భారత మహిళా క్రికెట్ జట్టు

భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టు మహిళల అంతర్జాతీయ క్రికెట్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ జట్టును 'ఉమెన్ ఇన్ బ్లూ' అని కూడా పిలుస్తారు.[8] దీనిని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) నిర్వహిస్తుంది. దీనికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) లో పూర్తి సభ్యత్వం కలిగి ఉంది. ఈ జట్టు మహిళల టెస్ట్ క్రికెట్, మహిళల ఒక రోజు అంతర్జాతీయ (WODI)) క్రికెట్, మహిళల అంతర్జాతీయ ట్వంటీ 20 రూపాలలో మ్యాచ్ లు ఆడుతుంది.

భారతదేశం
మారుపేరువుమెన్ ఇన్ బ్లు
అసోసియేషన్Board of Control for Cricket in India
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్Harmanpreet Kaur
కోచ్Hrishikesh Kanitkar (acting)
చరిత్ర
టెస్టు హోదా పొందినది1976
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
ICC హోదాList of International Cricket Council members|Full member (1926)
ICC ప్రాంతంAsian Cricket Council Asia
ఐసిసి ర్యాంకులుప్రస్తుత[1]అత్యుత్తమ
మవన్‌డే4th2nd (1 May 2020)
మటి20ఐ4th3rd (15 Nov 2019)
Women's Tests
తొలి మహిళా టెస్టుv  వెస్ట్ ఇండీస్ at the M. Chinnaswamy Stadium, Bangalore; 31 October – 2 November 1976
చివరి మహిళా టెస్టుv  ఆస్ట్రేలియా at Carrara Stadium, Gold Coast; 30 September – 3 October 2021
మహిళా టెస్టులుఆడినవిగెలిచినవి/ఓడినవి
మొత్తం[2]385/6
(27 draws)
ఈ ఏడు[3]00/0 (0 draws)
Women's One Day Internationals
తొలి మహిళా వన్‌డేv  ఇంగ్లాండు at Eden Gardens, Calcutta; 1 January 1978
చివరి మహిళా వన్‌డేv  బంగ్లాదేశ్ at Sher-e-Bangla National Cricket Stadium, Mirpur; 22 July 2023
మహిళా వన్‌డేలుఆడినవిగెలిచినవి/ఓడినవి
మొత్తం[4]304165/133
(2 ties, 4 no result)
ఈ ఏడు[5]31/1
(1 tie, 0 no results)
Women's World Cup appearances10 (first in 1978)
అత్యుత్తమ ఫలితం Runners-up (2005, 2017)
Women's World Cup Qualifier appearances1 (first in 2017 Women's Cricket World Cup Qualifier|2017)
అత్యుత్తమ ఫలితం Champions (2017)
Women's Twenty20 Internationals
తొలి WT20Iv  ఇంగ్లాండు at the County Cricket Ground, Derby; 5 August 2006
చివరి WT20Iv  బంగ్లాదేశ్ at Sher-e-Bangla National Cricket Stadium, Mirpur; 13 July 2023
WT20Isఆడినవిగెలిచినవి/ఓడినవి
మొత్తం[6]17091/75
(1 tie, 4 no results)
ఈ ఏడు[7]138/4
(0 ties, 1 no results)
Women's T20 World Cup appearances8 (first in 2009 ICC Women's World Twenty20|2009)
అత్యుత్తమ ఫలితం Runner-up (2020)

Test kit

ODI kit

T20I kit

As of 22 జులై 2023

భారతదేశ మహిళా జట్టు మొదట 1976లో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ తో ఆరంభించింది. తరువాత 1978లో ఆతిథ్యమిచ్చిన దేశంతో ప్రపంచ కప్ ఒకరోజు ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్ లు మొదలు పెట్టింది.[9] 2006లో ఇంగ్లాండ్తో జరిగిన తొలి మహిళా టీ20లో భారత్ అరంగేట్రం చేసింది.

2005లో ఆస్ట్రేలియా చేతిలో 98 పరుగుల తేడాతో ఓడిపోయింది ఇంకా 2017లో ఇంగ్లాండ్ చేతిలో 9 పరుగుల తేడాతో ఓడిపోవడం జరిగింది. అయితే ఈ రెండు సందర్భాలలో భారత జట్టు ఒక రోజు ప్రపంచ కప్ ఆఖరి రోజుకు (ఫైనల్) చేరుకుంది. భారత్ మరో మూడు సందర్భాల్లో - 1997, 2000, 2009 చివరి ముందు పోటీలకు (సెమీఫైనల్స్) చేరుకుంది. భారత్ ఒక సందర్భంలో (2020) టి20ఐ ప్రపంచ కప్ ఫైనల్స్, ఇంకా నాలుగు సందర్భాలలో (2009, 2010, 2018, 2023 - 2023) సెమీఫైనల్స్ కు చేరుకుంది.

2022 కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ రజత పతకాన్ని గెలుచుకుంది. 2018 వ సంవత్సరం మినహా మహిళల ఆసియా కప్ మిగిలిన అన్ని ఎడిషన్లను భారత్ గెలుచుకుంది. భారత్ మహిళా క్రికెట్ జట్టు ఆసియాలోనే అత్యంత విజయవంతమైన జట్టు.

చరిత్ర

సిడ్నీలో మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఆటకు ముందు భారత క్రికెట్ జట్టు సభ్యులు

1700 ల ప్రారంభంలో బ్రిటిష్ వారు భారతదేశానికి క్రికెట్ ని ప్రవేశ పెట్టారు. 1721 లో క్రికెట్ ఆడబడిన మొదటి డాక్యుమెంట్ ఉదాహరణ. దీనిని గుజరాత్ కి చెందిన కోలీలు ఆడారు. ఈ కోలీలు బ్రిటిష్ నౌకలను దోచుకునే సముద్రపు దొంగలు ఇంకా చట్టవ్యతిరేకులు కాబట్టి, ఈస్ట్ ఇండియా కంపెనీ క్రికెట్లో కోలీలను ఆడించింది, విజయవంతమైంది.[10][11] మొదటి భారతీయ క్రికెట్ క్లబ్ ను 1848లో బొంబాయిలో పార్సీ సమాజం స్థాపించింది. ఈ క్లబ్ 1877లో ఐరోపా వారితో (యూరోపియన్) తమ మొదటి మ్యాచ్ ఆడింది.[12] మొదటి అధికారిక భారత క్రికెట్ జట్టు 1911లో ఇంగ్లాండ్ లో పర్యటించింది. అక్కడ వారు ఇంగ్లీష్ కౌంటీ జట్లతో ఆడారు.[13] 1932లో ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఆడింది.[14] అదే సమయంలో అంటే 1934 లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య మొదటి మహిళల టెస్ట్ జరిగింది.[15] అయితే మహిళల క్రికెట్ చాలా కాలం తరువాత భారతదేశానికి వచ్చింది. 1973లో భారత మహిళా క్రికెట్ సంఘం (ఉమెన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఏర్పడింది.[16] భారత మహిళల జట్టు 1976లో తమ తొలి టెస్ట్ మ్యాచ్ వెస్టిండీస్ జట్టుతో ఆడింది.[17] 1978 నవంబరులో పాట్నాలోని మొయిన్ - ఉల్ - హక్ స్టేడియంలో శాంత రంగస్వామి నాయకత్వంలో వెస్టిండీస్ మీద తొలి టెస్ట్ విజయాన్ని భారత్ నమోదు చేసింది.[18][19]

1973లో మహారాష్ట్రలోని పూణేలో భారత మహిళల క్రికెట్ సంఘం (ఉమెన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) స్థాపించారు. ప్రేమాల చవాన్ దాని మొదటి అధ్యక్షురాలు. ఇది మొదట్లో అంతర్జాతీయ మహిళా క్రికెట్ మండలికి అనుబంధంగా ఉండేది. అయితే మహిళల క్రికెట్ ను అభివృద్ధి చేయడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చొరవతో, 2006 - 07లో భారత మహిళల క్రికెట్ సంఘం భారత క్రికెట్ నియంత్రణ మండలి ( బిసిసిఐ) లో విలీనం చేశారు.[20]

2021లో భారత మహిళల క్రికెట్ జట్టుకు రమేష్ పొవార్ ప్రధాన కోచ్గా వ్యవహరిస్తారని బిసిసిఐ ప్రకటించింది.[21][22] 2022లో భారత మహిళలు 23 సంవత్సరాలలో ఇంగ్లాండ్ గడ్డపై మొదటి సిరీస్ను గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించారు.

పరిపాలక సంఘం

2010 క్రికెట్ ప్రపంచ కప్ లో భారత బ్యాట్స్ వుమన్
మిథాలీ రాజ్ భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) భారత క్రికెట్ జట్టుకు, భారతదేశంలో మొదటి తరగతి (ఫస్ట్ - క్లాస్) క్రికెట్ కు పాలకమండలి. ఈ బోర్డు 1929 నుండి పనిచేస్తోంది, అంతర్జాతీయ క్రికెట్ మండలిలో భారతకి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇది ప్రపంచంలోని అత్యంత ధనిక క్రీడా సంస్థలలో ఒకటి. ఇది 2006 నుండి 2010 వరకు భారతదేశ మ్యాచ్ మీడియా హక్కులను 6,12,00,000 అమెరికన్ డాలర్లకు విక్రయించింది.[23] ఇది భారత జట్టు స్పాన్సర్ షిప్ లను, దాని భవిష్యత్ పర్యటనలు, జట్టు ఎంపికను నిర్వహిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తన భవిష్యత్ పర్యటనల కార్యక్రమం ద్వారా భారతదేశం రాబోయే మ్యాచ్ లను నిర్ణయిస్తుంది.

ఎంపిక (సెలక్షన్) కమిటీ

2020 సెప్టెంబరు 26న, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అఖిల భారత మహిళల ఎంపిక సమితి నియామకాన్ని ప్రకటించింది.[24] ఐదుగురు సభ్యులకి మాజీ ఎడమచేతి వాటం స్పిన్నర్ నీతు డేవిడ్ నాయకత్వం వహిస్తున్నారు.[24]

పోటీలకు స్పాన్సర్షిప్

ఐసీసీ పోటీలకు స్పాన్సర్షిప్
పోటీకిట్ తయారీదారుస్లీవ్ స్పాన్సర్
1973, 1978 మహిళల క్రికెట్ ప్రపంచ కప్
1982 హాన్సెల్స్ వీటా ఫ్రెష్ వరల్డ్ కప్
1988 షెల్ బైసెంటెనియల్ మహిళల ప్రపంచ కప్
1993 మహిళల క్రికెట్ ప్రపంచ కప్
1997 హీరో హోండా మహిళల ప్రపంచ కప్విల్స్
2000, 2005 మహిళల క్రికెట్ ప్రపంచ కప్
2009,2013, 2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్నైక్సహారా
2009, 2010,2012, 2014, 2016, 2018, 2020 ఐసీసీ మహిళల ప్రపంచ ట్వంటీ20
2022 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ఎంపిఎల్ స్పోర్ట్స్బైజూస్
2023 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్

ఈ జట్టుకు ప్రస్తుతం 'బైజూస్' స్పాన్సర్ చేస్తోంది.[25] OPPO స్పాన్సర్షిప్ 2017 నుండి 2022 వరకు అమలు కావాల్సి ఉంది, కానీ 2019 సెప్టెంబరు 5న 'బైజూస్' కి అప్పగించబడింది.[26] గతంలో 2014 నుండి 2017 వరకు భారత జట్టును స్టార్ ఇండియా, 2002 నుండి 2013 వరకు సహారా ఇండియా పరివార్ స్పాన్సర్ చేసింది.[27] భారత జట్టుకు కిట్ నైక్ ఎక్కువకాలం సరఫరా చేసింది, ఈ ఒప్పందం 2005, ఐదేళ్ల కాలానికి 2011, 2016లలో రెండు సార్లు వరుసగా పొడిగించారు.[28][29][30] అంతర్జాల ఆటల వేదిక (ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్) మొబైల్ ప్రీమియర్ లీగ్ అనుబంధ సంస్థ ఎంపిఎల్ స్పోర్ట్స్ అప్పారెల్ & యాక్సెసరీస్ ( MPL Sports Apparel & Accessories) 2020 అక్టోబరునుంచి కిట్ సరఫరా చేస్తోంది.[31][32][33][34]

కిట్ లు స్పాన్సర్షిప్
కాలం.కిట్ తయారీదారుచొక్కా స్పాన్సర్
1993 - 1996విల్స్
1999 - 2001
2001 - 2002
2002 - 2003సహారా
2003 - 2005
2005 - 2013నైక్
2014 - 2017స్టార్ ఇండియా
2017 - 2019ఒప్పో
2019 - 2020బైజూస్
2020 - 2023ఎం.పి.ఎల్. స్పోర్ట్స్
2023 - 2028అడిడాస్టీబీఏ

పేటీఎం 2015లో భారతదేశంలో జట్టు ఆడిన అన్ని మ్యాచ్ లకు శీర్షిక హక్కును కొనుగోలు చేసింది, 2019 నుంచి 2023 వరకు పొడిగించింది.[35][36] స్టార్ ఇండియా, ఎయిర్టెల్ కంపెనీలు ఇంతకు ముందు శీర్షిక హక్కుదారులుగా వ్యవహరించాయి.[37][38]

ప్రస్తుత స్పాన్సర్లు & భాగస్వాములు
జట్టు స్పాన్సర్డ్రీమ్ 11
టైటిల్ స్పాన్సర్మాస్టర్ కార్డ్
కిట్ స్పాన్సర్అడిడాస్
అధికారిక భాగస్వాములుహ్యుందాయ్
లాఫార్జ్ హోల్సిమ్ (అంభుజా సిమెంట్స్ ACC)
అధికారిక ప్రసారకర్తటీబీఏ

ఇటీవలి భారతదేశ మ్యాచ్ లు

అంతర్జాతీయ క్రికెట్లో ఫలితాలు, రాబోయే మ్యాచ్లు

ద్వైపాక్షిక సిరీస్ లు పర్యటనలు
తేదీవ్యతిరేకంగాH / A / Nఫలితాలు [మాచ్ లు]
టెస్ట్WODIటీ20 ప్రపంచకప్
2022 ఫిబ్రవరిన్యూజిలాండ్విదేశం-1-4 [5]0 - 1 [1]
2022 సెప్టెంబరు  ఇంగ్లాండువిదేశం-3-0 [3]1 - 2 [3]
2022 డిసెంబరు  ఆస్ట్రేలియాహోమ్--1 - 4 [5]
మల్టీటైమ్ సిరీస్ టోర్నమెంట్లు
తేదీసిరీస్ఫార్మాట్స్థానంఫలితాలు
మార్చి - 2022 ఏప్రిల్ 2022 మహిళా క్రికెట్ ప్రపంచ కప్పుWODI5వది3 - 4 [ 7 ]
జూలై - 2022 ఆగస్టు 2022 కామన్ వెల్త్ ఆటలుమహిళా టీ20 ప్రపంచకప్2వ3 - 3 [ 5 ]
2022 అక్టోబరు 2022 మహిళా టీ20 ఆసియా కప్మహిళా టీ20 ప్రపంచకప్1వది7 - 1 [ 8 ]
2023 ఫిబ్రవరి2023 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్మహిళా టీ20 ప్రపంచకప్3వది3 - 3 [ 5 ]

ఆసియా క్రీడలు (ఏషియన్ గేమ్స్) 2023

ఆసియా క్రీడలు 2023లో మహిళల క్రికెట్ పోటీ 2023 సెప్టెంబరు,19న చైనాలో హాంగ్జౌలో ప్రారంభం అయ్యాయి. భారత మహిళల జట్టు ఆసియా క్రీడల్లో తొలిసారిగా ఆడింది. మహిళల పోటీలో మొత్తం 11 మ్యాచ్‌లు ఆడారు. అన్ని మ్యాచ్‌లు జెజియాంగ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ పింగ్‌ఫెంగ్ క్రికెట్ ఫీల్డ్‌లో జరిగాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. సెప్టెంబరు 25న భారత మహిళా క్రికెట్ జట్టు చివరిరోజు ఆట శ్రీలంక జట్టుతో ఆడి 19 పరుగుల దూరంలో గెలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.[39]

మహిళా క్రీడాకారులు

జట్టు

ఇటీవల బిసిసిఐతో ఒప్పందం కుదుర్చుకున్న ఒక రోజు లేదా టి20ఐ జట్లలో ఎంపికైన క్రియాశీల క్రీడాకారుల జాబితా. ఈ జాబితా 2023 జూలై 13 న నవీకరించబడింది. టోపీ లేని క్రీడాకారులు ఏటవాలు అక్షరాలలో (ఇటాలిక్స్) జాబితా చేశారు.

ఎస్ / ఎన్= క్రీడాకారుల చొక్కా సంఖ్య | ఫార్మాట్= ఆట రూపం
పేరువయస్సుబ్యాటింగ్ శైలిబౌలింగ్ శైలిస్వదేశీ జట్టుC/GరూపముS/N
బాటర్స్
స్మృతి మందాన27ఎడం చేతి వాటం-మహారాష్ట్రAODI & T20I

(Vice-captain)

18
హర్మన్‌ప్రీత్ కౌర్35కుడిచేతి వాటంరైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్పంజాబ్AODI & T20I

(Captain)

7
షఫాలీ వర్మ20కుడిచేతి వాటంరైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్హర్యానాBODI & T20I17
జెమిమా రోడ్రిగ్స్23కుడిచేతి వాటంరైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ముంబైBODI & T20I5
సబ్భినేని మేఘన28కుడిచేతి వాటం-రైల్వేCT20I27
ప్రియా పునియా27కుడిచేతి వాటంకుడిచేతి మీడియంఢిల్లీ-ODI16
ఆల్ రౌండర్లు
దీప్తి శర్మ26ఎడం చేతి వాటంరైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్బెంగాల్AODI & T20I6
పూజా వస్త్రాకర్24కుడిచేతి వాటంకుడిచేతి మీడియంమధ్యప్రదేశ్CODI & T20I34
హర్లీన్ డియోల్26కుడిచేతి వాటంరైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్హిమాచల్ ప్రదేశ్CODI & T20I98
దేవికా వైద్య26ఎడం చేతి వాటంరైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్మహారాష్ట్రCODI & T20I97
అమంజోత్ కౌర్24కుడిచేతి వాటంకుడిచేతి మీడియంపంజాబ్-ODI & T20I30
మిన్ను మణి25ఎడం చేతి వాటంరైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్కేరళ-T20I71
కనికా అహుజా21ఎడం చేతి వాటంరైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్పంజాబ్-T20I-
వికెట్ కీపర్లు
యస్తికా భాటియా24ఎడం చేతి వాటం-బరోడాCODI & T20I11
రిచా ఘోష్20కుడిచేతి వాటం-బెంగాల్BT20I13
ఉమా చెత్రీ21కుడిచేతి వాటం-అస్సాంODI & T20I
స్పిన్ బౌలర్లు
రాజేశ్వరి గయక్వాడ్33కుడిచేతి వాటంఎడమ చేయి ఆర్థోడాక్స్రైల్వేస్BODI & T20I1
స్నేహ రానా30కుడిచేతి వాటంరైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్రైల్వేస్CODI & T20I2
రాధా యాదవ్24కుడిచేతి వాటంఎడమ చేయి ఆర్థోడాక్స్బరోడాCT20I21
అనూషా బారెడ్డి21ఎడం చేతి వాటంఎడమ చేయి ఆర్థోడాక్స్ఆంధ్ర-ODI & T20I3
రాశి కనోజియా26కుడిచేతి వాటంఎడమ చేయి ఆర్థోడాక్స్ఉత్తర ప్రదేశ్-ODI & T20I36
పేస్ బౌలర్లు
రేణుకా సింగ్28కుడిచేతి వాటంకుడిచేతి మీడియం/వేగంరైల్వేస్BODI & T20I10
మేఘనా సింగ్30కుడిచేతి వాటంకుడిచేతి మీడియంరైల్వేస్CODI & T20I16
అంజలి శర్వాణి26ఎడం చేతి వాటంఎడమ చేతి మీడియంరైల్వేస్CODI & T20I28
మోనికా పటేల్25ఎడం చేతి వాటంఎడమ చేతి మీడియంకర్ణాటక-ODI & T20I-
టిటాస్ సాధు19కుడిచేతి వాటంకుడిచేతి మీడియంబెంగాల్-T20I-

వేతనాలు

ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజు ₹15 లక్షలు (టెస్టుకు $ 19,000), మ్యాచ్ ఫీజు ₹6 లక్షలు (వన్డేలకు US $ 7,500), మ్యాచ్ ఫిజు ₹3 లక్షలు (టి20ఐకి US $ 3,800). బిసిసిఐ 2022 అక్టోబరు 27న పురుషుల మహిళల జట్ల మ్యాచ్ సమాన రుసుములో విధానాన్ని అమలు చేస్తోంది.[41] ఆటగాళ్ల వేతనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • గ్రేడ్ ఎ - సంవత్సరానికి ₹50 లక్షలు (US $ 63,000)
  • గ్రేడ్ బి - సంవత్సరానికి ₹30 లక్షలు (US $ 38,000)
  • గ్రేడ్ సి - ₹10 లక్షలు (సంవత్సరానికి 13,000 డాలర్లు)

సిబ్బంది

  • ప్రధాన శిక్షకుడు - -
  • బ్యాటింగ్ కోచ్ - హృషీకేశ్ కనిత్కర్[42]
  • ఫీల్డింగ్ కోచ్ - అభయ్ శర్మ
  • నెట్స్ ట్రైనర్స్ - తన్వీర్ శుక్లా, సౌరవ్ త్యాగి, ఉత్కర్ష్ సింగ్, అఖిళ్ ఎస్. ప్రసాద్
  • ఫిజియోథెరపిస్ట్ - మిత్రా అమీన్
  • ఫిట్నెస్ ట్రైనర్ - రాధా కృష్ణస్వామి
  • విశ్లేషకుడు - దేవరాజ్ రౌత్

ఇవి కూడా చూడండి

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ