బొకారో స్టీల్ సిటీ

బొకారో స్టీల్ సిటీ లేదా బోకారో, భారతదేశం లోని ప్రణాళికాబద్ధమైన నగరాల్లో ఒకటి. ఇదొక ప్రధానమైన పారిశ్రామిక కేంద్రం. జార్ఖండ్‌ రాష్ట్రంలో నాల్గవ అతిపెద్ద నగరం. ఇది బొకారో జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం.

బొకారో స్టీల్ సిటీ
నగరం
సెక్టరు 4, కాళీకాలయం, రైల్వే స్టేషను,ఉక్కు కర్మాగారం, పార్కు, గర్గా ఆనకట్ట, మక్కా మసీదు, బొకారో మాల్
బొకారో స్టీల్ సిటీ is located in Jharkhand
బొకారో స్టీల్ సిటీ
బొకారో స్టీల్ సిటీ
జార్ఖండ్ పటంలో బొకారో
Coordinates: 23°40′N 86°09′E / 23.67°N 86.15°E / 23.67; 86.15
దేశం India
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాబొకారో
Founded bySteel Authority of India
Named forSteel Manufacturing Sector/Gas Exploration
Government
 • TypeCorporate
 • BodySteel Authority of India
విస్తీర్ణం
Includes the sub urban area of Chas Municipal Corporation and Balidih Industrial Area.
 • Total183 కి.మీ2 (71 చ. మై)
 • Rank4th in state
Elevation
210 మీ (690 అ.)
జనాభా
 • Total5,63,417[1]
 • Rank4th in state
DemonymBokaroite
Time zoneUTC+5:30 (IST)
PIN
827 001
Telephone code(+91)- 06542
Vehicle registrationJH 09

అవలోకనం

బొకారో స్టీల్ సిటీ బోకారో జిల్లా ముఖ్యపట్టణం. అలాగే కోయిలాంచల్ శ్రేణి ( బోకారో, ధన్బాద్, గిరిదిహ్ ). హజారీబాగ్, ధన్బాద్, గిరిడి, కోడెర్మా, చత్రా, బోకారో, రామ్‌గఢ్ (ఉత్తర చోటానాగ్‌పూర్ డివిజన్) ఏడు జిల్లాలను కలిపిన పోలీసు ఐజి జోన్ ప్రధాన కార్యాలయాలం ఇక్కడే ఉంది. [2]

భౌగోళికం

స్థానం

వద్ద బొకారో స్టీల్ సిటీ 23°40′N 86°09′E / 23.67°N 86.15°E / 23.67; 86.15 వద్ద ఉంది.

ఈ నగరం సముద్ర మట్టానికి 210 మీటర్లు (690 అడుగులు) ఎత్తున ఉంది. దీని విస్తీర్ణం 183 చదరపు కిలోమీటర్లు (71 చదరపు మైళ్లు). తూర్పున ధన్‌బాద్, పురులియా, పశ్చిమాన రామ్‌గఢ్, హజారిబాగ్, ఉత్తరాన గిరిడి, దక్షిణాన రాంచీ జిల్లాలు ఈ జిల్లాకు సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బొకారో స్టీల్ సిటీ భారతదేశంలో 86 వ అతిపెద్ద పట్టణ సముదాయంగా. జార్ఖండ్‌లో 4 వ అతిపెద్ద నగరం. [3]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బొకారో స్టీల్ సిటీ పట్టణ ప్రాంత మొత్తం జనాభా 5,63,417, వీరిలో పురుషులు 2,99,232, మహిళలు 2,64,185. [1] బొకారో స్టీల్ సిటీ పట్టణ ప్రాంతంలో బోకారో స్టీల్ సిటీ (సెన్సస్ టౌన్ ), చాస్ (నగర్ నిగం), బంధగోరా (సిటి) లు ఉన్నాయి. [4] ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత రేటు 84.87%, పురుషుల అక్షరాస్యత 92.27%, స్త్రీ అక్షరాస్యత 76.50%.

బొకారో స్టీల్ సిటీ (సిటి) జనాభా 4,13,934, వీరిలో పురుషులు 2,20,088, ఆడవారు 1,93,846. 0-6 మధ్య వయస్సు జనాభా 48,834. ఏడేళ్ళకు పైబడీనవారిలో అక్షరాస్యత రేటు 84.94%, పురుషుల అక్షరాస్యత 92.35%, స్త్రీ అక్షరాస్యత 76.54%. [5]

భాషలు

Languages of Bokaro Steel City - CT (2011)[6]

  Hindi (25.4%)
  Bhojpuri (17.8%)
  Khorta (17.7%)
  Magahhi (10.2%)
  Urdu (6.7%)
  Bengali (6.2%)
  Santali (5.5%)
  Maithili (3.5%)
  Other (7%)

ఆర్థిక వ్యవస్థ

బొకారో స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం, దీనిని స్టీల్ గేట్ అని పిలుస్తారు
మరఫారి వద్ద ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఒఎన్‌జిసి)

నగర ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థాపించిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌పై ఆధారపడి ఉంది. సోవియట్ యూనియన్ సహకారంతో ఈ ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు. బోకారో స్టీల్ ప్లాంట్ విస్తరణ [7] 2011 కి ముందు దాని సామర్థ్యాన్ని 4.5 మెట్రిక్ టన్నులకు విస్తరించారు.

కోల్‌కతాకు చెందిన నీటి పైపుల తయారీదారైన వేదాంత ఎలక్ట్రోస్టీల్ కాస్టింగ్స్ లిమిటెడ్ నగరానికి 18 కిలోమీటర్లు (11 మైళ్లు) దూరంలో 2,500 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, అక్కడ 2.2 ఎమ్‌టిపిఎ సామర్థ్యం గల ఉక్కు కర్మాగారాన్ని నిర్మించింది. 2010 నుండి పని చేస్తున ఈ ప్రాజెక్టుపై ఆ సంస్థ రూ. 8,000 కోట్ల పెట్టుబడి పెట్టింది. [8] [9]

ఒఎన్‌జిసి బోకారో కోల్ బెడ్ మీథేన్ (సిబిఎం) బ్లాక్ బికె-సిబిఎం -2001 / 1 ను నడుపుతోంది. సంస్థలో ఒఎన్‌జిసి వాటా 80 శాతం కాగా, మిగిలిన 20 శాతం ఇండియన్ ఆయిల్ కార్పొరేషను (ఐఓసి) వద్ద ఉంది. 2017-18 లో రూ 8230 కోట్ల పెట్టుబడి పెట్టి రోజుకు 9 లక్షల క్యూబిక్ మీటర్ల గరిష్ట ఉత్పత్తిని సాధించడానికి ప్రణాళికలు వేసింది. [10] డాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ (డిసిబిఎల్) బొకారోలో 1.5 మిలియన్ టన్నుల సిమెంట్ ప్లాంటును నిర్వహిస్తోంది. [11]

రవాణా

గాలి

120 కి.మీ. దూరంలో ఉన్న రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయం సమీప వాణిజ్య విమానాశ్రయం. బోకారో విమానాశ్రయం నుండి వాణిజ్య విమానాలు నడవడం లేదు. అయితే, ఉడాన్ పథకం కింద బొకారోను పాట్నాకు, కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానించాలని భారత ప్రభుత్వం ప్రణాళిక వేసింది. [12]

రైల్వే

బొకారో స్టీల్ సిటీ రైల్వే స్టేషన్ ఝరియా కోల్‌ఫీల్డ్ అంచున ఉంది. బొకారోకు, చుట్టుపక్కల మైనింగ్-పారిశ్రామిక ప్రాంత నివాసితులకూ ఇది సేవలు అందిస్తుంది. ఇది ఎ-కేటగిరీ రైల్వే స్టేషన్, ఎస్కలేటర్లు, [13] ఎసి వెయిటింగ్ రూములు, ఫుడ్ కోర్ట్, ఛార్జింగ్ పాయింట్లు, ఒక పాదచారుల వంతెన, కంప్యూటరీకరించిన టికెట్ రిజర్వేషన్ కౌంటర్లతో సహా సౌకర్యాలు ఉన్నాయి. [14] ఈ రైల్వే స్టేషను ఆగ్నేయ రైల్వేలో భాగం. పొరుగు రాష్ట్రాలకు, ప్రధాన మెట్రోపాలిటన్ ప్రాంతాలైన ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలకు ఇక్కడి నుండి రైళ్ళు నడుస్తున్నాయి.

రోడ్డు

ధన్బాద్-బొకారో-రాంచీ-జంషెడ్పూర్ మెగా ఇండస్ట్రియల్ కారిడార్ ఎక్స్‌ప్రెస్ రహదారి 2018 లో బొకారో వరకు పూర్తయింది. బోకారో-ధన్‌బాద్ 6 లేన్‌ల విస్తరణ 2020 లో పూర్తి కావలసి ఉంది. [15] బొకారో బస్ స్టాండ్ ఒక ప్రైవేట్ బస్ స్టాండు. కొత్త బస్ స్టాండ్ కోసం సెక్టార్ -12 లో భూసేకరణ జరుగుతోంది. జాతీయ రహదారి -18 (పాత ఎన్‌హెచ్ -32), జాతీయ రహదారి -23 నగరం గుండా పోతున్నాయి

ప్రస్తావనలు

 

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ