వివేక్ (నటుడు)

భారతీయ నటుడు

వివేక్ తమిళ సినిమా నటుడు. దాదాపు 300 సినిమాల్లో నటించిన వివేక్, 2009లో భారత నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు.[3]

వివేక్
జననం
వివేకానందన్[1]

19 నవంబరు 1961
కోవిల్‌పట్టి, తూత్తుకుడి, తమిళనాడు, భారతదేశం
మరణం2021 ఏప్రిల్ 17(2021-04-17) (వయసు 59)[2]
విద్యాసంస్థఅమెరికన్ కాలేజీ, మదురై
వృత్తిసినీ న‌టుడు, సామాజిక కార్య‌కర్త
క్రియాశీల సంవత్సరాలు1987–2021
జీవిత భాగస్వామిఅరుళ్‌ సెల్వి వివేక్
పిల్లలు3
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం (2009)
గౌరవ డాక్టరేట్ (2015)

వ్యక్తిగత జీవితం

వివేక్ 1961, నవంబరు 19న తమిళనాడు రాష్ట్రం, తూత్తుకుడి జిల్లా, కోవిల్‌పట్టి గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లి పేరు మణియమ్మాళ్. వివేక్‌కు భార్య అరుళ్‌ సెల్వి, ఒక కుమారుడు ప్రసన్నకుమార్‌, ఇద్దరు కుమార్తెలు – అమృతనందిని, తేజస్వి. 2016లో ఆయన కుమారుడు ప్రసన్నకుమార్ (13 సంవత్సరాలు) మెదడు వాపు వ్యాధితో మరణించాడు.

సినీ ప్రస్థానం

వివేక్ చెన్నైలోని సెక్రటేరియట్‌లో పనిచేస్తూ, ‘మద్రాస్‌ హ్యూమర్‌ క్లబ్‌’లో ‘స్టాండప్‌ కమెడియన్‌’గా చేసేవాడు. ఆయనకు క్లబ్‌ వ్యవస్థాపకుడు గోవిందరాజన్‌ ద్వారా దర్శకుడు కె. బాలచందర్ తో పరిచయం ఏర్పడింది. అనంతరం వివేక్ బాలచందర్‌ దర్శకత్వం వహించిన సినిమాలకు స్క్రిప్ట్‌ రైటర్‌గా పని చేశాడు. బాలచందర్ ఒకరోజు ఒక సందర్భాన్ని వివరించి, పదహారు పాత్రలతో వివేక్ ను కథ రాయమన్నాడు, ఒకే ఒక్క రాత్రిలో బాలచందర్ చెప్పిన పని వివేక్‌ పూర్తి చేశాడు. 1987లో బాలచందర్ దర్శకత్వం వహించిన ‘మనదిల్‌ ఉరుది వేండుమ్‌’ (1987) చిత్రానికి స్క్రిప్ట్‌ అసిస్టెంట్‌గా చేస్తున్నప్పుడు వివేక్ కు ఆ సినిమాలో నటించే అవకాశం కల్పించాడు. అలా ‘మనదిల్‌ ఉరుది వేండుమ్‌’ ద్వారా వెండితెర పై వివేక్ తొలిసారి నటించాడు. వివేక్ 2003లో శంకర్ దర్శకత్వం వహించిన "బాయ్స్" చిత్రంలో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ఆ తర్వాత అపరిచితుడులో విక్రమ్ స్నేహితుడిగా, శివాజీ (సినిమా)లో రజనీకాంత్ మామయ్యగా తన పాత్రలతో అలరించాడు.

నటించిన తెలుగు సినిమాలు

సామజిక కార్యకర్తగా

  • వివేక్ 2011లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంను‌ స్ఫూర్తిగా తీసుకొని గ్లోబ‌ల్ వార్మింగ్‌కు వ్యతిరేఖంగా ప్రచారం చేయ‌డంతోపాటు మొక్కలు నాటడం ప్రారంభించాడు. కోటి మొక్క‌లు నాటాలని టార్గెట్ పెట్టుకున్న వివేక్ "గ్రీన్ క‌లాం" అనే మిషన్ ప్రారంభించాడు. అబ్దుల్‌ క‌లాం సూచనా మేరకు గ్రీన్ క‌లాం పేరును గ్రీన్ గ్లోబ్ గా మార్చాడు. ఈ మిషన్ ద్వారా 33.23 లక్షల మొక్కలు నాటడంలో, నాటించడంలో సక్సెస్‌ అయ్యాడు.[4][5] [6]
  • తమిళనాట డెంగూ, మెదడువాపు జ్వరాలు ప్రబలుతున్నప్పుడు జనంలో చైతన్యం కలిగించడానికి ప్రభుత్వ ప్రచారోద్యమంలో భాగస్వామి అయ్యాడు.
  • కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో ప్రజల్లో కోవిడ్‌ టీకాపై అవగాహన కల్పించాడు.

మరణం

వివేక్ గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ 2021, ఏప్రిల్ 17న మరణించాడు.[7][8]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ