83°12′32″E / 17.75528°N 83.20889°E / 17.75528; 83.20889

విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రమాదం

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
విశాఖపట్నం గ్యాస్‌ లీక్‌ ప్రమాదం
సమయం3:00
తేదీ2020-మే-07
ప్రదేశంఆర్.ఆర్ వెంకటపురం, విశాఖపట్నం , ఆంధ్రప్రదేశ్ , ఇండియా
భౌగోళికాంశాలు17°45′19″N 83°12′32″E / 17.75528°N 83.20889°E / 17.75528; 83.20889
కారణంఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ నుంచి గ్యాస్ లీక్
మరణాలు11[1]
గాయపడినవారు1,000+[1]
పటం

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం శివార్లలోని గోపాలపట్నం సమీపంలోని ఆర్.ఆర్.వెంకటపురం గ్రామంలో 2020 మే 7 ఉదయం ఎల్జీ పాలిమర్స్ రసాయన పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది.లీకైన స్టైరీన్‌ విషవాయువు సుమారు 3 కిలోమీటర్ల వ్యాపించి సమీప గ్రామాలను ప్రభావితం అయ్యాయి.

నేపథ్యం

వెంకటపురం గ్రామంలో రసాయన కంపెనీ హిందుస్తాన్ పాలిమర్స్ పేరుతో 1961లో ప్రారంభమైంది. 1978లో దీన్ని యూబీ గ్రూప్ తీసుకుంది. 1997లో దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కంపెనీ స్వాధీనం చేసుకుని ఎల్జీ పాలిమర్స్‌గా పేరు మార్చింది. పాలిస్టిరైన్, ఎక్స్‌పాండబుల్ పాలిస్టిరైన్ (థర్మాకోల్) వంటివి ఈ సంస్థలో తయారవుతాయి.[2][3]

గ్యాస్ లీకేజ్

ఈ ప్రమాదం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది.కరోనా వైరస్ ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ప్రకటించడంతో అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి.లాక్ డౌన్ నిబంధనలు సడలింపు తర్వాత 2020 మే 7 ఈ ఫ్యాక్టరీ కార్యకలాపాలు పునఃప్రారంభించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్న సమయంలో ఈ లీకేజీ జరిగింది.

గ్యాస్ లీకేజ్ ప్రభావం

ఈ పరిశ్రమ నుండి వెలువడిన విషవాయువు 3 కిలోమీటర్ల వ్యాపించాయి.[4] ముఖ్యంగా ఐదు గ్రామాలు - ఆర్.ఆర్. వెంకటపురం, పద్మపురం, బిసి కాలనీ, గోపాలపట్నం, కంచరపాలెం - ఎక్కువగా ప్రభావితం అయ్యాయి.[5]ఈ వాయువు ప్రభావాల వల్ల చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామంది రోడ్లపైకి వచ్చి పడిపోయారు.అలాగే గ్రామంలో పశువులు, ఇతర మూగజీవాల ప్రాణాలు కోల్పోయాయి.

సహాయక చర్యలు

పోలీసులు, అగ్నిమాపక, ఇతర శాఖలకు కూడా సమాచారం అందడంతో గ్రామానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు (ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌),కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం (సీఐఎస్‌ఎఫ్‌) సభ్యులు రంగంలోకి దిగారు. రహదారులపైనా, ఇళ్లలోనూ పడి ఉన్న ప్రజలను సుమారు 350 మందిని అంబులెన్సుల్లో కేజీహెచ్‌, సమీపంలోని ప్రభుత్వాసుపత్రులకు, పలు ప్రైవేటు వైద్యశాలలకు తరలించారు.

ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం లో గ్యాస్ లీక్ ఘటనలో మరణించిన వారికి కోటి రూపాయలు ప్రకటించింది.వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నవారికి 10 లక్షల రూపాయలు, ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు, రెండు మూడు రోజులు చికిత్స పొందినవారికి లక్ష రూపాయల చొప్పున సాయం చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.ఈ ప్రమాదం జరిగిన గ్రామంలో కొన్ని జంతువులు కూడా చనిపోయాయని, వాటికి కూడా పరిహారం చెల్లిస్తామ‌న్నారు.మృతుల కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.[6]

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

మార్గదర్శకపు మెనూ