వి6 న్యూస్


వి6 న్యూస్ ఛానల్ తెలంగాణలోని వార్తా ఛానల్.[1] ఇందులో 24 గంటలుపాటు వార్తలు ప్రసారం అవుతుంటాయి. భారతదేశం, ఇతర దేశాలలో 120 మిలియన్ తెలుగు ప్రజలను చేరుకోవడమే ఈఛానల్ లక్ష్యం.

వి6 న్యూస్
ఆవిర్భావముమార్చి 1, 2012
యాజమాన్యంవి.ఐ.ఎల్. మీడియా ప్రై.లి
దృశ్య నాణ్యత4:3, 576ఐ, ఎస్.డి. టివి)
1080ఐ (హెచ్.డి. టివి)
నినాదముప్రతి దృశ్యం
ప్రజల పక్షం
దేశంభారతదేశం
భాషతెలుగు
ప్రసార ప్రాంతాలుతెలంగాణ రాష్ట్రం, భారతదేశం
ప్రధాన కార్యాలయంహైదరాబాద్, తెలంగాణ
Availability
Satellite
విజన్ ఆసియా (ఆస్ట్రేలియా)
ఎయిర్ టెల్ డిజిటల్ టివి (భారతదేశం)ఛానల్ 912
విడియోకాన్ డి2హెచ్ (భారతదేశం)ఛానల్ 738
డిష్ టివి (భారతదేశం)ఛానల్ 1679
స్కై (యునైటెడ్ కింగ్ డమ్ & ఐర్లాండ్)ఛానల్ 591
డిష్ నెట్ వర్క్ (అమెరికా సంయుక్త రాష్ట్రాలు)ఛానల్ 611
డియాలాగ్ టివి
(శ్రీలంక)
ఛానల్ 4
Cable
విర్జిన్ మీడియా (యునైటెడ్ కింగ్ డమ్)ఛానల్ 621
స్టార్ హబ్ టివి (సింగపూర్)ఛానల్ 162

చరిత్ర

2012, మార్చి 1న వి.ఐ.ఎల్. ప్రై.లి అనే సంస్థ ద్వారా ఈ ఛానల్ ప్రారంభించబడింది. దీనికి పాత్రికేయుడు అంకం రవి సి.ఈ.ఓ.గా దీని కార్యకలాపాలలో పేరొందిన పాత్రికేయులు కూడా ఉన్నారు.[2]

కార్యక్రమాలు

ఇందులో తీన్మార్ వార్తలు, మాటకారి మంగ్లీ, సిన్మా టాకీస్, జనపదం, స్పాట్ లైట్, డెత్ సీక్రెట్స్ వంటి కార్యక్రమాలు ఉంటాయి.

తీన్మార్ వార్తలు: తీన్మార్ వార్తలు వ్యంగ వార్తల కార్యక్రమం, ఇది ప్రతిరోజు రాత్రి గం 9.30 లకు ప్రసారం అవుతుంది.[3] గతంలో తీన్మార్ వార్తలు కార్యక్రమంలోలో రచ్చ రాములమ్మ,తీన్మార్ మల్లన్న, తీన్మార్ లచ్చవ్వ,తీన్మార్ సావిత్రి, బిత్తిరి సత్తిలు వంటి వార్త పాత్రలు ఉండేవి. అతి తక్కువ సమయంలోనే తీన్మార్ వార్తల కార్యక్రమం చాలా ప్రాచుర్యం పొందింది. ఇది ప్రధానంగా రాజకీయ, పౌర సమస్యలపై దృష్టి సారిస్తుంది. దీనిలో సాధారణ తెలంగాణ యాసను ఉపయోగించి ఒక హాస్య ప్రధానంగా ఉండి, రాజకీయ, ఇతర ప్రముఖులపై కార్యక్రమాలను చేస్తుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సాహసోపేత, ఆసక్తికరమైన విషయాలు కూడా చూపిస్తుంది.

స్పాట్ లైట్: సమకాలీన పరిస్థితులపై దృష్టి సారిస్తూ ఎప్పటికప్పుడు లోతైన, క్లిష్టమైన విశ్లేషణలు అందించే కార్యక్రమం ఇది. జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయాల గురించిన చర్చలు ఉంటాయి.

స్టూడియో డిస్కషన్: ఇది ఉదయం సాయంత్రం ప్రసారమయ్యే రాజకీయ చర్చ. ఇందులో రాజకీయ పార్టీ నేతలు, విశ్లేషకుల మధ్య చర్చలు జరుగుతాయి.

తెలంగాణ హీరోలు: తెలంగాణ రాష్ట్రానికి చెందిన వెలుగులోకి రాని ప్రముఖుల జీవితం చరిత్రను, వారి త్యాగాల గురించి చెప్పే కార్యక్రమం.

హమారా హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఒక స్థానిక వార్తలు, సంఘటనల కార్యక్రమం.

పంపిణీ

వి6 న్యూస్ ఛానల్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో వివిధ పంపిణీ మాధ్యమాల ద్వారా ప్రసారం అవుతుంది. అనలాగ్, డిజిటల్ కేబుల్, మొబైల్, Yupp టీవీ వంటి అన్ని ప్రధాన డిజిటల్ మాధ్యమాలలో వి6 న్యూస్ ఛానల్ ను చూడవచ్చు.

మూలాలు

ఇతర లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ