షారుఖ్ ఖాన్

భారతీయ నటుడు, నిర్మాత

షారుఖ్ ఖాన్ (జననం 2 నవంబరు 1965)  ప్రముఖ భారతీయ సినీ నటుడు, నిర్మాత టివీ ప్రముఖుడు. అభిమానులు ఆయనను బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ అని పిలుస్తారు. షారూఖ్ దాదాపు 80 సినిమాల్లో నటించారు. ఆయన 14 ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు. ఆసియాలో షారూఖ్ చాలా ప్రముఖుడైన నటుడు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కువ నివసించే ప్రదేశాల్లో కూడా ఆయన చాలా ప్రసిద్ధుడు. అభిమానుల సంఖ్య, వసూళ్ళు లెక్కలో షారూఖ్ ప్రపంచంలోని అత్యంత సక్సెస్ ఫుల్ ఫిలిం స్టార్ లలో ఒకరిగా  నిలిచారు.[2][3][4]

షారుఖ్ ఖాన్
2018 లో హ్యుండాయ్ కార్యక్రమంలో షారుఖ్
జననం
షారుఖ్ ఖాన్

(1965-11-02) 1965 నవంబరు 2 (వయసు 58)
ఢిల్లీ
విద్యాసంస్థహంసరాజ్ కాలేజ్, జామియా మిలియా ఇస్లామియా[1]
వృత్తి
  • నటుడు
  • సినీ నిర్మాత
  • టివి వ్యక్తి
  • వ్యాపారవేత్త
క్రియాశీల సంవత్సరాలు1988–ప్రస్తుతం
Works
పూర్తి జాబితా
జీవిత భాగస్వామి
(m. 1991)
పిల్లలు3, సుహానా ఖాన్ తో సహా
పురస్కారాలుపూర్తి జాబితా
సన్మానాలుపద్మశ్రీ (2005)
Ordre des Arts et des Lettres (2007)
Légion d'honneur (2014)
సంతకం

1980వ దశకం చివర్లో టివి సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించారు షారూఖ్. 1992లో దీవానా సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేశారు ఆయన. కెరీర్ మొదట్లో దార్ర్ (1993), బాజిగర్ (1993),  అంజామ్ (1994) వంటి సినిమాల్లో ప్రతినాయక పాత్రలు పోషించారు. ఆ తరువాత వచ్చిన రొమాంటిక్  కామెడీ సినిమాలు దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే (1995), దిల్ తో పాగల్ హై (1997), కుచ్ కుచ్ హోతా హై (1998), మొహొబ్బతే (2000), కభీ ఖుషీ కభీ గమ్ (2001) సినిమాలతో హీరోగా ఉన్నత శిఖరాలందుకున్నారు షారుఖ్. దేవదాస్ (2002), స్వదేశ్ (2004), చక్ దే! ఇండియా (2007), మై నేమ్ ఈజ్ ఖాన్ (2010) సినిమాల్లో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆయన నటించిన కామెడీ సినిమాలు చెన్నై ఎక్స్‌ప్రెస్ (2013), హ్యాపీ న్యూ ఇయర్ (2014) సినిమాలో అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాలుగా నిలిచాయి. ఆయన సినిమాల్లో దేశభక్తి, సామాజిక సమస్యల గురించి ఎక్కువగా చర్తిస్తారు. సినిమాల్లో చేసిన కృషికిగానూ భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతోనూ,  ఫ్రాన్స్ ప్రభుత్వం ఒర్డరే డెస్ ఆర్ట్స్ ఎట్ దెస్ లెట్టర్స్, లెగియన్ డి ' హానర్ పురస్కారలతో గౌరవించాయి.

ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ కు ఆయన సహ చైర్మన్ గానూ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని కోల్‌కత నైట్ రైడర్స్ టీంకు సహ యజమానిగా ఉన్నారు. ఆయన ఇప్పటికీ టీవీ షోలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటారు. ఎన్నో వ్యవస్థాపక వెంచర్లు చేస్తున్నందున మీడియా ఆయనను "బ్రాండ్ ఎస్.ఆర్.కె"గా వ్యవహరిస్తుంటుంది. అనారోగ్యాల అవగాహన ప్రచారంలోనూ, విపత్తులు సంభవించినప్పుడు ఆయన దాతృత్వం చెప్పుకోదగ్గది. పిల్లల చదువు ఆవశ్యకతా ప్రచారంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 2011లో  యునెస్కో పిరమిడ్ కాచ్ మర్నీ పురస్కారంతో గౌరవించింది.  ప్రభావవంతమైన భారతీయునిగా ఎన్నో పత్రికల చిట్టాల్లో ఎన్నోసార్లు ఉన్నారు షారుఖ్. 2008లో న్యూస్ వీక్ పత్రిక ప్రపంచంలోని 50 అత్యంత పవర్ ఫుల్ వ్యక్తుల జాబితాలో ఆయనను ప్రస్తావించింది.

తొలినాళ్ళ జీవితం, కుటుంబం

2012లోని ఒక పార్టీలో భార్య గౌరి ఖాన్ తో షారుఖ్

1965 నవంబరు 2లో ఢిల్లీ లో ముస్లిం కుటుంబంలో జన్మించారు  ఆయన. పుట్టిన తరువాత 5ఏళ్ళ వరకు ఆయన మంగళూరు లోని  అమ్మమ్మ గారింట్లో ఉండేవారు షారూఖ్.[5][6] షారూఖ్ తాత ఇఫ్తికర్ అహ్మద్ 1960ల్లో పోర్టులో చీఫ్ ఇంజినీరుగా పనిచేసేవారు. తన నాన్నగారి తండ్రి జాన్ మహ్మద్ ఆఫ్ఘనిస్థాన్కు చెందిన సంప్రదాయ పఠాన్ కుటుంబానికి చెందినవారని  షారూఖ్ చెబుతారు.[7] ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో తమది పెషావర్ కు చెందిన పఠాన్ కుటుంబమనీ, తాము ఇంట్లో హింద్కో భాషలోనే మాట్లాడుకుంటామనీ వివరించారు.[8] బ్రిటిష్ భారత్ లోని పెషావర్ లో షారొఖ్ తండ్రి మీర్ తాజ్ మొహమద్ ఖాన్ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ కు అనుచరుడు, అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. భారత విభజన తరువాత వారి కుటుంబం  ఢిల్లీ కి వచ్చేశారు.[9] షారూఖ్ తల్లిదండ్రులు 1959లో వివాహం చేసుకున్నారు. ఒక ట్వీట్ లో షారూఖ్ తనను హాఫ్ హైదరాబాదీ (తల్లి), హాఫ్ పఠాన్ (తండ్రి), హాఫ్ కాశ్మీరీ (నానమ్మ) గా పేర్కొన్నారు.[10]

 సినిమాలు

పూర్తి వ్యాసం షారూఖ్ ఖాన్ సినిమాలు

అవార్డులు, గౌరవాలు

పద్మశ్రీపురస్కారం

ఇవి కూడ చూడండి

కరణ్ అర్జున్

ఫుట్ నోట్స్

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ