రమాదేవి చౌదరి

భారతీయ స్వాతంత్య్ర సమరయోధురాలు

రమాదేవి చౌదరి, (1899 డిసెంబరు 3 - 1985 జూలై 22), రమాదేవి అని కూడా పిలుస్తారు. ఈమె భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘ సంస్కర్త. ఒడిషా ప్రజలు ఆమెను మా (తల్లి) అని పిలిచేవారు.ఆమె గొప్పవ్యక్తిత్వానికి మారుపేరుగా భువనేశ్వర్‌లోని రమాదేవి మహిళా విశ్వవిద్యాలయానికి ఆమె పేరును పెట్టారు.[1][2]

రమాదేవి చౌదరి
ରମାଦେବୀ ଚୌଧୁରୀ
జననం(1899-12-03)1899 డిసెంబరు 3
సత్యభామాపూర్ గ్రామం, కటక్, ఒడిస్సా, బ్రిటిషు పాలన
మరణం1985 జూలై 22(1985-07-22) (వయసు 85)
జాతీయతభారతీయ
ఇతర పేర్లుమా (తల్లి)
వృత్తిభారత స్వాతంత్ర్య కార్యకర్త, సామాజిక సంస్కర్త

కుటుంబం

ఆమె తండ్రి గోపాల్ బల్లవ్ దాస్, తల్లి బసంత్ కుమారి దేవి.ఆమె ఉత్కల్ గౌరబ్ మధుసూదన్ దాస్కు మేనకోడలు అవుతుంది.[2] ఆమె 15 సంవత్సరాల వయస్సులో, అప్పటి డిప్యూటీ కలెక్టరుగా పనిచేయుచున్న గోపబంధు చౌదరిని వివాహం చేసుకుంది.[3]

స్వాతంత్ర్య సమయంలో ఆమె కీలక పాత్ర

ఆమె తన భర్తతో కలిసి,1921లో భారతస్వాతంత్ర్య ఉద్యమంలో చేరింది.[3] ఆమె మహాత్మా గాంధీచే బాగా ప్రభావితమైంది.[4] సహకారేతర ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. స్వాతంత్ర్యోద్యమంలో మహిళలను ప్రోత్సహించడానికి ఆమె గ్రామం నుండి గ్రామం వెళ్లింది.[4] ఆమెను ప్రభావితం చేసిన వారిలో ఇతరులు జై ప్రకాష్ నారాయణ్, వినోబా భావే, ఆమె మేనమామ మధుసూదన్ దాస్ ఉన్నారు.[4] 1921లో, ఆమె మొదటిసారి గాంధీజీతో సమావేశమైంది.తన భర్తతో కలిసి సహకారేతర ఉద్యమంలో చేరింది.[4] అదే సంవత్సరం వారు భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి, అప్పటినుండి ఖాదీ ధరించడం ప్రారంభించారు.[4] 1930 లో ఆమె ఒరిస్సా స్థాయిలో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. ఆమె కిరణ్ బాలా సేన్, మాలతీదేవి చౌదరి, సరళా దేవి, ప్రాణకృష్ణ, పాధియారి వంటి ఇతర కార్యకర్తలతో కలిసి ఇంచుడి, సృజంగ్‌  గ్రామాలకు వెళ్లారు.[4] ఆమెతో సహా ఆమె సహచరులు అందరిని 1930 నవంబరులో బ్రిటీషు వారు నిర్బందించారు.[5] వీరిని బ్రిటీష్ ప్రభుత్వం వేర్వేరు జైళ్లలో ఉంచారు. ఆమెను అలా అనేకసార్లు 1921,1930,1936,1942 లలో నిర్బందించి, సరళా దేవి, మాలతీ చౌదరి, ఇతర మహిళా స్వాతంత్ర్య కార్యకర్తలతో జైలుకు పంపారు.[4][6][7][8] ఆమె1931 భారత జాతీయ కాంగ్రెసు కరాచీ సభలకు హాజరైంది. ఆసమయంలో తదుపరి సభలను ఒరిస్సాలో నిర్వహించాలని నాయకులను అభ్యర్థించింది.[4] 1932 లో హజారీబాగ్ జైలు నుండి విడుదలైన తర్వాత, ఆమె హరిజన సంక్షేమంలో చురుకుగా పాల్గొంది. అస్పృశ్యతా నిర్మూలన కోసం గాంధీజీ ఆదేశాలమేరకు, ఆమె ఆస్పృశ్యతా నివారణ సమితిని ప్రకటించింది. ఈసంస్థ తరువాత హరిజన సేవా సంఘంగా పేరు మార్చబడింది.[4] గాంధీజీ 1932,1934 లో ఒరిస్సా సందర్శనలలో కస్తూర్బా, సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, మౌలానా ఆజాద్, జవహర్‌లాల్ నెహ్రూ, ఇతరుల సందర్శనలలో చాలా దగ్గరగా ఆమె పాల్గొంది.[4] ఆమె బారీ పట్టణంలో ఒక ఆశ్రమాన్ని ప్రారంభించింది.దానికి "గాంధీజీ సేవాఘర్" అని పేరు పెట్టింది.[4] 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో, భర్త గోపబంధు చౌదరితో సహా రమాదేవి, ఆమె ఇతర కుటుంబ సభ్యులు అందరిని బ్రిటీషు ప్రభుత్వం నిర్బందించింది.[4] కస్తూర్బా గాంధీ మరణం తరువాత, గాంధీజీ కస్తూర్బా ట్రస్టుకు ఒరిస్సా విభాగం తరుపున రమాదేవికిప్రతినిధి బాధ్యతలు అప్పగించాడు.[4]

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పాత్ర

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఆచార్య వినోబా భావే, భూదాన్, గ్రామదాన్ ఉద్యమాలకు రమాదేవి తనను తాను పూర్తిగా అంకితం చేసుకుంది.[9] 1952లో ఆమె తన భర్తతో పాటు భూమిలేని పేదలకు భూమి సంపదను అందించే సందేశాన్ని ప్రచారం చేయడానికి ఆమె రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4000 కి.మీ. కాలినడకన ప్రయాణించింది.[9][10][11][12][13][14] 1928 నుండి రమాదేవి జగత్సింగ్‌పూర్‌లోని అలక ఆశ్రమంలో ఉంది.[15]

ఆమె ఉత్కల్ ఖాది మండలాన్ని ఏర్పాటు చేయడంలో, రామచంద్రపూర్‌లో ఉపాధ్యాయుల శిక్షణాకేంద్రం, బాలవాడి ఏర్పాటు చేయటానికి సహాయపడింది. 1950లో ఆమె దుంబూరుగెడలో గిరిజన సంక్షేమకేంద్రాన్ని ఏర్పాటు చేసింది.1951 కరువు సమయంలో ఆమె మాలతిదేవి చౌదరితో కలసికోరాపుట్‌ కరువునివారణలో పనిచేశారు.1962 ఇండో-చైనీస్ యుద్ధంలో ప్రభావితమైన సైనికులకు సహాయం చేయడానికి రమాదేవి తన సేవలను అందించింది. భారత అత్యవసర స్థితి సమయంలో హరే కృష్ణ మహతాబ్, నీలమణి రౌత్రేతో ఆమె తన సొంత వార్తాపత్రిక ద్వారా నిరసన వ్యక్తం చేసింది.[4] గ్రామ సేవక్ పత్రికను ప్రభుత్వం నిషేధించింది. ఒరిస్సా నుండి ఇతర నాయకులతో పాటు నబక్రుష్ణ చౌదరి, హరేకృష్ణ మహతాబ్, మన్మోహన్ చౌదరి, అన్నపూర్ణ మొహరాణా, జయకృష్ణ మొహంతి, ఇతరులును నిర్బంధంలో ఉంచింది.[16] ఆమె కటక్‌లో ఒక ప్రాథమిక పాఠశాల,శిశు విహార్, క్యాన్సర్ ఆసుపత్రిని స్థాపించింది.[4]

గౌరవాలు

రమాదేవికి జాతికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా,1981 నవంబరు 4 న జమ్నాలాల్ బజాజ్ అవార్డు [17][18] ఉత్కల్ విశ్వవిద్యాలయం ద్వారా డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (గౌరవ పురస్కారం) 1984 ఏప్రిల్ 16 న ప్రదానం చేయబడింది.

స్మారక చిహ్నాలు

ఆమె జ్ఞాపకార్థం భువనేశ్వర్‌లోని రమాదేవి మహిళా విశ్వవిద్యాలయానికి ఆమె పేరు పెట్టారు.ఇది తూర్పు భారతదేశంలో మొదటి మహిళా విశ్వవిద్యాలయం. ఇది 2015లో స్థాపించబడింది.విశ్వవిద్యాలయం ఆవరణలో ఆమెకు అంకితమైన మ్యూజియం ఉంది.కటక్‌లో ఆమె ప్రారంభించిన పాఠశాల-శిశు విహార్ - ఇప్పుడు రమాదేవి శిశు విహార్ అని పేరు పెట్టారు.[19]

మరణం

ఆమె 1985 జూలై 22 న మరణించింది.[4]

ప్రస్తావనలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ