మెదక్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
మెదక్
Constituency No. 34 for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామెదక్
లోకసభ నియోజకవర్గంమెదక్ లోక్‌సభ నియోజకవర్గం
ఏర్పాటు1957
మొత్తం ఓటర్లు1,99,553
రిజర్వేషన్జనరల్
శాసనసభ సభ్యుడు
ప్రస్తుతం
పార్టీకాంగ్రెస్
ఎన్నికైన సంవత్సరం2023
అంతకుముందుపద్మా దేవేందర్ రెడ్డి

మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో మెదక్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1]

నియోజకవర్గంలోని మండలాలు

  • మెదక్
  • పాపన్నపేట
  • రామాయంపేట
  • దుబ్బాక

ఎన్నికైన శాసనసభ్యులు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
[2]
సంవత్సరంగెలుపొందిన సభ్యుడుపార్టీప్రత్యర్థిప్రత్యర్థి పార్టీ
1962కె.ఆనంద్ దేవిసి.పి.ఐఎస్.కె.రెడ్డిస్వతంత్ర అభ్యర్థి
1967రామచంద్రారెడ్డికాంగ్రెస్ పార్టీకె.సంగమేశ్వర్ రెడ్డిస్వతంత్ర అభ్యర్థి
1972కె. రామచంద్రరావుస్వతంత్ర అభ్యర్థిదేవేందర్కాంగ్రెస్ పార్టీ
1978ఎస్.లక్ష్మారెడ్డిఇందిరా కాంగ్రెస్కె. రామచంద్రరావుకాంగ్రెస్ పార్టీ
1983కె. రామచంద్రరావుతెలుగుదేశంఎస్.లక్ష్మారెడ్డికాంగ్రెస్ పార్టీ
1985కె. రామచంద్రరావుతెలుగుదేశంఎం.ఎన్.లక్ష్మీనారాయణకాంగ్రెస్ పార్టీ
1989పట్లోళ్ల నారాయణ రెడ్డికాంగ్రెస్ పార్టీకె. రామచంద్రరావుతెలుగుదేశం
1994కె. రామచంద్రరావుతెలుగుదేశం పార్టీపట్లోళ్ల నారాయణ రెడ్డికాంగ్రెస్ పార్టీ
1999కె. రామచంద్రరావుతెలుగుదేశంపి.జె.విఠల్ రెడ్డికాంగ్రెస్ పార్టీ
2002కరణం ఉమాదేవితెలుగుదేశం పార్టీపి.శశిధర్ రెడ్డికాంగ్రెస్ పార్టీ
2004పి.శశిధర్ రెడ్డిజనతా పార్టీకె.ఉమాదేవితెలుగుదేశం పార్టీ
2009మైనంపల్లి హన్మంతరావుతెలుగుదేశం పార్టీపి.శశిధర్ రెడ్డికాంగ్రెస్ పార్టీ
2014పద్మా దేవేందర్ రెడ్డితె.రా.సవిజయశాంతికాంగ్రెస్ పార్టీ
2018పద్మా దేవేందర్ రెడ్డితె.రా.సఅమ్మారెడ్డిగారి ఉపేందర్ రెడ్డికాంగ్రెస్ పార్టీ
2023[3]మైనంపల్లి రోహిత్కాంగ్రెస్ పార్టీపద్మా దేవేందర్ రెడ్డిభారత్ రాష్ట్ర సమితి

2004 ఎన్నికలు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మెదక్ శాసనసభ నియోజకవర్గం నుంచి జనతా పార్టీకి చెందిన పట్లోళ్ళ శశిధర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కరణం ఉమాదేవి‌పై 4449 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. శశిధర్ రెడ్డికి 43369 ఓట్లు రాగా, ఉమాదేవికి 38920 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎం.హన్మంతరావు పోటీ చేయగా [4] కాంగ్రెస్ పార్టీ నుండి టి.శిశిధర్ రెడ్డి పోటీపడ్డాడు. ప్రజారాజ్యం పార్టీ తరఫున బట్టి జగపతి, లోక్‌సత్తా పార్టీ టికెట్టుపై కె.సౌజన్య పోటీపడ్డారు.[5]

ఇవి కూడా చూడండి

మూలాలు

మార్గదర్శకపు మెనూ