బెజ్జంకి లక్ష్మీనరసింహాస్వామి దేవాలయం

బెజ్జంకి లక్ష్మీనరసింహాస్వామి దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లా, బెజ్జంకి గ్రామంలోని దేవాలయం.[1] ఈ దేవాలయంపై గోపిక నృత్యాలు, త్రిమూర్తుల విగ్రహాలు, సముద్ర మథన కథ మొదలైన వాటిని అద్భుతంగా చెక్కాబడ్డాయి.[2]

బెజ్జంకి లక్ష్మీనరసింహాస్వామి దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:సిద్ధిపేట జిల్లా
ప్రదేశం:బెజ్జంకి, బెజ్జంకి
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:లక్ష్మీనరసింహాస్వామి
ప్రధాన పండుగలు:బ్రహ్మోత్సవాలు

చరిత్ర

గ్రామంలోని 17ఎకరాల స్థలంలో 200 అడుగుల ఎత్తున్న నల్లని ఏకశిలపై లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వెలసింది. 1053లో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి త్రైలోకమల్ల సోమేశ్యరుని శనిగరం శాశనంలో బెజవాంక గ్రామంలో భూమి శనిగరంలోని మధుపేశ్వరస్వామి మాన్యంగా ఇచ్చినట్టు ప్రస్తావించబడింది. కాకతీయుల కాలంలో కాటయ రుద్రుని మంత్రి ఇక్కడ ఒక శివాలయం కూడా కట్టించారు. ఒకనాటి కలలో తాను శివునితో పాటు అవతరించానని నరసింహాస్వామి చెప్పడంతో ఆ సమీపంలోని గుహలలో వెలసిన నరసింహస్వామికి గుడి కట్టించారని బెజ్జంకి స్థలపురాణం చెబుతున్నది.

బ్రహ్మోత్సవాలు

చైత్ర శుద్ధ సప్తమి నుండి పౌర్ణమి వరకు పన్నెండు రోజులపాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు (ఆండాళ్ కళ్యాణం, రథోత్సవం) జరుగుతాయి. ఈ ఉత్సవాలకు 25,000 మందికి పైగా భక్తులు ఇతర ప్రదేశాలనుండి కూడా విచ్చేస్తారు.[3] ఎడ్లబండి పోటీలు కూడా నిర్వహించబడుతాయి.[4]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ