భూమిక:ద రోల్

శ్యామ్ బెనగళ్ దర్శకత్వంలో 1977లో విడుదలైన హిందీ సినిమా

భూమిక, 1977 నవంబరు 11న విడుదలైన హిందీ సినిమా. షెమరూ మూవీస్ బ్యానరులో లలిత్ ఎం. బిజ్లానీ, ఫ్రెని వారియావా నిర్మాణంలో శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్మితా పాటిల్, అమోల్ పాలేకర్, అనంత్ నాగ్, నసీరుద్దీన్ షా, అమ్రీష్ పురి తదితరులు నటించారు.[1]

భూమిక
భూమిక సినిమా పోస్టర్
దర్శకత్వంశ్యామ్ బెనగళ్
రచనశ్యామ్ బెనగళ్
గిరీష్ కర్నాడ్
సత్యదేవ్ దూబే(మాటలు)
కథహంస వాడ్కర్
దీనిపై ఆధారితంహంస వాడ్కర్ రాసిన సాంగ్టీ ఐకా ఆధారంగా
నిర్మాతలలిత్ ఎం. బిజ్లానీ
ఫ్రెని వారియావా
తారాగణంస్మితా పాటిల్
అమోల్ పాలేకర్
అనంత్ నాగ్
ఛాయాగ్రహణంగోవింద్ నిహలానీ
కూర్పుభానుదాస్ దివాకర్
రామ్నిక్ పటేల్
సంగీతంవనరాజ్ భాటియా
మజ్రూహ్ సుల్తాన్ పురి
వసంత్ దేవ్(సాహిత్యం)
పంపిణీదార్లుషెమరూ మూవీస్
విడుదల తేదీ
1977, నవంబరు 11
సినిమా నిడివి
142 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

ఈ సినిమా జాతీయ ఉత్తమ నటి (స్మితా పాటిల్), జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగాల్లో భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు, ఉత్తమ చిత్రం విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమా 1978 కార్తేజ్ ఫిల్మ్ ఫెస్టివల్, చికాగో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. అక్కడ ఈ సినిమాకు గోల్డెన్ ఫలకం 1978 లభించింది. 1986లో అల్జీరియాలోని ఫెస్టివల్ ఆఫ్ ఇమేజెస్‌కు కూడా ఆహ్వానించబడింది.[2]

నటవర్గం

  • స్మితా పాటిల్ (ఊర్వశి అలియాస్ ఉషా)
  • అమోల్ పాలేకర్ (కేశవ్ దల్వి)
  • అనంత్ నాగ్ (రాజన్)
  • అమ్రీష్ పురి (వినాయక్ కాలే)
  • నసీరుద్దీన్ షా (సునీల్ వర్మ)
  • దిన పాఠక్ (శ్రీమతి కాలే, వినాయక్ తల్లి)
  • కుల్ భూషణ్ ఖర్బందా (సినిమా నిర్మాత హరిలాల్)
  • సులభా దేశ్‌పాండే (శాంత)
  • కిరణ్ వైరాలే (సుష్మా దల్వీ)
  • మోహన్ అగషే (సిద్ధార్థ్ సుతార్‌)
  • బెంజమిన్ గిలానీ (సావాన్ కే దిన్ ఆయే పాటలో మొఘల్ యువరాజు)
  • అభిషేక్
  • బేబీ రుఖ్సానా (చిన్నప్పటి ఉష)
  • బి.వి. కారంత్ (ఉష తండ్రి)
  • కుసుమ్ దేశ్‌పాండే (శాంత తల్లి)
  • రేఖా సబ్నిస్ (శ్రీమతి యశ్వంత్ కాలే)
  • బేబీ బిట్టో (చిన్నారి సుష్మ)
  • జి.ఎం. దురానీ (సంగీత ఉపాధ్యాయురాలు)
  • సుదర్శన్ ధీర్ (నృత్య దర్శకుడు)
  • మాస్టర్ అభితాబ్ (దీను)
  • సునీలా ప్రధాన్ (నటి శ్రీమతి బాల ది ప్రిన్సెస్)
  • ఓం పురి ('ఈవిల్ కింగ్' రంగస్థల నటుడు)
  • సవితా బజాజ్ (బసంతి)

సాంకేతికవర్గం

  • దర్శకుడు: శ్యామ్ బెనగళ్
  • నిర్మాత: లలిత్ ఎం. బిజ్లానీ, భీషమ్ ఎం. బిజ్లానీ, ఫ్రెని వారియావా, సిల్లూ ఎఫ్. వారియవా
  • రచయిత: హంస వాడ్కర్ (మరాఠీ నవల "సాంగ్టీ ఐకా" ఆధారంగా)
  • స్క్రీన్ ప్లే: శ్యామ్ బెనగళ్, గిరీష్ కర్నాడ్, సత్యదేవ్ దూబే
  • డైలాగ్స్: సత్యదేవ్ దూబే
  • సినిమాటోగ్రాఫర్: గోవింద్ నిహలానీ
  • ఎడిటర్: భానుదాస్ దివాకర్, రామ్నిక్ పటేల్
  • కాస్ట్యూమ్స్: కల్పనా లజ్మి
  • నృత్య దర్శకుడు: సుదర్శన్ ధీర్

నిర్మాణం

1940, 50లలో మరాఠీ థియేటర్, సినిమా గురించి హన్సా వాడ్కర్ రచయిత 1959లో రాసిన సాంగ్టీ ఐకా అనే ఆత్మకథ ఆధారంగా రూపొందించబడింది. ఈ జీవితచరిత్రను జర్నలిస్ట్ అరుణ్ సాధుకు చెప్పబడింది.[3]

ఈ సినిమా మహారాష్ట్ర ప్రాంత నేపథ్యంలో రూపొందింది. బెనగల్ మునుపటి సినిమాలు ఆంధ్రా ప్రాంత నేపథ్యంలో ఉండేవి. ఈ ప్రాంతం గురించి తెలియని కారణంగా, స్క్రిప్ట్ సహ-రచన కోసం స్క్రీన్ రైటర్, నాటక రచయిత గిరీష్ కర్నాడ్‌ని తీసుకున్నాడు. నాటకరంగ దర్శకుడు, నాటక రచయిత సత్యదేవ్ దూబే సంభాషణలు రాశాడు. నాన్-లీనియర్ కథనంతో పాటు, ఈ సినిమా కథలో కథ విధానాన్ని ఉపయోగించింది.[4]

నటి 22 ఏళ్ల స్మితా పాటిల్ సినిమారంగానికి కొత్తగా వచ్చింది. ప్రారంభంలో ఈ పాత్ర చాలా కష్టంగా అనిపించింది. అయినప్పటికి దానిని సమర్థవంతంటా పోషించి, జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. నేడు తన కెరీర్‌లో అత్యుత్తమ నటనలలో ఒకటిగా పరిగణించబడుతోంది.[5][6][7]

అవార్డులు, నామినేషన్లు

సంవత్సరంప్రతిపాదించిన విభాగంపురస్కారంఫలితం
25వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు (1977)స్మితా పాటిల్[8]జాతీయ ఉత్తమ నటిగెలుపు
శ్యామ్ బెనగళ్, గిరీష్ కర్నాడ్, సత్యదేవ్ దూబే[8]జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లేగెలుపు
1978లలిత్ ఎం. బిజ్లానీ, ఫ్రెని వారియావాఫిల్మ్‌ఫేర్ ఉత్తమ చిత్రంగెలుపు
స్మితా పాటిల్ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటిప్రతిపాదించబడింది

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ