మలింగ బండార

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
Malinga Bandara
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Herath Mudiyanselage Charitha Malinga Bandara
పుట్టిన తేదీ (1979-12-31) 1979 డిసెంబరు 31 (వయసు 44)
Kalutara, Sri Lanka
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుRight arm leg break
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 71)1998 మే 27 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు2006 ఏప్రిల్ 3 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 127)2006 జనవరి 6 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే2011 ఏప్రిల్ 1 - ఇండియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.72
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2008–presentBasnahira South
2006–presentRagama
2010Kent
2005Gloucestershire
2004–2005Galle
2003–2004Tamil Union
1998–2003Nondescripts
1996–1997Kalutara
కెరీర్ గణాంకాలు
పోటీటెస్టులువన్‌డేలుఫస్ట్లిస్ట్ ఎ
మ్యాచ్‌లు831151137
చేసిన పరుగులు1241603,4301,126
బ్యాటింగు సగటు15.5012.3020.1717.59
100లు/50లు0/00/01/140/3
అత్యుత్తమ స్కోరు433110864
వేసిన బంతులు1,1521,47020,9945,846
వికెట్లు1636431189
బౌలింగు సగటు39.5634.2225.3824.31
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు00144
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు0n/a2n/a
అత్యుత్తమ బౌలింగు3/844/318/495/22
క్యాచ్‌లు/స్టంపింగులు4/–9/–95/–39/–
మూలం: CricketArchive, 2011 ఫిబ్రవరి 8

1979, డిసెంబర్ 31న జన్మించిన మలింగ బండార (Malinga Bandara) శ్రీలంక క్రికెట్ జట్టుకు చెందిన క్రీడాకారుడు. 1998లో తొలిసారిగా న్యూజీలాండ్ పై టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు. కాని గణాంకాలు సరిగా లేకపోవడంతో జట్టు నుంచి తొలిగించబడ్డాడు. 2005 మార్చిలో ఇంగ్లాండు-ఏ జట్టుపై 126 పరుగులకు 11 వికెట్లు తీసి అదే సంవత్సరం డిసెంబర్లో మళ్ళీ జాతీయ జట్టులోకి ప్రవేశించాడు.భారత్‌పై 3 టెస్టుల సీరీస్‌లో 32.98 సగటుతో 9 వికెట్లు సాధించాడు. 2006 జనవరిలో న్యూజీలాండ్ పై తొలి వన్డే ఆడినాడు. సీరీస్‌లో 23.92 సగటుతో 14 వికెట్లు సాధించి సహచరుడు ముత్తయ్య మురళీధరన్ కంటే మెరుగనిపించుకున్నాడు.

టెస్ట్ క్రికెట్ గణాంకాలు

మలింగ బండార 8 టెస్టు మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించి 39.56 సగటుతో 16 వికెట్లు సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 84 పరుగులకు 3 వికెట్లు. బ్యాటింగ్‌లో 15.50 సగటుతో 124 పరుగులు చేశాడు. అత్యుత్తమ స్కోరు 43 పరుగులు.

వన్డే క్రికెట్ గణాంకాలు

మలింగ 26 వన్డేలలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 32.25 సగటుతో 31 వికెట్లు పడగొట్టినాడు. వన్డేలలో అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 31 పరుగులకు 4 వికెట్లు. బ్యాటింగ్‌లో 11.72 సగటుతో 129 పరుగులు చేశాడు. వన్డేలలో అత్యుత్తమ స్కోరు 28 నాటౌట్.

మార్గదర్శకపు మెనూ