ఆసక్తికరమైన ప్రదేశాలు

  • సరూర్‌నగర్‌ చెరువు: 16వ శతాబ్దంలో కులీ కుతుబ్ షా పాలనాకాలంలో, పంటపొలాలకు నీరందించేందుకు ఈ చెఱువు త్రవ్వించబడింది. ఒక చదరపు కిలోమీటరు వైశ్యాల్యం కలిగిన ఈ చెరువు ఇటీవలి కాలంలో భూమి కబ్జాల వల్లను చుట్టుపక్కల నెలక్కొన్న ఆవాసాల వల్ల కుంచించుకుపోయింది. స్వాతంత్ర్యం తర్వాత హైదరాబాదు నగరం యొక్క పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు ఆవాస యోగ్యమైన భూమి కొరకై చెఱువు చుట్టపక్కల వ్యవసాయభూమిని ఇండ్ల స్థలాలుగా మార్చేశారు. 90వ దశకంలో చెఱువు కట్టను విస్తరించి, చెఱువు పరిసరాలను తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
  • సరూర్‌నగర్‌ క్రీడా ప్రాంగణం: విజయవాడ జాతీయరహదారిపై నెలక్కొన్న ఇండోర్ క్రీడా ప్రాంగణమిది. 2002లో హైదరాబాదులో జరిగిన 32వ జాతీయ క్రీడల సందర్భంగా దీన్ని నిర్మించారు. ఈ ప్రాంగణం 2,000 మంది ప్రేక్షకులు తిలకించగల సామర్థ్యం కలిగి ఉంది.
  • విక్టోరియా మెమోరియల్ హోం: ఆరవ నిజాం మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ తన కుటుంబానికి వేట విడిదిగానూ, వేసవి విడిదిగానూ ఉపయోగించేందుకు నిర్మించిన ఈ మహల్ సరూర్ నగర చెఱువుకు సమీపంలో 65 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది.[4][5] నిజాంకు ఈ మహలు కలిసిరాకపోవటం వల్ల అశుభసూచకంగా భావించి దాన్ని అనాథశరణాలయంగా మార్చేందుకు ఆదేశించాడు. అప్పటి బ్రిటీషు రెసిడెంటు విన్నపం ప్రకారం దాన్ని విక్టోరియా రాణి స్మారకార్ధంగా నామకరణం చేశారు.[6]

హాస్పిటల్స్

  • అవేర్ హాస్పిటల్: అవేర్ అనే స్వచ్ఛందసంస్థ యొక్క ఛైర్మన్ పి.కె.ఎస్.మాధవన్, ఆ సంస్థ యొక్క రజతోత్సవ సందర్భంగా స్థాపించాడు. ఇది నాగార్జున సాగర్ రోడ్డుపైన బైరాముల్‌గూడాలోని శాంతివనంలో ఉంది. ఇది ఆధ్యాత్మిక దృష్టితో, పర్యావరణానికి అనుగుణంగా రూపొందించబడింది. 50 స్పెషాల్టీ శాఖలున్న ఈ 300 పడకల ఆసుపత్రి అత్యంత ఆధునిక సాంకేతి, పరికరాలతో 24 గంటలు సేవలు అందజేస్తున్నది.

మూలాలు

వెలుపలి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ