శివమణి

సంగీతకారుడు, డ్రమ్స్ వాయిద్య నిపుణుడు

శివమణి లేదా డ్రమ్స్ శివమణి (జ. 1959 డిసెంబరు 1) భారతదేశానికి చెందిన డ్రమ్స్ కళాకారుడు, సంగీత దర్శకుడు. ఎ. ఆర్. రహ్మాన్ కు చిరకాల మిత్రుడు, అతని బృందంలో సభ్యుడు కూడా. 2019 లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది.[1]

శివమణి
వ్యక్తిగత సమాచారం
జననం (1959-12-01) 1959 డిసెంబరు 1 (వయసు 64)
మద్రాసు, తమిళనాడు
వృత్తిడ్రమ్స్ కళాకారుడు, సంగీత దర్శకుడు
క్రియాశీల కాలం1971 – ప్రస్తుతం

శివమణి 2024 జనవరి 20న హైదరాబాద్‌లో యునైటెడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు.[2]

జీవితం

శివమణి డిసెంబరు 1, 1959 న మద్రాసులో జన్మించాడు. ఏడేళ్ళ వయసు నుంచే డ్రమ్స్ వాయించడం ప్రారంభించాడు.[3] 11 ఏళ్ళకే సంగీత వృత్తిలో ప్రవేశించాడు. తర్వాత ముంబై వెళ్ళాడు. నోయెల్ గ్రాంట్, బిల్లీ కోబామ్ నుంచి స్ఫూర్తి పొందాడు. ఎం. ఎస్. విశ్వనాథన్, ఇళయరాజా, ఎ. ఆర్. రహ్మాన్ లాంటి సంగీత దర్శకులతో కలిసి పనిచేశాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ను తన గాడ్ ఫాదర్ గా చెప్పుకుంటూ ఉంటాడు.[4]శివమణి తన తొలినాళ్ళలో కున్నక్కూడి వైద్యనాథన్, టి. వి. గోపాలకృష్ణన్, వల్లియపట్టి సుబ్రమణియన్, పళనివేల్, ఎల్. శంకర్ లాంటి కర్ణాటక సంగీత విద్వాంసులతో కలిసి పనిచేశాడు. తమిళ సినీ దర్శకుడు, నటుడు, సంగీత దర్శకుడు టి. రాజేందర్ తో కలిసి పాటలు కూర్చాడు.

ఎ. ఆర్. రహ్మాన్ తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా పర్యటనలు చేశాడు.[5] బాంబే డ్రీమ్స్ అనే ఆల్బం కోసం అతనితో కలిసి పనిచేశాడు. శంకర్ మహదేవన్, హరిహరన్, మాండొలిన్ శ్రీనివాస్, లాయ్ మెండోసాలతో కలిసి శ్రద్ధ అనే సంగీత బృందంలో ఉన్నాడు.[6]

పురస్కారాలు

2009 లో తమిళనాడు ప్రభుత్వం శివమణికి కళైమామణి పురస్కారం ప్రదానం చేసింది. 2019 లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది.

నటుడిగా

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ