రాజస్తాన్ రాయల్స్

రాజస్థాన్ రాయల్స్
(రాజస్థాన్ రాయల్స్ నుండి దారిమార్పు చెందింది)

రాజస్థాన్ రాయల్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లో ఆడే రాజస్థాన్ లోని జైపూర్లో ఉన్న ఒక ఫ్రాంచైజ్ క్రికెట్ జట్టు.[1] తొలి ఎనిమిది ఐపిఎల్ ఫ్రాంచైజీలలో ఒకటిగా 2008 లో స్థాపించబడిన ఈ జట్టు, జైపూర్ లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్‌ను కొన్నిసార్లు ఐపిఎల్ యొక్క "మనీబాల్" జట్టుగా పరిగణిస్తారు.[2][3][4] రాయల్స్, మరుగునపడిన మంచి ప్రతిభను వెలికితీయడానికి,[5][6][7] అనేక వివాదాలు, కుంభకోణాలకూ ప్రసిద్ధం.[8][9][10][11]

మధ్య వయస్కులతో జరిగిన ఛారిటీ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బాల్కనీ చిత్రం

మీడియా, అభిమానులు టైటిల్‌కు పోటీదారుగా లెక్కించనప్పటికీ, షేన్ వార్న్ కెప్టెన్సీలో ఐపిఎల్ ప్రారంభ ఎడిషన్‌ను జట్టు గెలుచుకుంది. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో 2013 ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ 20 లో రాయల్స్ రెండవ స్థానంలో నిలిచింది.[12][13]

2015 జూలై 14 న, 2013 బెట్టింగ్ కుంభకోణంపై భారత సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ ఇచ్చిన తీర్పులో రాజస్థాన్ రాయల్స్‌ను, చెన్నై సూపర్ కింగ్స్‌నూ రెండేళ్లపాటు సస్పెండ్ చేసింది. అంటే వారు 2016, 2017 ఐపిఎల్ టోర్నమెంట్లలో పాల్గొనలేరు. 2018 సీజన్లో తిరిగి పోటీకి వచ్చారు.

అజింక్య రహానె 2705 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌న్మన్ గానూ,[14], షేన్ వాట్సన్ 67 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలరుగానూ ఉన్నారు.[15]

సీజన్లు, స్థానాలు

ఇయర్లీగ్ టేబుల్ స్టాండింగ్తుది స్థానం
20088 లో 1 వ స్థానంఛాంపియన్స్
20098 లో 6 వ6 వ
20108 లో 7 వ7 వ
201110 లో 6 వ6 వ
20129 లో 7 వ7 వ
20139 లో 3 వప్లేఆఫ్‌లు (3 వ)
20148 లో 5 వ5 వ
20158 లో 4 వ స్థానంప్లేఆఫ్‌లు (4 వ)
20188 లో 4 వ స్థానంప్లేఆఫ్‌లు (4 వ)
20198 లో 7 వ7 వ

గణాంకాలు

ఫలితాల సారాంశం
ఇయర్స్మ్యాచ్లువిజయాలునష్టాలుఫలితం లేదువిజయ రేటు
200814113078,57%
20091467146,15%
20101468042,86%
20111467146,15%
20121679043,75%
201316106062,50%
20141477050.00%
20151466250.00%
2016సస్పెండ్
2017సస్పెండ్
20181477050.00%
20191357138,46%
మొత్తం1437167549,65

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ