సమంత

తెలుగు నటి
(సమంత అక్కినేని నుండి దారిమార్పు చెందింది)

సమంత (జ. 28 ఏప్రిల్, 1987) తెలుగు, తమిళ్ భాషల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013) చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.

సమంత

జన్మ నామంసమంత రుతు ప్రభు
జననం (1987-04-28) 1987 ఏప్రిల్ 28 (వయసు 37)
భారతదేశం
క్రియాశీలక సంవత్సరాలు2007 - ఇప్పటివరకు
భార్య/భర్తఅక్కినేని నాగ చైతన్య (2017-2021)

మరోపక్క ఈగ ఏకకాల తమిళ నిర్మాణం నాన్ ఈ, ఎటో వెళ్ళిపోయింది మనుసు ఏకకాల తమిళ నిర్మాణం నీదానే ఎన్ పొన్వసంతం సినిమాలతో తమిళంలో గుర్తింపు సాధించిన సమంత ఆపై అంజాన్ (2014), కత్తి (2014) సినిమాలతో తమిళనాట కూడా ప్రముఖ కథానాయికగా ఎదిగింది. 2013లో రేవతి తర్వాత ఒకేసారి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా సమంత ప్రసిద్ధి గాంచింది. సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ యొక్క రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది.[1]

పెళ్ళి - విడాకులు

అక్టోబర్‌ 2017, 6, 7 తేదీలలో సమంత, నాగ చైతన్యల పెళ్లి గోవాలో హిందూ, క్రిస్టియన్‌ సాంప్రదాయాల ప్రకారం జరిగింది. వీరు టాలీవుడ్ స్టార్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే వారిరువురు 2 అక్టోబరు, 2021న వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ విషయాన్ని నాగ చైతన్య  ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు. మరోవైపు సమంత సైతం నాగచైతన్యతో విడిపోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.[2]

నటించిన చిత్రాలు

తెలుగు

సంవత్సరంచిత్రంపాత్రవివరాలు
2010ఏ మాయ చేశావేజెస్సీ'విజేత', ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నూతన నటి,
'విజేత', సినీ"మా" అవార్డ్ - ఉత్తమ నూతన నటి,
'విజేత', నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్,
'విజేత', టీ.ఎస్.ఆర్ - టీవీ 9 అవార్డ్ 2011 - ఉత్తమ నటి,
పేర్కొనబడింది, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి
2010బృందావనంఇందు
2011దూకుడుప్రశాంతిపేర్కొనబడింది, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి,
పేర్కొనబడింది, దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా అవార్డ్ సైమా- ఉత్తమ నటి
2012ఈగబిందుతమిళంలో "నాన్ ఈ" పేరుతో ఏకకాలంలో నిర్మించబడింది,
'విజేత', ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి,
'విజేత', టీ.ఎస్.ఆర్ - టీవీ 9 అవార్డ్ 2012 - ఉత్తమ నటి,
'విజేత', సినీ"మా" అవార్డ్ - ఉత్తమ నటి
2012ఎటో వెళ్ళిపోయింది మనసునిత్య
2013సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుగీత
2013జబర్‌దస్త్శ్రేయ
2013సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌అతిథి పాత్ర
2013అత్తారింటికి దారేదిశశి
2013రామయ్యా వస్తావయ్యాఆకర్ష
2014ఆటోనగర్ సూర్యశిరీష
2014మనంప్రియ/కృష్ణవేణి
2014రభస
2017అ ఆఅనసూయవిజేత, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి,
పేర్కొనబడింది, దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా అవార్డ్ SIIMA - ఉత్తమ నటి
201724
2018మహానటిమధురవాణిమహానటి సావిత్రి గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమలో ప్రజావాణి పత్రిక విలేఖరి.
2018యూ టర్న్రచనమిస్టరీ - థ్రిల్లర్ చిత్రం
2018సీమరాజా
2019ఓ బేబీ
2020జానుజానకి దేవి/ జానుసమంత చేసిన జాను పాత్రను తమిళంలో నటి త్రిష చేయబడింది.
2022యశోదయశోద
2022శాకుంతలంశకుంతల

తమిళం

సంవత్సరంచిత్రంపాత్రవివరాలు
2010విన్నైతాండి వరువాయానందినిఅతిథి పాత్ర
2010బాణ కాథడిప్రియపేర్కొనబడింది, విజయ్ అవార్డ్ - ఉత్తమ నూతన నటి
2011మాస్కోవిన్ కావేరికావేరి
2012నడునిశి నాయగల్అతిథి పాత్ర
2012నాన్ ఈబిందుతెలుగులో "ఈగ" పేరుతో ఏకకాలంలో నిర్మించబడింది
2013నీదానే ఎన్ పొన్వసంతంనిత్యఎటో వెళ్ళిపోయింది మనసు యొక్క ఏకకాల నిర్మాణం,
ఇందులో నానీ పోషించిన వరుణ్ పాత్రను తమిళ నటుడు జీవా పోషించాడు
'విజేత', ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి,
'విజేత', వికటన్ అవార్డ్ - ఉత్తమ నటి,
'విజేత', విజయ్ అవార్డ్ - ఉత్తమ నటి
2014అంజాన్జీవాచిత్రీకరణ జరుగుతున్నది
2014కత్తివేణిచిత్రీకరణ జరుగుతున్నది

పురస్కారాలు

సైమా అవార్డులు

మూలాలు

బయటి లింకులు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సమంత పేజీ

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ