రోజర్ బ్లంట్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

రోజర్ చార్లెస్ బ్లంట్ (1900, నవంబరు 3 - 1966, జూన్ 22) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. న్యూజీలాండ్ జాతీయ క్రికెట్ జట్టు కోసం తొమ్మిది టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.

రోజర్ బ్లంట్
రోజర్ చార్లెస్ బ్లంట్ (1931)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రోజర్ చార్లెస్ బ్లంట్
పుట్టిన తేదీ(1900-11-03)1900 నవంబరు 3
డర్హామ్, ఇంగ్లాండ్
మరణించిన తేదీ1966 జూన్ 22(1966-06-22) (వయసు 65)
వెస్ట్‌మిన్‌స్టర్, ఇంగ్లాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్‌బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 2)1930 10 January - England తో
చివరి టెస్టు1932 4 March - South Africa తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1917/18–1924/25Canterbury
1926/27–1931/32Otago
కెరీర్ గణాంకాలు
పోటీTestFirst-class
మ్యాచ్‌లు9123
చేసిన పరుగులు3307,953
బ్యాటింగు సగటు27.5040.99
100లు/50లు0/115/40
అత్యధిక స్కోరు96338*
వేసిన బంతులు93613,252
వికెట్లు12213
బౌలింగు సగటు39.3331.16
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు05
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు01
అత్యుత్తమ బౌలింగు3/178/99
క్యాచ్‌లు/స్టంపింగులు5/–88/–
మూలం: Cricinfo, 2017 11 April

వ్యక్తిగత జీవితం

బ్లంట్ 1900, నవంబరు 3న ఇంగ్లాండ్‌లో జన్మించాడు. ఇతని ఆరు నెలల వయస్సులో అతని కుటుంబం న్యూజీలాండ్‌కు వెళ్ళింది.[1] ఇతని తండ్రి, ఆక్స్‌ఫర్డ్‌లోని క్రైస్ట్ చర్చ్‌లో గ్రాడ్యుయేట్, క్రైస్ట్‌చర్చ్‌లోని కాంటర్‌బరీ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేశాడు.[2] బ్లంట్ క్రైస్ట్‌చర్చ్‌లోని క్రైస్ట్స్ కళాశాలలో చదువుకున్నాడు, అక్కడ ఫస్ట్ XI క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.[3]

క్రికెట్ రంగం

ఒక బ్యాట్స్‌మన్ గా, లెగ్ స్పిన్నర్ గా రాణించాడు. బ్లంట్ తన 17 ఏళ్ళ వయసులో 1917 క్రిస్మస్ రోజున క్రిస్ట్‌చర్చ్‌లో ఒటాగోపై కాంటర్‌బరీకి వ్యతిరేకంగా ఫస్ట్-క్లాస్ కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ మ్యాచ్ లో ఆరు వికెట్లు తీశాడు. 1920లలో దేశవాళీ క్రికెట్‌లో విజయవంతమైన బ్యాట్స్‌మన్ గా నిలిచాడు. 1922-23 సీజన్‌లో 53.00 సగటుతో 583 ఫస్ట్-క్లాస్ పరుగులను సాధించి, ప్లంకెట్ షీల్డ్‌ను గెలవడానికి కాంటర్‌బరీకి సహాయం చేశాడు.[4] 1926లో క్రైస్ట్‌చర్చ్ నుండి డునెడిన్‌కు మారాడు.

న్యూజీలాండ్ టెస్ట్ క్రికెట్ ఆడటానికి ముందు రోజులలో ఆస్ట్రేలియా, ఇంగ్లీష్ జట్లతో న్యూజీలాండ్ తరపున అనేక ప్రాతినిధ్య మ్యాచ్‌లు ఆడాడు. 1927లో న్యూజీలాండ్ జట్టు ఇంగ్లాండ్‌కు తన మొదటి ప్రధాన విదేశీ పర్యటనను చేసినప్పుడు ఇతను 44.00 సగటుతో 1540 పరుగులు చేశాడు, 25.29 సగటుతో 77 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనలకు గుర్తింపుగా ఇతను 1928లో విస్డెన్ క్రికెటర్లలో ఒకరిగా ఎంపికయ్యాడు.

తర్వాత కెరీర్

న్యూజీలాండ్ మొదటి టెస్టులో, 1930 జనవరిలో క్రైస్ట్‌చర్చ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, బ్లంట్ ఇతర న్యూజీలాండ్ ఆటగాడు (45 నాటౌట్ 7; 3 వికెట్లు 17, 2) కంటే ఎక్కువ పరుగులు, ఎక్కువ వికెట్లు తీయగా, న్యూజీలాండ్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.[5] న్యూజీలాండ్ మొదటి తొమ్మిది టెస్ట్‌లలో (1929-30లో ఇంగ్లాండ్‌పై నాలుగు, 1931లో ఇంగ్లండ్‌పై మూడు, 1931-32లో దక్షిణాఫ్రికాపై రెండు) ఆడాడు. 1931లో లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌పై 96 పరుగుల తన అత్యధిక టెస్ట్ స్కోరు చేశాడు.[6]

1931–32లో క్రైస్ట్‌చర్చ్‌లో కాంటర్‌బరీకి వ్యతిరేకంగా ఒటాగో తరపున బ్యాటింగ్ చేస్తూ, బ్లంట్ నిమిషానికి ఒక పరుగుతో 338 పరుగులు చేశాడు.[7] 1949-50లో బెర్ట్ సట్‌క్లిఫ్ 355 పరుగులతో ఓడించే వరకు న్యూజీలాండ్ ఆటగాడు చేసిన అత్యధిక ఫస్ట్-క్లాస్ స్కోరు ఇది. 1953లో సట్‌క్లిఫ్ దానిని అధిగమించే వరకు 7769 పరుగులతో అత్యధిక స్కోరు చేసిన న్యూజీలాండ్ బ్యాట్స్‌మన్‌గా బ్లంట్ రికార్డును కూడా కలిగి ఉన్నాడు.[8] 1930–31లో డునెడిన్‌లో ఆక్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒటాగో తరఫున 99 పరుగులకు 8 వికెట్లు తీయడం బ్లంట్ అత్యుత్తమ ఫస్ట్-క్లాస్ బౌలింగ్ గణాంకాలు.[9]

1931-32 సీజన్ తర్వాత బ్లంట్ న్యూజీలాండ్‌లో తదుపరి క్రికెట్ ఆడలేదు. కానీ 1934, 1935లో ఇంగ్లాండ్‌లో జరిగిన మూడు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో కనిపించాడు. 1933 నుండి 1938 వరకు ఇంగ్లాండ్‌లో సర్ జూలియన్ కాన్స్ XI కోసం చాలా చిన్న మ్యాచ్‌లు ఆడాడు. 1933లో కాహ్న్స్ XIతో ఉత్తర అమెరికాలో పర్యటించాడు.[10]

క్రికెట్ తర్వాత

ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత, బ్లంట్ ఇంగ్లాండ్‌లో నివసించాడు. అక్కడ విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగాడు. 1952లో ప్రారంభ మ్యాచ్‌లో లండన్ న్యూజీలాండ్ క్రికెట్ క్లబ్‌కు నాయకత్వం వహించాడు. క్లబ్‌లో ప్రముఖ సభ్యుడిగా కొనసాగాడు. ఇతని జ్ఞాపకార్థం రోజర్ బ్లంట్ అవార్డును క్లబ్‌కు చేసిన సేవలకు ప్రతి సంవత్సరం ఇవ్వబడుతుంది.[11]

బ్లంట్ క్రికెట్ ప్రసారాలపై రేడియో వ్యాఖ్యాతగా కూడా మారాడు. 1949 న్యూజీలాండ్ ఇంగ్లాండ్ పర్యటన కోసం బిబిసి జట్టులో చేరాడు. 1953లో, క్వీన్ ఎలిజబెత్ II పట్టాభిషేక పతకం లభించింది.[12] 1965 క్వీన్స్ బర్త్‌డే ఆనర్స్‌లో ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్‌లో సభ్యునిగా నియమించబడ్డాడు.[8]

మూలాలు

బాహ్య లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ