రన్ లోలా రన్ (1998 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
రన్ లోలా రన్
రన్ లోలా రన్ సినిమా పోస్టర్
దర్శకత్వంటామ్‌ టైక్వెర్‌
రచనటామ్‌ టైక్వెర్‌
నిర్మాతస్టీఫన్ అర్న్ద్ట్
తారాగణంఫ్రాంకా పోటేంట్, మొరిట్జ్ బ్లీబ్ట్రూ, హెర్బర్ట్ కన్నాప్, నినా పెట్రి, జోచిం క్రోల్, అర్మిన్ రోడ్, హీనో ఫెర్చ్, సుజానే వాన్ బోర్సొడి, సెబాస్టియన్ స్కిప్పర్
Narrated byహన్స్ పేష్చ్
ఛాయాగ్రహణంఫ్రాంక్ గిరీబ్
కూర్పుమాథిల్డే బోనీఫాయ్
సంగీతంటామ్‌ టైక్వెర్‌, జానీ క్లేమేక్, రైన్హోల్డ్ హెయిల్
పంపిణీదార్లుప్రొకినో ఫిలింవర్లీహ
విడుదల తేదీ
20 ఆగస్టు 1998 (1998-08-20)
సినిమా నిడివి
80 నిముషాలు[1]
దేశంజర్మనీ
భాషజర్మన్
బడ్జెట్$1.75 మిలియన్[2]
బాక్సాఫీసు$22.9 మిలియన్[2]

రన్ లోలా రన్ 1998, ఆగష్టు 20న విడుదలైన జర్మన్ చలనచిత్రం. టామ్‌ టైక్వెర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లోలాగా ఫ్రాంకా పోటేంట్, మన్నీగా మొరిట్జ్ బ్లీబ్ట్రూ నటించారు. పోగొట్టుకున్న డబ్బును కనిపెట్టడంతోపాటు, ప్రియుడిని కాపాడుకోవడం కోసం ఒక మహిళ చేసే పరుగు నేపథ్యంలో రూపొందించబడిన ఈ చిత్రం 55వ వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడి, గోల్డెన్ లయన్ అవార్డు కోసం పోటీపడింది.[3]

ఇది 71వ ఆస్కార్ అవార్డులలో జర్మనీ నుండి ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఎంట్రీగా ఎంపికైంది, కానీ నామినేట్ చేయబడలేదు.[4][5] ఈ చిత్రం 1999, డిసెంబరు 21న డివిడిలలో, 2008, ఫిబ్రవరి 19న బ్లూ రేలో విడుదలైంది.

కథ

లోలా ప్రియుడు మన్నీ వృత్తిలో భాగంగా యజమానికి కొంత డబ్బును ఇవ్వడం కోసం ట్రైన్‌లో వస్తున్న తరుణంలో పోలీసులకు భయపడి ఆ డబ్బుని అక్కడే వదిలేసి పారిపోతాడు. ఆ డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని బాస్‌ మన్నీని బెదిరిస్తాడు. ఆ డబ్బుని బాస్‌కి ఇవ్వడం కోసం మన్నీ చేసే ప్రయత్నాల్లో ప్రియురాలు లోలా ఎటువంటి సాహసం చేసిందనేదే ఈ కథ.[6]

నటవర్గం

  • ఫ్రాంకా పోటేంట్
  • మొరిట్జ్ బ్లీబ్ట్రూ
  • హెర్బర్ట్ కన్నాప్
  • నినా పెట్రి
  • అర్మిన్ రోడ్
  • జోచిం క్రోల్
  • లడ్జర్ పిస్టర్
  • సుజానే వాన్ బోర్సొడి
  • సెబాస్టియన్ స్కిప్పర్
  • జూలియా లిన్డిగ్
  • లార్స్ రుడోల్ఫ్
  • ఉటె లూబాష్
  • మోనికా బ్లీబెట్రూ
  • హీనో ఫెర్చ్
  • హన్స్ పేష్చ్

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: టామ్‌ టైక్వెర్‌
  • నిర్మాత: స్టీఫన్ అర్న్ద్ట్
  • రచన: టామ్‌ టైక్వెర్‌
  • వ్యాఖ్యానం: హన్స్ పేష్చ్
  • సంగీతం: టామ్‌ టైక్వెర్‌, జానీ క్లేమేక్, రైన్హోల్డ్ హెయిల్
  • ఛాయాగ్రహణం: ఫ్రాంక్ గిరీబ్
  • కూర్పు: మాథిల్డే బోనీఫాయ్
  • నిర్మాణ సంస్థ: ఎక్స్- ఫిల్మ్ క్రియేటివ్ పూల్, డబ్ల్యూ.డి.ఆర్., ఆర్టే
  • పంపిణీదారు: ప్రొకినో ఫిలింవర్లీహ

ఇతర వివరాలు

  1. లోలా ప్రియుడు ఏ రైలులో మన్నీ డబ్బు వదిలేశాడో ఆ రైలును పట్టుకోవడం కోసం లోలా చేసే పరుగు ఈచిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
  2. ఈ చిత్రం 23 లక్షల డాలర్ల వసూళ్ళతోపాటు విమర్శకుల ప్రశంసలందుకుంది.
  3. ఈ చిత్రం బెర్లిన్, జర్మనీలో, పరిసర ప్రాంతాలలో చిత్రీకరించబడింది.[7]

మూలాలు

ఇతర లంకెలు

మార్గదర్శకపు మెనూ