సత్యజిత్ రాయ్

భారతియా రచయిత

సత్యజిత్ రాయ్ (మే 2 1921ఏప్రిల్ 23 1992) భారతదేశంలోని బెంగాల్ రాష్ట్రానికి చెందిన సినీ దర్శకుడు, రచయిత. ఆతను ప్రపంచ సినిమాలో 20వ శతాబ్దపు ఉత్తమ దర్శకుల్లో ఒకడుగా పేరు గడించాడు.[1] కలకత్తాలో బెంగాలీ కళాకారుల కుటుంబములో జన్మించిన సత్యజిత్ రాయ్ కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలోనూ, రవీంద్రనాథ్ టాగోర్ స్థాపించిన శాంతినికేతన్ లోని విశ్వభారతి విద్యాలయము లోనూ చదివాడు. వ్యాపార కళాకారునిగా కెరీర్ ప్రారంబించిన రాయ్, లండన్ లో ఫ్రెంచి నిర్మాత జాన్ రెన్వాను కలిసాక, ఇటాలియన్ "నియోరియలిస్టు" సినిమా బైసికిల్ థీవ్స్ తరువాత సినిమాలు తీయడంపై ఆసక్తి పెంచుకున్నాడు.

సత్యజిత్ రాయ్
సత్యజిత్ రాయ్
జననం మే 2 1921
కొలకత్తా, భారతదేశము
మరణం ఏప్రిల్ 23 1992
కొలకత్తా, భారతదేశము
వృత్తి చలన చిత్ర నిర్మాత, రచయత
భార్య/భర్త విజయా రాయ్ (బిజొయా రాయ్)

రాయ్ సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు కలిపి మొత్తము ముప్పై ఏడు చిత్రాలకు దర్శకత్వము వహించాడు. ఆయన మొదటి సినిమా పథేర్ పాంచాలీ, కేన్స్ చలనచిత్రోత్సవములో 11 అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది. ఆయనకి దర్శకత్వమే కాక, సినిమా తీయడంలోని ఇతర విభాగాల పట్ల కూడా మంచి పట్టు ఉంది. తన సినిమాలో చాలా వాటికి స్క్రీన్ ప్లే (కథాగమనము), కేస్టింగ్ (నట సారథ్యము), సంగీతము, సినిమాటోగ్రఫీ, కళా దర్శకత్వము, కూర్పు, పబ్లిసిటీ డిజైన్ చేసుకోవడము - వంటివి కూడా ఆయనే చూసుకునేవాడు. సినిమాలు తీయడమే కాక రాయ్ ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు కూడా రాసాడు. అలాగే, ఆయన ప్రచురణ కర్త కూడా. బెంగాలీ పిల్లల పత్రిక "సందేశ్"ను చాలా ఏళ్ళు నిర్వహించాడు. అనేక అవార్డులు పుచ్చుకున్న రాయ్ 1992 లో ఆస్కార్ కూడా అందుకున్నాడు.

1992లో సత్యజిత్ రాయ్ గౌరవ ఆస్కార్ పురస్కారం అందుకున్న తొలి భారతీయునిగా నిలిచాడు.

1992లో, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (ఆస్కార్) సత్యజిత్ రాయ్కి అకాడమీ గౌరవ పురస్కారం (ఆస్కార్ అవార్డు) అందించారు. గౌరవ ఆస్కార్ పురస్కాన్ని అందుకున్న తొలి భారతీయునిగానూ, ఆపైన భారతరత్న పురస్కారం పొందిన తొలి చలనచిత్ర రంగప్రముఖునిగానూ నిలిచారు.[2] తాను మరణించేందుకు 23 రోజుల ముందు ఆ పురస్కారాన్ని స్వీకరించి, తన చలనచిత్ర జీవితంలో ఇది అత్యంత గొప్ప విజయంగా ప్రకటించారు.[3].

తొలి జీవితము

రాయ్ తాత ఉపేంద్రకిషోర్ రాయ్ చౌదరి, ఒక రచయిత, తత్త్వవేత్త, ప్రచురణకర్త, బ్రహ్మ సమాజం నాయకుడు. ఉపేంద్రకిషోర్ కొడుకు సుకుమార్ బెంగాలీలో నాన్సెన్స్ కవిత్వము (అంటే యతి ప్రాసలు లేకుండా వింతగా ఉండి, నవ్వు పుట్టించే కవిత్వము) సృష్టికర్త, బాల సాహిత్యవేత్త, విమర్శకుడు. సత్యజిత్ సుకుమార్, సుప్రభ దంపతులకు 1921 మే 2న జన్మించాడు. రాయ్‌కు 3 సంవత్సరములు ఉన్నపుడు సుకుమార్ చనిపోగా సుప్రభ చిన్న ఆదాయముతో రాయ్‌ని పెంచింది. రాయ్ కళల పై ఆసక్తి ఉన్నపటికీ ప్రెసిడెన్సీ కాలేజీలో అర్థశాస్త్రము చదివాడు. శాంతినికేతన్ పై చిన్న చూపు ఉన్నప్పటికీ [4] తల్లి ప్రోద్బలముతో టాగూర్ కుటుంబము పై గౌరవముతో విశ్వభారతికి వెళ్ళాడు. అక్కడ ప్రాచ్య కళలు (ఓరియంటల్ ఆర్ట్) లను ఆభ్యసించాడు. ప్రముఖ పెయింటర్లు నందలాల్ బోస్ [5] వినోద్ బిహారీ ముఖర్జీ నుంచి నేర్చుకున్నాడు, అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, ఎలిఫెంటా గుహలు దర్శించి భారతీయ కళల పై మక్కువ పెంచుకున్నాడు.[6] సత్యజిత్ రాయ్ మరణానంతరం భారత ప్రభుత్వ తపాలా శాఖ ఆయన పై ఓ స్టాంపును విడుదల చేసింది.

దర్శకత్వం వహించిన సినిమాలు

ఇతడు దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు :

  1. పథేర్ పాంచాలి (1955)
  2. అపరాజితొ (1956)
  3. అపుర్ సంసార్ (1959)
  4. దేవి (1961)
  5. కాంచన్‌జంగ (1962)
  6. మహానగర్ (1963)
  7. చారులత (1964)
  8. చిరియాఖానా (1967)[7]
  9. తీన్ కన్య
  10. కాపురుష్ వో మహాపురుష్
  11. గోపీ గాఁయె బాఘా బఁయె (1969)
  12. సీమబద్ధ (1971)
  13. సోనార్ కెల్లా
  14. నాయక్
  15. ఘరె బైరె (1984)
  16. అగంతక్

రచయితగా సత్యజిత్ రాయ్

ప్రపంచానికి సత్యజిత్ రాయ్ ఒక దర్శకుడిగా మాత్రమే తెలిసినా కూడా ఆయన బెంగాలీలో ఎన్నో రచనలు చేశాడు. తన తాత ప్రారంబించిన "సందేశ్" పత్రిక మధ్యలో ఆగిపోతే సత్యజిత్ రాయ్ తిరిగి ప్రారంభించాడు. ఇది చిన్న పిల్లల కోసం ప్రారంభింపబడిన పత్రిక. ఇందులోనే సత్యజిత్ రాయ్ పిల్లల కోసం "ఫెలూదా" అన్న డిటెక్టివ్ ని సృష్టించారు. 1965 మొదలుకుని 1994 దాకా 35 ఫెలూదా నవలలు రాసారు. ఇందులో - ఫెలూదా, అతని కజిన్ తపేష్, జటాయు అని పిలువబడు లాల్ మోహన్ గంగూలీ ప్రధాన పాత్రలు. వీరు ముగ్గురు కలిసి పరిష్కరించే సమస్యల సంకలనమే ఫెలూదా కథలు. ఇది కాక సత్యజిత్ రాయ్ ప్రొఫెసర్ శొంకు అన్న మరో పాత్రని కూడా సృష్టించి నవలలు రాసాడు. బెంగాలీ పిల్లల సాహిత్యంలో ఈ రెండు పాత్రలకి ఓ విశిష్ట స్థానం ఉంది. సత్యజిత్ రాయ్ కథా రచయిత కూడా. ఆయన రాసిన కథలు ఆయనకు వివిధ రంగాలలో ఉన్న విశేష పరిజ్ఞానాన్ని తెలియజేస్తాయి. ఆయన రచనల్లో చాలా వరకు గోపా మజుందార్ ఆంగ్లానువాదం చేసారు. సత్యజిత్ రాయ్ పిల్లల నవల - "ఫతిక్ చంద్" తెలుగు లోకి కూడా అనువదితమైంది.

ఇవి కాక, సినిమాలు తీయడం గురించి ఆయన అనేక వ్యాసాలు రాశాడు. వాటిలో కొన్ని తెలుగులోకి అనువదితం అయ్యాయి కూడా.
ఆయన కథా సంకలనాలలో కొన్ని:
1.20 short stories
2. Stranger and other stories (20 short stories above + Fotik chand)
3. The Best of Satyajit Ray
- ఆయన కథలన్నీ మొదట పన్నెండు కథల సంకలనాలుగా వచ్చాయి. పన్నెండుకి రకరకాల నామాంతరాలతో విడుదల కావడం వాటి ప్రత్యేకత. ఉదాహరణకు - "డజన్", "టూ ఆన్ టాప్ ఆఫ్ టెన్" వగైరా.

ఆయన ఫెలూదా కథల జాబితాని ఇక్కడ చూడవచ్చు.

గౌరవాలు

2021లో జరిగిన 52వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో సత్యజిత్ రే శతజయంతి సందర్భంగా, డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ 'స్పెషల్ రెట్రోస్పెక్టివ్' ద్వారా ఆయనకు నివాళులు అర్పించింది, చిత్రోత్సవంలో రే రూపొందించిన 11 సినిమాలు ప్రత్యేకంగా ప్రదర్శించబడ్డాయి. అతని వారసత్వానికి గుర్తింపుగా జీవితకాల సాఫల్య పురస్కారానికి ఈ సంవత్సరం నుండి 'సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు'గా పేర్కొనబడింది.

గ్రంథసూచి

మూలాలు

బాహ్య లంకెలు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ