మేజర్ చంద్రకాంత్

1993 తెలుగు సినిమా

మేజర్ చంద్రకాంత్, 1993 లో విడుదలైన తెలుగు భాషా చిత్రం.[1] దీనిని మోహన్ బాబు తన శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ క్రింద నిర్మించాడు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్. టి. రామారావు, మోహన్ బాబు, శారద, రమ్య కృష్ణ, నగ్మా ప్రధాన పాత్రలలో నటించారు.[2] ఎం. ఎం. కీరవానీ సంగీతం, వి. జయరాం ఛాయాగ్రహణం అందించారు. ఎన్. టి. రామారావు పుణ్యభూమి నాదేశం అనే పాటలో ఛత్రపతి శివాజీ, వీరపాండ్య కట్టబొమ్మన్న, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలను పోషించారు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టరుగా రికార్డ్ సాధించంది. ఇది సిల్వర్ జుబ్లీ ఉత్సవాలను జరుపుకుంది.

మేజర్ చంద్రకాంత్
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
అమ్రీష్ పురి.
మోహన్ బాబు,
శారద
సంగీతం ఎమ్.ఎమ్.కీరవాణి
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
భాష తెలుగు

కథ

పరమ వీర చక్ర పురస్కారం పొందిన ధైర్యవంతుడైన సైనికుడు మేజర్ చంద్రకాంత్ (ఎన్.టి.రామారావు) ఘోరమైన ఉగ్రవాది జికె (రాఖీ) నుండి విదేశీ పర్యాటకులను రక్షించే ఆపరేషన్లో, అతని సన్నిహితుడు మేజర్ రాజశేఖర్ (ఎం.బాలయ్య) దురదృష్టవశాత్తు తీవ్రంగా గాయపడతాడు. రాజశేఖర్ చనిపోయే ముందు మేజరు చంద్రకాంత్ తన కుమార్తె సీత (నగ్మా) ను రాజశేఖర్ కుమారుడు శివాజీ (మోహన్ బాబు) తో వివాహం జరిపిస్తానని వాగ్దానం చేస్తాడు.

శివాజీ గ్యాంగ్ స్టర్ అవుతాడు. తన స్నేహితురాలు హేమ (రమ్య కృష్ణ) తో సహవాసం చేస్తాడు. తన 5 గురు కుమారులతో సమాజంలో చాలా దారుణాలను చేసే ఎంపి జ్ఞానేశ్వరరావు (అమ్రిష్ పూరి) కింద పనిచేస్తూ ఉంటాడు. ఒకసారి పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో శివాజీ తెలియకుండానే సీతను పెళ్ళి చేసుకుని తప్పించుకుంటాడు. ఇంతలో, చంద్రకాంత్ ఇంటికి తిరిగి వస్తాడు, అక్కడ అతను తన ఆదర్శ భార్య సావిత్రి (శారద), ఇద్దరు కుమార్తెలు డాక్టర్ భారతి (సుధా) & ఝాన్సీ (కిన్నెర), కుమారుడు శివాజీలతో కలిసి సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ప్రస్తుతం చంద్రకాంత్ జ్ఞానేశ్వరరావును ఎదుర్కొంటూ ఉంటాడు. ఒక నిరసన ప్రదర్శనలో చంద్రకాంత్ గాయపడినప్పుడు శివాజీ తన తండ్రిని ప్రశ్నిస్తాడు. అప్పుడు చంద్రకాంత్ దేశం కీర్తిని వివరిస్తాడు. దాంతో శివాజీ మనసుమారి, తన మార్గాన్ని వీడి మంచివాడిగా బతకాలని నిర్ణయించుకుంటాడు. దీనికి జ్ఞానేశ్వరావు అంగీకరించడు. అతన్ని పోలీసులకు పట్టిస్తాడు. చంద్రకాంత్ కొడుకుపై కోపగించినపుడూ శివాజీ తన గతాన్ని వివరించి తాను అలా ఎందుకు మారాల్సి వచ్చిందో చెబుతాడు. అయినప్పటికీ, శివాజీ పనులను అంగీకరించడు. కాబట్టి, అతను ఇంటిని విడిచిపెట్టి, హేమ సహాయంతో నిజమైన నేరస్థులను పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో అతడు సఫలమౌతాడా, అతడి కుటుంబం ఏ మలుపులు తిరుగుతుంది అనేది మిగతా సినిమా కథ.[3]

నటవర్గం

సంగీతం

ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు.

పాటలు

  • పుణ్యభూమి నాదేశం నమో నమామి - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , రచన: జాలాది రాజారావు.
  • నీక్కావల్సింది నా దగ్గర ఉంది - మనో, చిత్ర , రచన: గురుచరణ్ .
  • ఉలికి పడకు అల్లరి మొగుడా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె .ఎస్ . చిత్ర, రచన: రసరాజూ.
  • బుంగ మూతి , బాలు, చిత్ర , రచన: గురుచరన్
  • ముద్దుతోఓనమాలు నేర్పించాన , జేసుదాస్, చిత్ర రచన : కీరవాణి.
  • లప్పం టప్పం , బాలు ,చిత్ర ,రచన: గురు చరణ్
  • సుఖీభవ సుమంగళి , ఎస్. పి.బాలసుబ్రహ్మణ్యం , కె .ఎస్ . చిత్ర , రచన: జాలాది రాజారావు.

మూలాలు

బయటి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ