మరియప్పన్ తంగవేలు

ఇది చాల ఉపయోగకరం

మరియప్పన్ తంగవేలు (జననం 1995 జూన్ 28) భారతదేశానికి చెందిన పారాలింపిక్ క్రీడాకారుడు, హై జంపర్. ఇతను 2016 రియో డి జనెరియో లో జరిగిన వేసవి పారాలింపిక్ క్రీడలలో T-42 విభాగంలో స్వర్ణ పతకం , 2020 వేసవి పారాలింపిక్స్లో రజత పతకం సాధించాడు.[1][2] [3]

మరియప్పన్ తంగవేలు
2016 రియో పారాలింపిక్స్లో
వ్యక్తిగత సమాచారం
పూర్తిపేరుMariyappan Thangavelu
మరియప్పన్ తంగవేలు
జననం (1995-06-28) 1995 జూన్ 28 (వయసు 29)
పెరియాదాగంపట్టి , సాలెం జిల్లా, తమిళనాడు.
క్రీడ
దేశం భారతదేశం
క్రీడAthletics
పోటీ(లు)హై జంప్ - T42 &T63

2017 జనవరి 25 భారత ప్రభుత్వం తంగవేలుని క్రీడలలో అతని కృషికి గాను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అదే సంవత్సరంలో తంగవేలు అర్జున అవార్డు కూడా సాధించాడు. 2020 లో మేజర్ ధ్యాంచంద్ ఖేల్ రత్న అవార్డు కు ఎంపికయ్యాడు.

జీవిత చరిత్ర

తంగవేలు తమిళనాడులోని సేలం జిల్లాలోని ఓమలూరు సమీపంలోని పెరియాదాగంపట్టి గ్రామానికి చెందినవాడు. ఇతనికి నలుగురు సోదరులు ఒక సోదరి ఉన్నారు. తండ్రి మొదట కుటుంబాన్ని విడిచివెళ్లడంతో, తల్లి సరోజ పిల్లలను పెంచింది. సరోజమ్మ తాపీ పని చేసేది, కూరగాయలను విక్రయించేది రోజుకు 100 రూపాయలు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించింది. తంగవేలు తన ఐదవ సంవత్సరంలో పాఠశాలకు వెళ్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో అతని కుడి కాలు మీద నుండి బస్సు వెల్లడంతో తను మోకాలి క్రింద కాలు కోల్పోయాడు. ఈ క్లిష్ట పరిస్థితులని ఎదుర్కొంటూనే తంగవేలు తన పాఠశాల విద్యను పూర్తి చేసాడు.

కెరీర్

2019 నవంబర్ లో, అతను దుబాయ్‌లో 1.80 మీటర్ల ఎత్తు ఛేదించి ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

ఇతని చిత్రంతో మై స్టాంప్ పథకం కింద సేలం తపాలా కార్యాలయం తరపున తపాలా బిళ్ల విడుదల చేయబడింది.

మూలాలు

బయటి లంకెలు

పారాలింపిక్స్ లో భారత్