విజయ్ సూర్య

విజయ్ సూర్య (జననం 1990 సెప్టెంబర్ 7) భారతీయ నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. ఆయన కలర్స్ కన్నడలో ప్రసారమైన అగ్నిసాక్షి టెలివిజన్ ధారావాహికతో ఖ్యాతిని పొందాడు.[1]

విజయ్ సూర్య
ఇష్టకామ్య సినిమా' ప్రమోషన్ సమయంలో విజయ్ సూర్య
జననం
విజయ్ సూర్య

(1990-09-07) 1990 సెప్టెంబరు 7 (వయసు 33)
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు, మోడల్, యాంకర్
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం
జీవిత భాగస్వామిచైత్ర (m.2019)
పిల్లలు1

ప్రారంభ జీవితం

ఆయన తన పాఠశాల విద్యను బెంగుళూరులోని క్లారెన్స్ పబ్లిక్ స్కూల్‌లో, ఇంటర్ విద్యను క్రైస్ట్ యూనివర్శిటీలో చదివాడు. ఆయన ముంబైలోని విస్లింగ్ వుడ్స్ అకాడమీలో తన నటనా డిగ్రీని అభ్యసించాడు. ఆయనకు ఒక అన్నయ్య ఉన్నాడు. విజయ్ సూర్య 2019 ఫిబ్రవరి 14న కుటుంబ స్నేహితురాలు, ఐటి ప్రొఫెషనల్ చైత్రని వివాహం చేసుకున్నాడు

2012లో, క్రేజీ లోక చిత్రంతో హర్షిక పూనాచాతో కలిసి ఆయన రంగప్రవేశం చేశాడు.[2] ఈ చిత్రానికి కవితా లంకేష్ దర్శకత్వం వహించాడు. 2014లో, కలర్స్ కన్నడలో ప్రసారమయిన డైలీ సీరియల్ అగ్నిసాక్షిలో తన నటనతో కీర్తిని పొందాడు. ఆయన మే 2016లో డాక్టర్ నాగతిహళ్లి చంద్రశేకర్ దర్శకత్వంలో విడుదలైన ఇష్టకామ్యలో నటించి మెప్పించాడు. కార్తీక్ జయరామ్, సంయుక్త హోర్నాడ్‌లతో ఆయన నటించిన "స" చిత్రం ఆగష్టు 2016లో విడుదలైంది. 2019లో, "కద్దు ముచ్చి" పేరుతో ఆయన సినిమా విడుదలైంది. సృజన్ లోకేష్, రచితా రామ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన కామెడీ షో "కామెడీ టాకీస్"కి కూడా ఆయన హోస్ట్‌గా వ్యవహరించాడు. అలాగే జూలై 2019, అక్టోబర్ 2020 ల మధ్య ఆయన "ప్రేమలోక" కి వ్యవహరించాడు. ఆయన ప్రస్తుతం వీరపుత్రలో నటిస్తున్నాడు.

ఫిల్మోగ్రఫీ

సినిమాలు

సంవత్సరంసినిమాపాత్రనోట్స్
2012క్రేజీ లోకఅభయ్ఉత్తమ అరంగేట్ర పురుషుడిగా సైమా అవార్డు - నామినేట్ చేయబడింది
2016ఇష్టకామ్యడా. ఆకర్ష్
2016
2019కద్దు ముచ్చిసిద్ధార్థ్
2022గాలిపాట 2రేవంతఅతిధి పాత్ర
TBAపోస్ట్ ప్రొడక్షన్
TBAవీరపుత్రచిత్రీకరణలో ఉంది

టెలివిజన్

సంవత్సరంకార్యక్రమంపాత్రనోట్స్
2004ఉత్తరాయణ
2013లక్ష్మీ బారమ్మసిద్ధార్థ్
2013 – 2019అగ్నిసాక్షిసిద్ధార్థ్
2014థక ధీమి తా డ్యాన్సింగ్ స్టార్పోటీదారు4వ వారంలో ఎలిమినేట్ అయ్యాడు
2018కామెడీ టాకీస్హోస్ట్
2019-2020ప్రేమలోకసూర్య
2020- 2021జోతే జోతేయాలిసూర్యఅతిధి పాత్ర
2023- ప్రస్తుతంనమ్మ లచ్చిసంగం
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీతెలుగు అరంగేట్రం

అవార్డులు

ఆయనకు అనుబంధ లో నటనకుగాను..

  • వైష్ణవితో పాటు ఉత్తమ జంటగా అవార్డు
  • 2014-15లో ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడిగా అవార్డు
  • 2016-17లో ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడిగా అవార్డు
  • 2017-18లో ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడిగా అవార్డు
  • 2018-19లో ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడిగా అవార్డు

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ