రిచర్డ్ ఫేన్‌మాన్

మూడేళ్ల వరకూ మాటలే రాలేదు... ఆపై అడిగినవన్నీ ప్రశ్నలే... ఆ ఉత్సుకత వల్లనే చదువులో చురుగ్గా ఎదిగాడు... పెద్దయ్యాక ఐన్‌స్టీన్‌ తర్వాత అంతటి మేధావిగా పేరొందాడు... అతడే రిచర్డ్‌ ఫేన్‌మాన్‌! పుట్టిన రోజు 1918 మే 11.

రిచర్డ్ ఫేన్‌మాన్
జననంRichard Phillips Feynman
(1918-05-11)1918 మే 11
Manhattan, New York
మరణం1988 ఫిబ్రవరి 15(1988-02-15) (వయసు 69)
Los Angeles, California
నివాసంUnited States
జాతీయతAmerican
రంగములుTheoretical physics
వృత్తిసంస్థలుManhattan Project
Cornell University
California Institute of Technology
చదువుకున్న సంస్థలుMassachusetts Institute of Technology (B.S.),
Princeton University (Ph.D.)
పరిశోధనా సలహాదారుడు(లు)John Archibald Wheeler
ఇతర విద్యా సలహాదారులుManuel Sandoval Vallarta
డాక్టొరల్ విద్యార్థులుF. L. Vernon, Jr.[1]
Willard H. Wells[1]
Al Hibbs[1]
George Zweig[1]
Giovanni Rossi Lomanitz[1]
Thomas Curtright[1]
ఇతర ప్రసిద్ధ విద్యార్థులుDouglas D. Osheroff
Robert Barro
W. Daniel Hillis
ప్రసిద్ధి
 
  • Acoustic wave equation
    Bethe–Feynman formula
    Feynman checkerboard
    Feynman diagrams
    Feynman gauge
    Feynman–Kac formula
    Feynman Long Division Puzzles
    Feynman parametrization
    Feynman point
    Feynman propagator
    Feynman slash notation
    Feynman sprinkler
    Hellmann–Feynman theorem
    Feynman-Smoluchowski ratchet
    Feynman–Stueckelberg interpretation
    Nanotechnology
    One-electron universe
    Parton
    Path integral formulation
    Quantum cellular automata
    Quantum computing
    Quantum electrodynamics
    Quantum hydrodynamics
    Quantum turbulence
    Shaft passer
    Sticky bead argument
    Synthetic molecular motor
    The Feynman Lectures on Physics
    Universal quantum simulator
    Vortex ring model
    Wheeler–Feynman absorber theory
ప్రభావితం చేసినవారుPaul Dirac
ప్రభావితులుFreeman Dyson
ముఖ్యమైన పురస్కారాలుAlbert Einstein Award (1954)
E. O. Lawrence Award (1962)
Nobel Prize in Physics (1965)
Oersted Medal (1972)
National Medal of Science (1979)
సంతకం
గమనికలు
He was the father of Carl Feynman and adoptive father of Michelle Feynman. He was the brother of Joan Feynman.

అమెరికా అంతరిక్ష నౌక ఛాలెంజర్‌ పైకి ఎగిరిన కొద్ది సేపటికే పేలిపోయిన సంగతి తెలుసుగా? 1986లో జరిగిన ఈ ప్రమాదానికి కారణం కనిపెట్టడం ఎంత కష్టమో ఆలోచించండి. ఆ పరిశోధన బృందంలో ముఖ్యుడైన రిచర్డ్‌ ఫేన్‌మాన్‌ సహేతుకమైన కారణాన్ని ప్రయోగాత్మకంగా వివరించి ప్రశంసలు పొందాడు. వ్యోమనౌకను రోదసిలోకి పంపించే బూస్టర్‌ రాకెట్‌కి ఉన్న రబ్బరు ఓ-రింగ్‌ సీళ్లే ప్రమాదానికి కారణమని గుర్తించాడు. ఛాలెంజర్‌ను ప్రయోగించే రోజు ఉదయం ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల సెంటిగ్రేడు కన్నా తక్కువ కావడం వల్ల సీళ్లు సంకోంచించి స్థితి స్థాపకతను కోల్పోయాయని, అందువల్ల ఇంధన వాయువు లీకయి మండడంతో ట్యాంక్‌ అత్యధిక ఉష్ణోగ్రతకు చేరుకుని బద్దలైందని చెప్పాడు. రబ్బరు సీళ్లను మంచు నీరున్న గ్లాసులో వేసి అవెలా బలహీనమవుతాయో చూపించాడు కూడా.

అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో 1918 మే 11న పుట్టిన రిచర్డ్‌ ఫిలిప్స్‌ ఫేన్‌మాన్‌కు మూడేళ్ల వరకూ మాటలే రాకపోయినా, ఆపై చురుగ్గా ఎదిగాడు. బాల్యంలో ఎక్కడ పజిల్స్‌ కనిపించినా పూరించేవాడు. రేడియోల్లాంటి పరికరాలను బాగు చేస్తూ ఉండేవాడు. గణితం, సైన్స్‌ సబ్జెక్టుల్లో తను చదివే తరగతులకన్నా ఎంతో ముందుండేవాడు. మెసెచ్యుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (MIT)లో డిగ్రీ పూర్తి చేశాక, పీహెచ్‌డీ చేశాడు. ఇరవై ఏళ్లకల్లా ప్రముఖ అమెరికన్‌ సైద్ధాంతిక శాస్త్రవేత్తల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు.

ద్రవ్యం (matter)పై కాంతి (light) ప్రభావాన్ని వివరించే 'క్వాంటమ్‌ ఎలక్ట్రో డైనమిక్స్‌' అంశంలో పరిశోధనకు ఫేన్‌మాన్‌ తన 47వ ఏట నోబెల్‌ బహుమతిని అందుకున్నాడు. ఈ శాస్త్రంలో ఇతడు గణితం ఆధారంగా చేసిన వివరణలు 'ఫేన్‌మాన్‌ డయాగ్రమ్స్‌'గా పేరొందాయి. ఇంకా క్వాంటమ్‌ మెకానిక్స్‌, పార్టికిల్‌ ఫిజిక్స్‌, నానోటెక్నాలజీ రంగాలలో కూడా తనదైన ముద్ర వేసిన ఈయన చక్కని అధ్యాపకుడు కూడా. ఆయన వెలువరించిన 'ద ఫేన్‌మాన్‌ లెక్చర్స్‌ ఇన్‌ ఫిజిక్స్‌' సైన్స్‌ విద్యార్థులకు ప్రామాణికం. ఆయన రచించిన 'స్యూర్‌లీ యు ఆర్‌ జోకింగ్‌ ఫేన్‌మాన్‌', 'వాట్‌ డు యు కేర్‌ వాట్‌ అదర్‌ పీపుల్‌ థింక్‌?' గ్రంథాలు ఆయనెంత మేధావో చెబుతాయి. గాయకుడు, చిత్రకారుడు కూడా అయిన ఈయన అణుబాంబు నిర్మాణ బృందంలోనూ సభ్యుడు.

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ