వేణువు

వేణువు, మురళి లేదా పిల్లనగ్రోవి ఒకరకమైన సంగీత వాయిద్యము. ఇంగ్లీషులో దీన్ని ఫ్లూట్ అంటారు. ఇది కర్ణాటక, హిందూస్థానీ సంగీతాలలో ఉపయోగించే వాద్యపరికరం. బాగా ఆరబెట్టిన వెదురుతో తయారు చేస్తారు. ఊదేందుకు పీకలాంటివి ఉండని వాద్యపరికరం ఇది. ఈ వెదురు గొట్టాన్ని ఒకవైపు తేరిచి మరొక వైపు మూసి ఉంచుతారు. పై బాగాన గాలి ఊదేందుకు రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రంతో పాటు స్వరాల మార్పుకొరకు, వేళ్ళతో మూసి తెరిచేందుకు కొన్నిట్లో మూడు మరికొన్నిట్లో ఎనిమిది రంద్రాలు కలిగి ఉంటాయి.

పిల్లనగ్రోవి. మొరవపల్లిలో తీసిన చిత్రము

భారతీయ వేణువు

పిల్లన గ్రోవి.
ఆలయ[permanent dead link] రథంపై వేణువుతో ఉన్న కృష్ణుడి శిల్పం. సుచీంద్రం, తమిళనాడు.

భారతీయ శాస్త్రీయ సంగీతంలో వెదురు వేణువు ఒక ముఖ్యమైన పరికరం. ఇది పాశ్చాత్య వేణువు కంటే భిన్నంగా, స్వతంత్రంగా అభివృద్ధి చెందింది. శ్రీకృష్ణుడిని సాంప్రదాయకంగా వేణుగాన లోలుడని అంటారు. పాశ్చాత్య వేణువులతో పోలిస్తే భారతీయ వేణువులు చాలా సరళమైనవి. అవి వెదురుతో తయారవుతాయి. వాటిని ట్యూణు చేసేందుకు చెవులేమీ ఉండవు. [1]భారతీయ వేణువులలో రెండు ప్రధాన రకాలు ప్రస్తుతం ఉపయోగంలో ఉన్నాయి. మొదటిది, బాస్సురి. దీనిలో వేళ్ళ కోసం 6 రంధ్రాలు, ఒక ఊదే రంధ్రం ఉంటాయి. దీనిని ప్రధానంగా ఉత్తర భారతదేశంలోని హిందూస్థానీ సంగీతంలో ఉపయోగిస్తారు. రెండవది, వేణువు లేదా పిల్లనగ్రోవి. దీనికి ఎనిమిది వేళ్ళ రంధ్రాలుంటాయి. దక్షిణ భారతదేశంలోని కర్ణాటక సంగీతంలో ప్రధానంగా దీన్ని వాయిస్తారు. ప్రస్తుతం, క్రాస్-ఫింగరింగ్ టెక్నిక్‌తో ఎనిమిది రంధ్రాల వేణువు కర్ణాటక ఫ్లూటిస్టులలో చాలా సాధారణం. దీనికి ముందు, దక్షిణ భారత వేణువుకు ఏడు రంధ్రాలు మాత్రమే ఉండేవి. 20 వ శతాబ్దం ప్రారంభంలో పల్లడం శైలికి చెందిన శరభశాస్త్రి అభివృద్ధి చేసిన వేళ్ళ రంధ్రాల ప్రమాణంతో ఇవి ఉంటాయి [2]వేణువు వెలువరించే శబ్ద నాణ్యత దానిని తయారు చేయడానికి ఉపయోగించే వెదురుపై కొంతవరకు ఆధారపడి ఉంటుంది. దక్షిణ భారతదేశంలోని నాగర్‌కోయిల్ ప్రాంతంలో ఉత్తమ వెదురు పెరుగుతుంది. [3] భారతీయ నాట్య శాస్త్ర శరణ చతుష్టాయ్ ఆధారంగా, అవినాష్ బాలకృష్ణ పట్వర్ధన్ 1998 లో భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రస్తుతం ఉన్న పది 'థాట్స్' కోసం కచ్చితంగా ట్యూన్ చేసిన వేణువులను ఉత్పత్తి చేసే పద్ధతిని అభివృద్ధి చేశాడు. [4]వేణువును తెలుగులో పిల్లనగ్రోవి అని కూడా అంటారు. గుజరాతీలో పావో అని అంటారు. [5] కొంతమంది ఒకేసారి రెండు వేణువులను (జోడియో పావో) వాయిస్తారు.

మూలాలు

వెలుపలి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ