సంజీవని

సంజీవని అనేది పెర్న్ జాతికి చెందిన మొక్క. దీని శాస్త్రీయ నామం సెలాజినెల్లా బ్రయోటెరిస్ ( Selaginella bryopteris ). ఉష్ణమండల ప్రాంతాలలోని కొండలలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని తూర్పు, పడమర కనుమలలో, ఉత్తర భారతదేశంలో ఆరావళి పర్వతాల్లో సంజీవని పెరుగుతుంది. తెలంగాణా ప్రాంతంలోని కె.బి.ఆర్ పార్కు వంటి రాతిప్రదేశాల్లో కూడా ఈ మొక్క కనిపిస్తుంది. ఈ మొక్క నీళ్ళు లేని సమయాల్లో వాడిపోయి ముడుచుకొని ఉంటుంది. నీరు లభ్యమైనప్పుడు ముడుచుకొని ఉన్న ఆకులు విచ్చుకుంటాయి. నల్లమల అడవుల్లో చెంచు తెగ వారు నిస్సత్తువకు సంజీవని [1] మొక్కలను గుజ్జుగా దంచి రోజుకు ఒక చెంచా గుజ్జు చొప్పున నీటితో కలిపి మూడు రోజుల పాటూ సేవిస్తారు. మరికొన్ని తెగలు సెగ వ్యాధి నయంచేయడానికి సంజీవని మొక్కలను చిమచిపురు (Grewia hirsuta ) వేళ్ళతోను, సుగంధిపాల (Hemidesmus indicus) వేళ్ళతోను, మిరియాలతోను, పంచదారతోను నూరి పచ్చడి చేసి మాత్రలుగా చేస్తారు.[2]మొక్కకు మనిషిని బ్రతికించే గుణం కొన్ని పద్ధతుల ద్వారా తప్పక అవకాశం వుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. మొక్కలోని 10 శాతం స్వరసం వల్ల 41 శాతం ఎస్.ఎఫ్ 7 గ్రంథులు సూక్ష్మక్రిమిని నాశనం చేసి బ్రతకడానికి అవసరమైన పోషకాలను వృద్ధి చేస్తాయి. నిజానికి మరణించబోతున్న లేదా అప్పుడే మరణించిన వ్యక్తుల్లో బ్యాక్యులో వైరల్ ప్రవేశిస్తుంది. ఈ వైరల్ ను నాశనం చేయడానికి అవసరమైన ఎస్.ఎఫ్ 9 గ్రంథులను జనింపచేసే శక్తి ఒక్క సంజీవని మొక్కకు మాత్రమే ఉంది.[3] తెలంగాణా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సంజీవని మొక్కను పిట్ట కాలు గా వ్యవహరిస్తారు.[4]రామాయణం - యుద్ధ కాండలో పేర్కొనబడ్డ సంజీవని మొక్క ఇదే. శ్రీరాముడికి, రావణుడికి యుద్ధం జరిగే సమయంలో ఇంద్రజిత్తు ఆయుధ దెబ్బతో లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు. హనుమంతుడు హిమాలయాల్లో ఉన్న సుమేరు పర్వతానికి వెళ్ళి అక్కడ సంజీవని మొక్కను గుర్తుపట్టక మొత్తం సుమేరు పర్వతాన్ని ఎత్తుకొస్తాడు. లక్ష్మణుడికి ఆ మొక్క రసాన్ని పోయగా స్పృహనుంచి లేస్తాడు.

సంజీవని
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Lycopodiophyta
Class:
Isoetopsida
Order:
Selaginellales
Family:
Selaginellaceae
Genus:
Selaginella
Species:
S. bryopteris
Binomial name
Selaginella bryopteris
(L.) Baker

బయోడైవర్సిటీ ఎగ్జిబిషన్‌లో సంజీవిని

2022 మే 22న చెన్నైలో జరిగే బయోడైవర్సిటీ ఎగ్జిబిషన్‌లో సంజీవిని ప్రదర్శించాలని బిహార్‌ సర్కారు నిర్ణయించింది. బీహార్‌లోని రోహతస్‌ జిల్లాలో లభించే సంజీవిని బూతి అనే మొక్కను రామాయణంలోని సంజీవినిగా విశ్వసిస్తారు. ఇందులో అనేక ఔషధ లక్షణాలున్నాయని బిహార్‌ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్‌ డీకే శుక్లా వెల్లడించారు.[5]

జాంబవంతుడు ప్రోద్బలంతో, హనుమంతుడు సంజీవిని మొక్కలకై హిమాలయాలకు వెళ్తాడు.
హనుమంతుడు పర్వతాన్ని తీసుకొచ్చి సంజీవనిని వెలికితీస్తాడు

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ