రైతు స‌మ‌న్వయ స‌మితి

తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సహకార సంస్థ.

రైతు స‌మ‌న్వయ స‌మితి, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలు, అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ సహకార సంస్థ.[2] ఈ కమిటీల ద్వారా గ్రామస్థాయిలో రైతు పెట్టుబడి సహాయ పథకం, రైతుబంధు పథకంలను పంపిణీ చేస్తుంటారు. తెలంగాణ శాసన మండలి సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతు సమన్వయ సమితి ఛైర్మన్ గా ఉన్నాడు.[3][4]

రైతు స‌మ‌న్వయ స‌మితి
స్థాపనమార్చి 2018[1]
వ్యవస్థాపకులుకె. చంద్రశేఖర్ రావు, తెలంగాణ ముఖ్యమంత్రి
రకంవ్యవసాయ సహకార సంస్థ
కేంద్రీకరణవ్యవసాయం
కార్యస్థానం
  • సంగారెడ్డి
మూలాలుSoyaben
సేవా ప్రాంతాలుతెలంగాణ
ముఖ్యమైన వ్యక్తులుచైర్మన్: పల్లా రాజేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్సీ)
ఉద్యోగులురైతు

చరిత్ర

రైతులకు పథకాలు సక్రమంగా అందించడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ కమిటీని ప్రకటించగా,[5] 2018 ఫిబ్రవరి 26న అమలులోకి వచ్చింది.

సంస్థ

రాష్ట్రంలోని 1,61,000 మంది రైతులు సభ్యులుగా ఈ సమితి ఏర్పడింది. వివిధ స్థాయిలలోని రైతు కమిటీలు:

  • గ్రామస్థాయి - 15 మంది సభ్యులు
  • మండలస్థాయి - 24 మంది సభ్యులు
  • జిల్లాస్థాయి - 24 మంది సభ్యులు
  • రాష్ట్రస్థాయి - 42 మంది సభ్యులు

రాష్ట్ర స్థాయి కమిటీలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ నిపుణులు, రైతులు ఉంటారు. ప్రభుత్వం ప్రతి 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించింది.

కార్పోరేషన్

లాభాపేక్షలేని సంస్థగా ప్రారంభించబడిన కార్పోరేషన్‌లోని సభ్యులు వ్యవసాయ కార్యకలాపాలైన విత్తనాలను విత్తడం, ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు అమ్మడం వంటి విషయాల్లో చురుకైన పాత్ర పోషించాల్సివుంటుంది. రైతులు సమావేశాలు నిర్వహించుకోవడానికి, చర్చించుకోవడానికి, ఇతర రైతులతో అభిప్రాయాలు పంచుకోవడానికి ప్రతి 5,000 ఎకరాలకు ఒకటి చొప్పున 2,630 రైతు సంఘ భవనాలు నిర్మించబడతాయి. 137 రైతు వేదికల నుండి మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా పనిచేస్తాయి.

చైర్మన్లు

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ