వికీపీడియా:నిర్వాహకులు

(వికీపీడియా:Administrators నుండి దారిమార్పు చెందింది)
వికీపీడియాలో నిర్వాహకులచిహ్నం
వికీపీడియాలో అధికారులచిహ్నం

సిస్ఆప్("sysop") అధికారములున్న వికిపీడియా సభ్యులను నిర్వాహకులు అంటారు. ప్రస్తుతం వికిపీడియాలో పాటించు విధానం ప్రకారం చాలా కాలం నుంచి వ్యాసాలు రాయుచున్న సభ్యులు నిర్వాహకులు అవ్వవచ్చు. ఈ సభ్యులు సాధారణముగా వికిపీడియా సమాజములో విశ్వసనీయులై ఉంటారు.

నిర్వాహకులకు ప్రత్యేకమైన అధికారాలు ఏవీ లేవు, వ్యాఖ్యాన బాధ్యతలలో వారు మిగతా సభ్యులతో సమానులు. నిర్వాహకుల‌కు మిగతా సభ్యులపై ఎటువంటి అధికారాలు ఉండవు, వారు కేవలం అందరు సభ్యుల నిర్ణయాలను అమలు చేస్తారు. నిర్వాహకులు తమకు మిగతా సభ్యుల కన్నా ఎక్కువ ఉన్న అనుమతులను ఉపయోగించి కొన్ని ముఖ్యమైన వికీపీడియా కుటుంబసంబంధమైన బాధ్యతలను నెరవేరుస్తారు. ఉదాహరణకు - కొన్ని వ్యాసాలను ఉంచాలా, తొలిగించాలా అనే సమాజ నిర్ణయాలను అమలు పరచుట, సిస్‌ఆప్స్‌ అనుమతులు అవసరమైన సభ్యుల అభ్యర్ధనలను నెరవేర్చుట, కొత్త, మార్చబడిన వ్యాసాలలో దుశ్చర్యలను పరిశీలించి , ఆ దుశ్చరలను నిరోధించుట మొదలైనవి. సహాయం అవసరమైన సభ్యులకు నిర్వాహకులు సలహా, సమాచారాలు ఇస్తారు.

వివరాలు

వికి సాఫ్ట్‌‌వేర్‌లో కొన్ని ముఖ్యమైన అంశాల ప్రవేశముపై ఆంక్షలు వున్నాయి. అట్టి అంశాలలో నిర్వాహకులకు అనుమతి ఉంటుంది.

మార్పు చేయుటకు అనుమతి లేని పేజీలు

  • మొదటి పేజీని, మార్చుటకు అనుమతించని ఇతర పేజీలను నిర్వాహకులు మార్చగలరు.
  • నిర్వాహకులు పేజీల అనుమతులను మార్చగలరు.

తొలగించుట, పునస్థాపన

  • నిర్వాహకులకు పేజీలను తొలగించుటకు అనుమతి ఉంది. వారు పేజీల చరిత్రను కూడా తొలగించగలరు.
  • తొలగించబడిన పేజీలను, వాటి చరిత్రను వారు చూడగలరు. అంతే కాక వారు ఆ పేజీలను పునస్థాపించ గలరు.
  • బొమ్మలను శాశ్వతముగా తొలగించగలరు.

ఇంకా

నిర్వాహకులు ఒక పేజీ పాత కూర్పును తిరిగి స్థాపించగలరు. మిగతా సభ్యులు కూడా ఈ పని చేయవచ్చు, నిర్వాహకులు దీనిని త్వరగా చేయగలరు.

నిర్వాహక హోదా కావాలంటే..

మీరు నిర్వాహకుడు కాదలుచుకుంటే మీ పేరును నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి పేజీ లో అక్కడి నిబంధనలకు అనుగుణంగా చేర్చాలి. మీరు నిర్వాహకుడు కావచ్చో కాకూడదో తోటి సభ్యులు వోటింగు ద్వారా తెలియజేస్తారు.

విజ్ఞప్తి చేసే ముందు మీరు వికీపీడియా లో కొన్నాళ్ళ పాటు కృషి చేసి ఉండాలి. వోటు వేసే ముందు ఇతర సభ్యులు మిమ్మల్ని గుర్తించ గలగాలి కదా మరి. తెలుగు వికీపీడియా కు ఇతర వికీపీడియాలకు ఈ విధానాల విషయంలో తేడాలు ఉండవచ్చు.

దయచేసి జాగ్రత్తగా ఉండండి! , నిర్వాహక హోదా వచ్చాక ఆ బాధ్యతలను నిర్వర్తించేటపుడు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. ముఖ్యంగా పేజీలూ, వాటి చరితం తొలగించేటపుడు, బొమ్మలను తొలగించేటపుడు (పైగా ఇది శాశ్వతం కూడా), IP అడ్రసులను అడ్డగించేటపుడు. ఈ కొత్త అధికారాల గురించి Administrators' how-to guide లో తెలుసుకోవచ్చు. అలాగే ఈ అధికారాలను వాడే ముందు నిర్వాహకులు చదవవలసిన జాబితా లో లింకులు ఉన్న ఉన్న పేజీ లను కూడా చదవండి.

నిర్వాహకుల గణాంకాలు

తేదినిర్వాహకుల సంఖ్య
2024-05-0110
2023-06-0311
2020-10-0912
2020-07-2913
2019-01-2414
2017-09-0617
2016-11-0816
2015-08-0517
2013-10-1915
2008-03-0114
2008-11-1412
2007-05-049

ఇవీ చూడండి

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ