విజిల్ (2019 సినిమా)

అట్లీ దర్శకత్వంలో 2019లో విడుదలైన తమిళ అనువాద చలనచిత్రం

విజిల్ 2019, అక్టోబరు 25న విడుదలైన తమిళ అనువాద చలనచిత్రం. ఫుట్‌బాల్ ఆట నేపథ్యంలో అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్, నయనతార, వివేక్, యోగిబాబు, జాకీష్రాఫ్, డేనియల్ బాలాజీ, అనంత్‌రాజ్ తదితరులు నటించగా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించాడు.[4] ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కల్పతి సుబ్రమణ్యన్ అఘోరం ఈ చిత్రాన్ని నిర్మించాడు.[5] అట్లీ, విజయ్ కాంబినేషన్ లో 2016లో పోలీసోడు (తేరి), 2017లో అదిరింది (మెర్సల్) సినిమాలు వచ్చాయి.[6] ఈ సినిమాలో విజయ్‌ ద్విపాత్రాభినయం చేశాడు. 2019, జూన్ 22న విజిల్ టైటిల్ ప్రకటించారు.[7]

విజిల్
విజిల్ సినిమా పోస్టర్
దర్శకత్వంఅట్లీ
రచనఅట్లీ
ఎస్. రమణ గిరివాసన్
శ్రీరామకృష్ణ (మాటలు-తెలుగు)
స్క్రీన్ ప్లేఅట్లీ
ఎస్. రమణ గిరివాసన్
కథఅట్లీ
నిర్మాతకల్పతి సుబ్రమణ్యన్ అఘోరం
కల్పతి సుబ్రమణ్యన్ గణేష్
కల్పతి సుబ్రమణ్యన్ సురేష్
మ‌హేశ్ కోనేరు (తెలుగు)
తారాగణంవిజయ్, నయనతార, వివేక్, యోగిబాబు, జాకీష్రాఫ్, డేనియల్ బాలాజీ, అనంత్‌రాజ్
ఛాయాగ్రహణంజి.కె. విష్ణు
కూర్పురూబెన్
సంగీతంఏ.ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థలు
ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ (తెలుగు)
పంపిణీదార్లుస్క్రీన్ సీన్ మీడియా ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీs
25 అక్టోబరు, 2019
సినిమా నిడివి
177 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషతమిళ
బడ్జెట్180 కోట్లు[2][3]

కథ

చెన్నైలోని ఓ మురికివాడలో గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న రాయప్పన్ (విజయ్) తన కొడుకు మైఖేల్ అలియాస్ విజిల్‌ను (విజయ్) జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా తయారుచేయాలి అనుకుంటాడు. ఫుట్‌బాల్ నేషనల్ ఛాంపియన్‌ఫిప్‌లో పాల్గొనడానికి విజిల్ ఢిల్లీ వెళ్తున్న సమయంలో రాయప్పన్ హత్య చేయబడుతాడు. దాంతో మైఖేల్ పుట్‌బాల్ ఆటను వదిలేసి తన తండ్రి బాధ్యతల్ని స్వీకరించి గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడు. కానీ స్నేహితుడి మరణంతో విజిల్ జీవితం మలుపు తిరుగి, మహిళా ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా వెళ్ళాల్సివస్తుంది. ఈ నేపథ్యంలో విజిల్ జీవితంలో ఎదురైన సంఘటనలు, మహిళల్ని స్ఫూర్తివంతంగా తీర్చిదిద్ది విజేతలుగా నిలిపే క్రమంలో విజిల్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడన్నది చిత్రకథ.

నటవర్గం

  • విజయ్ (రాయప్ప, మైకెల్ రాయప్ప/విజిల్)[8]
  • నయనతార (ఏంజిల్)[9]
  • వివేక్ (నెస్సి)
  • క‌దిర్‌ (కదిర్)
  • జాకీ ష్రాఫ్ (జె.కె. శర్మ)[10]
  • డేనియల్ బాలాజీ (డానియేల్)[11]
  • ఆనంద్ రాజ్ (రాయప్ప స్నేహితుడు)
  • దేవదర్శిని (ఎలిజబెత్)[12]
  • యోగి బాబు (డోనాల్డ్)
  • సౌందరరాజ (గుణ)[13]
  • జి. జ్ఞానసంబంధం (ఆశీర్వాదం, ఏంజిల్ తండ్రి)
  • ఐ.ఎం. విజయన్ (అలెక్స్)[14]
  • ఇంధూజ రవిచంద్రన్ (వేంబు)[15]
  • రెబా మోనికా జాన్ (అనితా)
  • వర్ష బొల్లమ్మ (గాయత్రి)[16]
  • అమృతా అయ్యర్ (తెండ్రల్)[17]
  • ఇంద్రజ శంకర్ (పాండియమ్మ)[18]
  • ఆదిరత్ సౌందరాజన్
  • గాయత్రి రెడ్డి[19]
  • మనోబాల (ఏంజిల్ ప్రొఫెసర్)[20]
  • మాథ్యూ వార్గెస్ (పోలీస్ ఇన్సిపెక్టర్)
  • జార్జ్ మేరియన్
  • శాంతి మణి
  • నిత్యారాజ్
  • ప్రజూణ సారా
  • కీర్తన
  • అట్లీ (సింగప్పెన్నేయ్ పాటలో ప్రత్యేక పాత్ర)
  • ఎ.ఆర్. రహమాన్ (సింగప్పెన్నేయ్ పాటలో ప్రత్యేక పాత్ర)
  • పూవైయార్ (వేరితనమ్ పాటలో ప్రత్యేక పాత్ర)

సాంకేతికవర్గం

  • కథ, దర్శకత్వం: అట్లీ
  • నిర్మాత: కల్పతి సుబ్రమణ్యన్ అఘోరం, కల్పతి సుబ్రమణ్యన్ గణేష్, కల్పతి సుబ్రమణ్యన్ సురేష్, మహేష్ ఎస్. కోనేరు (తెలుగు)
  • రచన, స్క్రీన్ ప్లే: అట్లీ, ఎస్. రమణ గిరివాసన్
  • మాటలు: శ్రీరామకృష్ణ (తెలుగు)
  • సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
  • ఛాయాగ్రహణం: జి.కె. విష్ణు
  • కూర్పు: రూబెన్
  • నిర్మాణ సంస్థ: ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ (తెలుగు)
  • పంపిణీదారు: స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్టైన్మెంట్

నిర్మాణం

2019, జనవరి 21న అధికారిక ఫోటోగ్రఫీ ప్రారంభమయింది.[5][21][22] విజయ్, నయనతార, వివేక్, ఆనంద్ రాజ్ లు ఎంపికయ్యారు.[23][24] జి.కె. విష్ణును ఛాయాగ్రాహకుడిగా, రూబెన్ ను ఎడిటర్ గా తీసుకున్నారు. వీరు మెర్సెల్ సినిమాకి కూడా పనిచేశారు. 2019, ఆగస్టులో సినిమా నిర్మాణం పూర్తి అయింది.[25][26]

విడుదల

స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ ద్వారా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పంపిణి చేయబడింది.[27] ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ పతాకంపై మహేష్ ఎస్. కోనేరు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశాడు.[28] 2019, అక్టోబరు 6న ఫస్ట్ లుక్ పోస్టర్, అక్టోబరు 17న ట్రైలర్ విడుదల అయింది.[29]

విడుదలకు ముందు బిజినెస్

ఈ చిత్ర నిర్మాణానికి 180 కోట్లు ఖర్చు చేశారు.[30] సినిమా ప్రదర్శన, విదేశాల్లో ప్రదర్శన, డిజిటల్, శాటిలైట్, ఆడియో హక్కులు అన్నీ కలిపి విడుదలకు ముందే 220 కోట్ల బిజినెస్ చేసింది.[31][32] టీవి హక్కులు సన్ టీవి దక్కించుకుంది.[33]

స్పందన

విజయ్ తండ్రి (రాజప్ప) కొడుకు (విజిల్) పాత్రల్లో తనదైన నటనను కనబరచడమేకాకుండా రాజప్ప పాత్రలో మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కథానాయికగా నయనతార అభినయంతో మెప్పించింది. రహమాన్ నేపథ్య సంగీతం, జి.కె. విష్ణు ఛాయాగ్రహణం బాగున్నాయి.

రేటింగ్

  1. టైమ్స్ ఆఫ్ ఇండియా - 3/5[34]
  2. సిఫి - 3.5/5[35]
  3. ఫస్ట్ పోస్ట్ - 3.25/5[36]
  4. ఇండియాగ్లిడ్జ్ - 2.75/5[37]

ఇతర వివరాలు

ఈ సినిమా కథపై వివాదాలు ఉన్నాయి. తన సినిమా ‘స్లమ్‌ సాకర్’ కాన్సెప్ట్‌తో అట్లీ ‘విజిల్‌’ తీశాడని నంది చిన్ని కుమార్‌ తెలంగాణ సినిమా రచయితల సంఘాన్ని కోరగా, తన కథను కాపీ కొట్టారంటూ దర్శకుడు కేపీ సెల్వ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశాడు.[38]

పాటలు

ఈ చిత్రానికి ఎ.ఆర్. రహమాన్ సంగీతం అందించాడు.

  1. సివంగివే - ఎ.ఆర్. రహమాన్, శరత్ సంతోష్, శాష తిరుపతి
  2. వెర్రెక్కింద్దాం - రేవంత్, ఎ.ఆర్. రహమాన్
  3. నీతోనే - మధుర దర తల్లూరి, ఎ.ఆర్. రహమాన్, అనురాగ్ కులకర్ణి
  4. మానిని - మధుర దర తల్లూరి, ఎ.ఆర్. రహమాన్, చిన్మయి, శిరీష
  5. విజిలు విజిలు విజిలమ్మ - ఎ.ఆర్. రహమాన్

మూలాలు

ఇతర లంకెలు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో విజిల్

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ