వేంకటేశ్వరస్వామి దేవాలయం (ఇంగ్లాండు)

ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్‌లోని టివిడేల్‌లో ఉన్న హిందూ దేవాలయం.

వేంకటేశ్వరస్వామి దేవాలయం, ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్‌లోని టివిడేల్‌లో ఉన్న హిందూ దేవాలయం. బర్మింగ్‌హామ్ నగరానికి వాయువ్యంగా టిప్టన్, ఓల్డ్‌బరీ శివారు ప్రాంతాల మధ్య ఉన్న ఈ దేవాలయం ఐరోపాలోని అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఒకటి. వైష్ణవ సంప్రదాయంలో హిందూ దేవుడు విష్ణువు రూపానికి అంకితం చేయబడిన ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వేంకటేశ్వర దేవాలయం స్ఫూర్తితో ఏర్పాటుచేయబడింది. 2006, ఆగస్టులో ఇది తెరవబడింది.[1]

శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) దేవాలయం

నిర్మాణం

1980లో, ఒక మందిరంలో అలంకరించబడిన చెక్క మండపంలో వేంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్టించబడింది. నెలవారీ పూజలు నిర్వహించబడ్డాయి. 1984 అక్టోబరులో నిధుల సేకరణకు, దేవాలయ నిర్మాణానికి అనువైన భూమిని పరిశీలించడానికి పదిహేను మంది సభ్యుల నిర్వహణ కమిటీని ఎన్నుకోబడింది. 1984 నవంబరులో శ్రీ వెంకటేశ్వర బాలాజీ దేవాలయం పేరుతో ఒక కొత్త స్వచ్ఛంద సంస్థ స్థాపించబడింది. 1988లో డాక్టర్ నారాయణరావు నేతృత్వంలో మొదటి బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఎన్నికయ్యారు.

1995లో, బ్లాక్ కంట్రీలో నిరుపయోగంగా ఉన్న భూమిని కొనుగోలు చేశారు. 1998లో ప్రధాన దేవాలయానికి శంకుస్థాపన జరిగింది. 1999 నుండి వివిధ దేవతల ప్రతిష్ఠాపన జరిగింది. 2000లో ప్రధాన దేవాలయ హాలులో తాత్కాలిక మందిరం నిర్మించబడింది. 2000లో మురుగ (సుబ్రమణ్య స్వామి) విగ్రహం ప్రతిష్ఠించబడింది, ఆ తర్వాత 2003లో నవగ్రహాలయం నిర్మించబడింది. 2006లో దేవాలయం పూర్తిస్థాయిలో ప్రారంభమయింది. 2010లో శివుని కుంబాభిషేకం జరిగింది. 2011లో బాబా మందిరంలో బాబాను ప్రతిష్టించారు.[2]

ఇతర దేవతలు

ప్రధాన దేవాలయ సముదాయంలో వేంకటేశ్వరుడి భార్య పద్మావతి (అలమేలు) విగ్రహాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ హనుమంతుడు, శివుడు, కార్తికేయ, గణేష్, అయ్యప్ప, నవగ్రహాల విగ్రహాలు కూడా ఉన్నాయి.[3]

సేవలు

దేవాలయం ఆధ్వర్యంలో బాలాజీ స్కూల్ ఫర్ కల్చర్ & ఎడ్యుకేషన్‌ అనే సంస్థ నిర్వహించబడుతోంది. ఈ సంస్థ ద్వారా పిల్లలకు ఆధ్యాత్మిక, సాంస్కృతికలను పరిచయం చేస్తారు. వేదాలు (హిందూ గ్రంథాలు), సంగీతం మొదలైన వాటిపై శిక్షణ తరగతులు కూడా ఉంటాయి. దేవాలయంలో పెద్ద కమ్యూనిటీ హాల్ కూడా ఉంది.[4] గేట్‌హౌస్, గాంధీ శాంతి కేంద్రం ఉన్నాయి. అన్నదాన సేవలను నిర్వహిస్తుంది, విరాళాల ద్వారా సందర్శకులకు ఉచిత భోజనాన్ని అందిస్తుంది.

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ