మట్టి కుస్తీ

మట్టి కుస్తీ తెలుగులో విడుదల కానున్న సినిమా. ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై తమిళంలో గట్ట కుస్తీ పేరుతో, తెలుగులో మట్టి కుస్తీ పేరుతో రవితేజ, విష్ణు విశాల్,[1] శుభ్ర, ఆర్యన్ రమేష్ నిర్మించిన ఈ సినిమాకు చెల్ల అయ్యవు దర్శకత్వం వహించాడు. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, కరుణాస్, శ్రీజ రవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబరు 20న విడుదల చేసి[2], సినిమా డిసెంబరు 2న తమిళ, తెలుగు భాషల్లో విడుదలై[3],జనవరి 1న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలైంది.[4]

మట్టి కుస్తీ
దర్శకత్వంచెల్ల అయ్యవు
రచనచెల్ల అయ్యవు
నిర్మాతరవితేజ
విష్ణు విశాల్
శుభ్ర
తారాగణంవిష్ణు విశాల్
ఐశ్వర్య లక్ష్మి
శ్రీజ రవి
ఆర్యన్ రమేష్
ఛాయాగ్రహణంరిచర్డ్ ఎం. నాథన్
కూర్పుప్రసన్న జీకే
సంగీతంజస్టిన్ ప్రభాకరన్
నిర్మాణ
సంస్థలు
ఆర్.టీ. టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్
విడుదల తేదీs
2 డిసెంబరు 2022 (2022-12-02)(థియేటర్)
1 జనవరి 2023 (2023-01-01)( నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో)
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ

వీర (విష్ణు విశాల్‌) చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోతాడు, అతడిని చిన్న‌ప్ప‌టి నుంచి మామ‌య్య (క‌రుణాస్‌) పెంచి పెద్ద చేస్తాడు. ఎనిమిదో తరగతి చదివిన వీర తాతలు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ, చిన్న చిన్న పంచాయితీలు తీరుస్తూ, కబడ్డీ ఆడుతూ కాలం గడుపుతూంటాడు. త‌ను పెళ్లి చేసుకోవాలంటే చ‌దువుకోని అమ్మాయి అయ్యుండాల‌ని, ఆమెకు పెద్ద జ‌డ ఉండాల‌నే షరతులు పెడతాడు. కీర్తి (ఐశ్వ‌ర్య ల‌క్ష్మి) తన ఇంట్లో ఇష్టం లేక‌పోయినా బాబాయ్ (మునీష్ కాంత్‌) సహకారంతో రెజ్ల‌ర్ అవుతుంది.ఆమె రెజ్ల‌ర్ కావ‌టంతో ఎవ‌రూ పెళ్లి చేసుకోవ‌టానికి ముందు రారు.

కీర్తి బాబాయ్ త‌న చిన్ననాటి స్నేహితుడైన వీరా మామ‌య్య క‌రుణాస్‌ని అనుకోకుండా క‌లుస్తాడు. ఈ క్రమంలో వీరాకి పెళ్లి కాలేద‌ని తెలుసుకొని తన కూతురు కీర్తి ఏడో త‌ర‌గ‌తి మాత్ర‌మే చ‌దువుకుంద‌ని, ఆమెకు పెద్ద జ‌డ ఉంద‌ని అబ‌ద్దాలు చెప్పి వీరాతో పెళ్లి జ‌రిపిస్తారు. కొన్నిరోజుల తరువాత వీరాకు కీర్తి రెజ్ల‌ర్ అనే నిజం తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చాయి? అనేదే మిగతా సినిమా కథ.[5]

నటీనటులు

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్: ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్
  • నిర్మాత: రవితేజ[8], విష్ణు విశాల్, శుభ్ర, ఆర్యన్ రమేష్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చెల్ల అయ్యవు
  • సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
  • సినిమాటోగ్రఫీ:రిచర్డ్ ఎం. నాథన్

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ