మంథన్

1976లో శ్యామ్ బెనగళ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం

మంథన్ 1976లో విడుదలైన హిందీ చలనచిత్రం. క్రౌడ్ ఫండింగ్ విధానంలో 500,000 మంది రైతులు ఒక్కొక్కరు రూ. 2 చొప్పున ఇచ్చిన విరాళంతో శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, నసీరుద్దీన్ షా, అమ్రీష్ పురి తదితరులు నటించారు.[1] 1977లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఉత్తమ హిందీ చిత్రం, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత (విజయ్ టెండూల్కర్) పురస్కారాలను అందుకుంది. 1976లో ఉత్తమ విదేశి చిత్రం విభాగంలో ఆస్కార్ అవార్డుకు పంపించడం జరిగింది.[2]

మంతన్
దర్శకత్వంశ్యామ్ బెనగళ్
రచనకైఫీ ఆజ్మీ (మాటలు)
స్క్రీన్ ప్లేవిజయ్ టెండూల్కర్
కథవర్గీస్ కురియన్ & శ్యామ్ బెనగళ్
నిర్మాతగుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్.
తారాగణంస్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, నసీరుద్దీన్ షా, అమ్రీష్ పురి
ఛాయాగ్రహణంగోవింద్ నిహాలని
కూర్పుభానుదాస్ దివాకర్
సంగీతంవన్ రాజ్ భాటియా
విడుదల తేదీ
1976 (1976)(భారతదేశం)
సినిమా నిడివి
134 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

కథానేపథ్యం

గుజరాత్‌లోని ఖేడా జిల్లాలోని పేద రైతులు సమిష్టిగా ఒక సంఘం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటారు. స్థానిక సామాజిక కార్యకర్త త్రిభువన్‌దాస్ పటేల్ వంటి నాయకుల ఆధ్వర్యంలో కైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం ఏర్పడుతుంది.

గుజరాత్‌లోని ప్రతి జిల్లాలో ఇలాంటి సంఘాలు ఏర్పాటుచేయబడి, 1946లో గుజరాత్‌లోని ఆనంద్‌లో పాల సహకార సంస్థ అమూల్ ఏర్పడటానికి దారితీసింది. చివరికి,1970లో నేషన్‌వైడ్ మిల్క్ గ్రిడ్ ను సృష్టించడం ద్వారా భారతదేశంలో శ్వేత విప్లవం ప్రారంభానికి దారితీసింది. ఈ నేపథ్యం ఆధారంగా సినిమా తీయబడింది.

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: శ్యామ్ బెనగళ్
  • నిర్మాత: గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్.
  • మాలు: కైఫీ ఆజ్మీ
  • స్క్రీన్ ప్లే: విజయ్ టెండూల్కర్
  • కథ: వర్గీస్ కురియన్ & శ్యామ్ బెనగళ్
  • సంగీతం: వన్ రాజ్ భాటియా
  • ఛాయాగ్రహణం: గోవింద్ నిహాలని
  • కూర్పు: భానుదాస్ దివాకర్

ఇతర వివరాలు

  1. ఇది భారతీయ మొట్టమొదటి క్రౌడ్ ఫండ్ చిత్రం.[4]
  2. వర్గీస్ కురియన్ యొక్క పాల సహకార ఉద్యమం నుండి ప్రేరణ పొంది భారత వైట్ విప్లవం నేపథ్యంలో రాయబడింది.[5]
  3. 5,00,000 మంది రైతులు ఒక్కొక్కరు రూ. 2 చొప్పున క్రౌడ్ ఫండింగ్ చేశారు.[6][7][8]
  4. టైటిల్ సాంగ్ మెరో గామ్ కథపరే పాటను ప్రీతి సాగర్ పాడింది.[9] ఈ పాట తరువాత అమూల్ కోసం టెలివిజన్ వాణిజ్య ప్రకటనల సౌండ్‌ట్రాక్‌గా ఉపయోగించబడింది.[10]

అవార్డులు

  1. ఉత్తమ హిందీ చిత్రం
  2. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత (విజయ్ టెండూల్కర్)
  1. ఉత్తమ గాయని - ప్రీతి సాగర్ (మెరో గామ్ కథపరే)[11]

మూలాలు

ఇతర లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ