షోషోని భాష

షోషోని (షోషోని: soni' ta̲i̲kwappe, newe ta̲i̲kwappe లేదా neme ta̲i̲kwappeh) ఊటో-ఆజ్టెక్ కుటుంబానికి చెందిన నూమిక భాష, షోషోని వారు పశ్చిమ సంయుక్త రాష్ట్రాల్లో మాట్లాడేది. షోషోని ప్రధానంగా గ్రేట్ బేసిన్లో, వయోమింగ్, యూటా, నెవాడా, ఐడహొలో కొన్ని ప్రాంతాల్లో మాట్లాడుతారు.[1]

షోషోని
Sosoni' ta̲i̲kwappe, Neme ta̲i̲kwappeh
మాట్లాడే దేశాలు:సంయుక్త రాష్ట్రాలు  
ప్రాంతం:వయోమింగ్, యూటా, నెవాడా, ఐడహొ
మాట్లాడేవారి సంఖ్య:~1,000
భాషా కుటుంబము:ఊటో-ఆజ్టెక్
 నూమిక
  మధ్య నూమిక
   షోషోని 
వ్రాసే పద్ధతి:లాటిను
భాషా సంజ్ఞలు
ISO 639-1:none
ISO 639-2:
ISO 639-3:shh

షోషోని హల్లుల జాబితా కొంచం చిన్నది, కానీ భాష మాట్లాడుతున్నప్పుదు ఇంకా వర్ణాలుంటాయి. భాషలో 6 అచ్చులున్నాయి, అలాగే వాటికి దీర్ఘాలు.[1] షోషోని ఎక్కువగా ప్రత్యయాలను వాడే భాష, వాటి ద్వారా నామాల వచనలనూ విభక్తులనూ రూపభేదిస్తుంది. దాని పద క్రమం సాపేక్షంగా ఉచితం, కానీ కర్త-కర్మ-క్రియ క్రమం ప్రధానమైనది.[2]

"newe ta̲i̲kwappe" అనే స్థానిక పేరు అర్థం "ప్రజల భాష", అలాగే "Sosoni' ta̲i̲kwappe" అనేదాని అర్థం "షోషోని భాష".

వర్గీకరణనూ మాండలికాలూ

షోషోని ఒక పెద్ద భాషా కుటుంబంలోని అత్యుత్తరది, 60 జీవ భాషల ఊటో-ఆజ్టెక్ కుటుంబం. ఈ కుటుంబంలోన భాషలు పశ్చిమ సంయుక్త రాష్ట్రాల నుండి మెక్సికో, ఎల్ సాల్వడోర్ వరకు మాట్లాడుతారు.[3] షోషోని ఊటో-ఆజ్టెక్ భాషా కుటుంబంలోన నూమిక ఉపశాఖకు చెందింది.[4] నూమిక అనే మాట నూమిక భాషలన్నిట్లో "మనిషి" అనే మాట నుండి వచ్చింది. ఉదాహరణకు, షోషోనిలో ఆ మాట neme [nɨw̃ɨ] లేకపోతే కొన్ని మాండలికాల్లో, newe [nɨwɨ], తింపిసలో అది nümü [nɨwɨ], తర్వాత దక్షిణ పైయూటులో, nuwuvi [nuwuβi].

షోషోనికి అన్నిటి కంటే దగ్గరగా సంబంధమైన భాషలు మధ్య నూమిక భాషలు, తింపిసనూ కమాంచీనూ. తింపిస, లేదా పనమింత్, ఆగ్నేయ కాలిఫోర్నియాలోని తింపిస షోషోని తెగ సభ్యులు మాట్లాడుతారు, కానీ అది షోషోనికి వేరు భాషగా భావించినది.[5] కమాంచీ వారు దాదాపు 1700లో షోషోనిల నుండి విడిపోయారు, ఇంకా గతశతాబ్దాల్లో హల్లుల మార్పులవలన అవి పరస్పరం అర్థం కానివి.[6]

షోషోని ప్రధాన మాండలికాలు నెవాడాలోని పశ్చిమ షోషోని, పశ్చిమ యూటాలోని గోషూట్, దక్షిణ ఐడహొ, ఉత్తర యూటాలోని ఉత్తర షోషోని, వయోమింగ్లోని తూర్పు షోషోని.[7] ఈ మాండలికాల మధ్య ప్రధాన తేడాలు ధ్వనిశాస్త్రంలోనివి.[1]

స్థితి

షోషోని మాట్లాడేవారి సంఖ్య 20వ శతాబ్దం చివరి భాగం నుండి స్థిరంగా తగ్గిపోతోంది. ఇప్పుడు, 21వ శతాబ్దం మొదటి భాగంలో ధారాళంగా మాట్లాడేవారి సంఖ్య కొన్ని వందల, కొన్ని వేల మధ్యలో ఉంది, దాని పైన 1,000 మందికి వేరే వేరే స్థాయుల్లో ఈ భాష తెలుసు, ధారాళంగా మాట్లాడకపోయినా కూడా.[4] డక్ వాలీ, గోషూట్ సమూహాలు వాళ్ళ పిల్లలకు భాష నేర్పిచ్చడానికి కార్యక్రమాలను స్థాపించాయి. ఎథ్నోలాగ్ షోషోని "threatened" అని వర్ణిస్తుంది, మాట్లాడేవార్లో చాలా మంది 50 ఏళ్ళ కంటే పెద్దవారనే కారణం తోటి.[4] యునెస్కో ఏమో షోషోని ఐడహొలోనూ, యూటాలోనూ, వయోమింగ్లోనూ "severely endangered" అని వర్ణిస్తుంది[8] భాషను పిల్లలకు నేర్పిచ్చడం కొన్ని ఒంటరి స్థలాల్లో ఇంకా జరుగుతోంది. తెగలకు భాషను పునరజ్జీవించడంలో చాలా ఆసక్తి ఉంది, కానీ భాషను కాపాడేందుకు ప్రయత్నాలు అంత సహకారం లేకుండా చెదిరిపోయున్నాయి. అయినా కూడా, షోషోనిలో అక్షరాస్యత పెరుగుతోంది. షోషోని నిఘంటువులు ప్రచురించున్నాయి, ఇంకా బైబిల్లో కొన్ని భాగాల అనువాదాలు 1986లో అయ్యాయి.[4]

References

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ